ఇజ్రాయెల్-గాజా: పదేళ్ల నిరీక్షణ, మూడు ఐవీఎఫ్‌ ప్రయత్నాలతో పుట్టిన కవలల్ని పోగొట్టుకున్న తల్లి.. దాడిలో ఒకే కుటుంబంలోని 20 మంది మృతి

ఇజ్రాయెల్-గాజా: పదేళ్ల నిరీక్షణ, మూడు ఐవీఎఫ్‌ ప్రయత్నాలతో పుట్టిన కవలల్ని పోగొట్టుకున్న తల్లి.. దాడిలో ఒకే కుటుంబంలోని 20 మంది మృతి

గాజాలోని దక్షిణ రఫాలోని ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇద్దరు కవలలు సహా ఒకే కుటుంబంలోని ఇరవై మంది మృతి చెందారు. నిద్రిస్తున్న సమయంలో వారిపై దాడి జరిగింది.

ఈ ఘటనలో ఐదునెలల వయసున్న కవలలు విస్సామ్, నియామ్‌లను కోల్పోయారు తల్లి రానియా.

పిల్లల కోసం పదేళ్ల పాటు పరితపించిన రానియాకు, మూడు ఐవిఎఫ్ ప్రయత్నాల తర్వాత పుట్టిన కవలలు వాళ్లు. ఇప్పుడు ఆ రానియాకు మిగిలింది ఆ పసిపిల్లల జుబ్బాలు మాత్రమే.

అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు చొరబడి చేసిన మెరుపుదాడులకు ప్రతీకారంగా మొదలైన ఇజ్రాయెల్ దాడులు గాజాలో కొనసాగుతూనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి..

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)