కొత్త ఏడాదిలో ఆకాశ అద్భుతం, నెలవంకతో పోటీపడి మెరిసిన శుక్రుడు

    • రచయిత, రూత్ కామర్‌ఫోర్డ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచంలోని పలుప్రాంతాలలో శుక్రవారం రాత్రి వేళ ఆకాశంలోకి చూసినవారికి ఒక అద్భుత దృశ్యం కనిపించింది.

నెలవంక మీదుగా శుక్రుడు ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపించాడు.

భారత్‌‌ సహా అమెరికా, బ్రిటన్, చైనా, తుర్కియే దేశాలలో ఈ ఖగోళ వింత దర్శనమిచ్చింది.

శుక్రగ్రహాన్ని ఈవినింగ్ స్టార్‌, మార్నింగ్ స్టార్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే దీని మీద కాంతి పడినప్పుడు, నింగిలో అత్యంత ప్రకాశవంతమైన తారలా మెరుస్తుంది.

ఈ కొత్త సంవత్సరంలో మరిన్ని ఖగోళ అద్భుతాలు ఆకాశంలో ఆవిష్కృతం కానున్నాయి.

భవిష్యత్తులో తోకచుక్కల వర్షాన్ని కూడా చూసే అవకాశం ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)