తుర్కియేలో నిరసనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులను జైల్లో పెడుతున్న ప్రభుత్వం

వీడియో క్యాప్షన్, తుర్కియే నిరసనల కవరేజ్‌ను అడ్డుకునే ప్రయత్నంలో ఏడుగురు జర్నలిస్టులను అరెస్టు చేసిన ఎర్దొవాన్ ప్రభుత్వ బలగాలు
తుర్కియేలో నిరసనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులను జైల్లో పెడుతున్న ప్రభుత్వం

తుర్కియేలో అల్లర్లు, నిరసనలను కవర్ చేసిన ఫోటో జర్నలిస్ట్‌ యాసిన్‌ను అరెస్ట్ చేసిన ప్రభుత్వం రెండు రోజుల తర్వాత విడిచిపెట్టింది.

తుర్కియేలో పరిస్థితులను రిపోర్ట్ చేసినందుకు తనతో పాటు మరో ఆరుగురు జర్నలిస్టులను అరెస్ట్ చేశారని యాసిన్ బీబీసీకి చెప్పారు.

రెండు వారాల క్రితం జరిగిన ఇస్తాంబుల్ మేయర్ ఇమామోలు అరెస్ట్ తర్వాత దేశంలో చెలరేగిన అల్లర్లలో 2వేల మంది వరకు ప్రజలను నిర్భంధంలోకి తీసుకున్నారు.

ప్రతిపక్షం స్ట్రీట్ టెర్రరిజం‌ను ఉసిగొల్పుతుందని, దేశానికి నష్టంచేస్తోందని అధ్యక్షుడు ఎర్దోవాన్ ఆరోపించారు.

తుర్కియేలో నిరసనలు మరింత తీవ్రమవుతున్నాయి. దశాబ్దకాలంలో ఆ దేశంలో ఎన్నడూ చూడనంత అతి పెద్ద నిరసన ప్రదర్శనలివి.

తుర్కియే నిరసనలు

ఫొటో సోర్స్, Reuters

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)