అమెరికా సీక్రెట్ సర్వీస్ ఎక్కడ విఫలమైంది, ముందుగానే సాయుధుడిని ఎందుకు గుర్తించలేకపోయింది?

అమెరికా సీక్రెట్ సర్వీస్ ఎక్కడ విఫలమైంది, ముందుగానే సాయుధుడిని ఎందుకు గుర్తించలేకపోయింది?

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటన అనంతరం అమెరికా సీక్రెట్ సర్వీస్ సామర్థ్యంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.

ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా 4 నెలలు మాత్రమే సమయం ఉన్న వేళ కీలక నేతల భద్రత విషయంలో ఇంత ప్రమాదకర లోపాలు ఎలా జరిగాయి?

సాయుధుడు అంత శక్తిమంతమైన రైఫిల్‌ను వేదికకు అంతదగ్గరగా ఎలా తీసుకురాగలిగాడు?

భద్రతా సిబ్బంది దానిని ఎందుకు గుర్తించలేదు?

వేదికకు కేవలం 130 మీటర్ల దూరంలో పైకప్పు మీదున్న సాయుధుడిని కనిపెట్టడంలో సీక్రెట్ సర్వీస్ ఎలా విఫలమైంది?

రూఫ్ మీద సాయుధుడు ఉన్నాడని ప్రజలు అరుస్తూ హెచ్చరిస్తున్నా కూడా స్థానిక పోలీసులు ఎందుకు స్పందించలేదు? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)