మోఖా తుపాను: బంగ్లాదేశ్, మియన్మార్ మధ్య తీరం దాటి సృష్టించిన విధ్వంసం ఇదే...

మోఖా తుపాను: బంగ్లాదేశ్, మియన్మార్ మధ్య తీరం దాటి సృష్టించిన విధ్వంసం ఇదే...

పెను తుపాను మోఖా బంగ్లాదేశ్, మియన్మార్ మధ్య తీరం దాటింది.

ఆదివారం రాత్రి ఇది తీరం దాటినట్లు అధికారులు చెప్పారు.

దీని ప్రభావంతో బంగ్లాదేశ్‌లో వందలాది పునరావాస కేంద్రాలు ధ్వంసమయ్యాయి.

ఈ తుపాను కారణంగా మియన్మార్‌లో ఐదుగురు మృతి చెందారు.

బంగ్లాదేశ్‌లో ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదు.

కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడగా, మరికొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తుపాను ధాటికి పశ్చిమ మియన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.

చాలా ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

బంగ్లాదేశ్‌లో 7.5 లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)