You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
3, 2, 1... హ్యాపీ న్యూ ఇయర్... వీళ్లకు కాస్త ముందుగా వచ్చింది!
బై బై 2024... వెల్‌కమ్ 2025
2024 సంవత్సరానికి గుడ్‌బై చెప్పి 2025 ఏడాదికి వెల్‌కమ్ చెప్పాల్సిన సమయం వచ్చేసింది.
మీకో ఆసక్తికర విషయం చెప్పమంటారా..
ఈ భూగోళం మొత్తానికి న్యూ ఇయర్ రావడానికి సరిగ్గా 26 గంటల సమయం పడుతుంది.
మంగళవారం మధ్యాహ్నం 3:30 (10:00 GMT) పసిఫిక్ ద్వీపంలోని కిరిబాటిలో తొలుత కొత్త ఏడాది మొదలవుతుంది.
బుధవారం సాయంత్రం 5:30 (12:00 GMT) గంటలకు బేకర్ ద్వీపంలో అన్ని ప్రాంతాలలో కంటే ఆలస్యంగా, ఆఖరున ఈ వేడుకలు జరుగుతాయి. ఈ 26 గంటల వ్యవధిలో రకరకాల సమయాల్లో వేర్వేరు దేశాలకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.
కొన్ని దేశాలకు సంబంధించిన వేడుకలను ఈ కథనంలో చూద్దాం.
26 గంటల్లో 38 సార్లు న్యూ ఇయర్
మీరు ఈ 26 గంటల్లో 38 సార్లు న్యూ ఇయర్‌ను ఆహ్వానించవచ్చు. మొదటగా కిరిబాటిలోని కిరిటిమటి అటోల్‌లో తొలి న్యూ ఇయర్ వేడుకలు జరుగుతాయి. కొన్ని కీలక ప్రాంతాల్లో న్యూ ఇయర్ ఆరంభమయ్యే సమయాలను ఇక్కడ చూద్దాం.
న్యూజీలాండ్‌లో మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు (11:00 జీఎంటీ),
ఆస్ట్రేలియాలోని తూర్పు తీరంలో సాయంత్రం 6:30 గంటలకు (13:00 జీఎంటీ),
జపాన్, దక్షిణ కొరియాలో రాత్రి 8:30 గంటలకు (15:00 జీఎంటీ),
భారత్, శ్రీలంకలలో బుధవారం ఉదయం 12:00 గంటలకు (18:30 జీఎంటీ),
యూకేతో పాటు ఇతర 25 దేశాల్లో బుధవారం ఉదయం 5:30 గంటలకు (00:00జీఎంటీ)
బ్రెజిల్, అర్జెంటీనాలలో ఉదయం 8:30 గంటలకు (3:00 జీఎంటీ)
అమెరికా తూర్పు తీరంలో ఉదయం 10:30 గంటలకు (5:00 జీఎంటీ) కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తారు.
సెంట్రల్ పసిఫిక్‌లోని బేకర్ ద్వీపంలో న్యూ ఇయర్ మొదలయ్యే సమయానికి, కిరిబాటిలో జనవరి 2వ తేదీ నడుస్తుంటుంది.
ఆస్ట్రేలియాలో ఆకాశాన్నంటిన వేడుకలు
ఆస్ట్రేలియా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. సిడ్నీ ఓపెరా హౌజ్, సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ వద్ద సంబరాలు అంబరాన్నంటాయి బాణసంచా వెలుగులతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు.
న్యూజిలాండ్ లో న్యూ ఇయర్
న్యూజిలాండ్ ప్రజలు ఆక్లాండ్‌లోని స్కై టవర్ వద్ద సంప్రదాయ బాణాసంచా వెలుగుల మధ్య కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)