ఈ ఏడాది మూడో వంతు దేశాలకు ఘోరమైన మాంద్యం: ఐఎంఎఫ్ జోస్యం

ఈ ఏడాది మూడో వంతు దేశాలకు ఘోరమైన మాంద్యం: ఐఎంఎఫ్ జోస్యం

ప్రపంచ ఆర్థికవ్యవస్థలో మూడో వంతు ఈ ఏడాది ఘోరమైన మాంద్యాన్ని చవి చూడక తప్పదని హెచ్చరించింది అంతర్జాతీయ ద్రవ్యనిధి.

కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచ దేశాలు లాక్‌డౌన్లను, ఆంక్షల్ని తొలగించడం మొదలుపెడుతుండగా... ధరలు మండిపోవడం మొదలైంది.

అయితే, అధిక ద్రవ్యోల్బణం తాత్కాలికమేనని బ్యాంకులు అంటున్నాయి. కానీ యుక్రెయిన్‌లో యుద్ధం, పెరుగుతున్న ధరలు, అధికవడ్డీ రేట్లు, చైనాలో కోవిడ్ విజృంభణ కారణంగా ప్రపంచ ఆర్థికవ్యవస్థ మరింత సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని IMF అధిపతి క్రిస్టలినా జార్జియేవా అన్నారు.

ప్రపంచంలో ఎక్కువ దేశాల్లో ఆహార ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని.. ఐక్యరాజ్య సమితి ఆహార సంస్థ చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)