ఇండియా - పాకిస్తాన్ బోర్డర్‌లో ఇదీ పరిస్థితి..

ఇండియా - పాకిస్తాన్ బోర్డర్‌లో ఇదీ పరిస్థితి..

''మేం ఎలాగోలా ఉరీ సెక్టార్‌లోని సలామాబాద్‌ అనే ఈ చిన్నగ్రామానికి చేరుకోగలిగాం. ఈ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా మారిపోయింది. చుట్టుపక్కల ఒక్కరు కూడా కనిపించడం లేదు.

ఇక్కడ ఈ రెండు ఇళ్లు ఇప్పటికీ మండుతూ ఉన్నాయి. ఈ ఇళ్లలో ఉన్న వారికి ఏం జరిగిందో మాకు సమాచారం లేదు. వేర్వేరు చోట్ల నివసిస్తున్న కొందరు స్థానికులకు ఫోన్ చేసి మాట్లాడాం.

పాకిస్తాన్‌లో దాడులు చేశామని భారత్ ప్రకటించిన తర్వాత సరిహద్దుకు అవతలి నుంచి పాకిస్తాన్ దాడులు చేసిందని వాళ్లు మాతో చెప్పారు. కొన్ని బాంబులు ఈ ఇంటిపై కూడా పడ్డాయి.''

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)