పేజర్ పేలుళ్ల బాధితులతో నిండిపోయిన లెబనాన్‌ ఆసుపత్రులు...

పేజర్ పేలుళ్ల బాధితులతో నిండిపోయిన లెబనాన్‌ ఆసుపత్రులు...

హిజ్బుల్లా వాడుతున్న ఎలక్ట్రానిక్ పేజర్లు వేల సంఖ్యలో ఒక్కసారిగా పేలిపోయాయి. గాయపడిన వారితో లెబనాన్‌ ఆసుపత్రులు నిండిపోయాయి.

ఈ దాడుల్లో ఇద్దరు చిన్నారులు సహా 12 మంది మరణించారు. వేల మంది గాయపడ్డారు. సమాచార మార్పిడి కోసం హిజ్బుల్లా ఫోన్లకు బదులుగా పేజర్లను ఉపయోగిస్తోంది. ఈ పేలుళ్లకు ఇజ్రాయెల్ కారణమని దీనికి ప్రతీకారం తప్పదని హిజ్బుల్లా హెచ్చరించింది.

అయితే దీనిపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. బీబీసీ ప్రతినిధి గ్రాహం స్టాట్చెల్ అందిస్తున్న ఈ కథనంలో కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలచి వేయవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)