సూడాన్: దయనీయంగా లక్షలాది చిన్నారులు

సూడాన్: దయనీయంగా లక్షలాది చిన్నారులు

సూడాన్‌లో అంతర్యుద్ధం లక్షలాది మంది చిన్నారులను దయనీయ పరిస్థితుల్లోకి నెట్టేసింది.

సైన్యం, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌కు మధ్య కొనసాగుతున్న అంతర్యుర్ధం కారణంగా సూడాన్ వ్యాప్తంగా 40 లక్షల మంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు.

వీరిలో ఏడు లక్షల ముప్పై వేల మంది చిన్నారులు తీవ్రమైన పౌష్టికాహార లోపం కారణంగా ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్య సమితి చెబుతోంది.

ఓండుర్మాన్ నగరంలోని చిన్నారుల షెల్టర్ హోం‌కు వెళ్లిన బీబీసీ ప్రతినిధి మొహనాద్ హాషిమ్, బాధిత చిన్నారులతో నేరుగా మాట్లాడి వాళ్ల పరిస్థితుల గురించి తెలుసుకున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)