దాదాపు 2 వేల నాటుకోళ్లను పొలాల్లో వదిలి వెళ్లారు..

దాదాపు 2 వేల నాటుకోళ్లను పొలాల్లో వదిలి వెళ్లారు..

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి సమీపంలో సిద్దిపేట రహదారిపై, పొలాల్లో దాదాపు 2 వేల నాటు కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారని స్థానిక ఇన్‌స్పెక్టర్ రమేశ్ బీబీసీకి తెలిపారు.

స్థానికులు దొరికిన కోళ్లను తీసుకుని వెళ్లారు.

ఈ కోళ్లలో కొన్నింటికి ఈకలు ఊడిపోయి ఉన్నట్లు గుర్తించారు.

రోగం వచ్చిన కోళ్లను వదిలి వెళ్లారా? అని పరీక్షించేందుకు గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ కొన్ని కోళ్లను పశువైద్యశాఖకు పంపించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)