హైదరాబాద్: నాంపల్లి గోదాంలో అగ్ని ప్రమాదం, తొమ్మిది మంది మృతి

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హైదరాబాద్‌ నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందారు. ఎనిమిది మంది గాయపడ్డారు.

ఓ అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లోని గోదాంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది.

ఘటనలో నాలుగు అంతస్తులకు మంటలు వ్యాపించడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు బయటికి రాలేకపోయారు.

21 మంది మంటల్లో చిక్కుకున్నారు. వారిని బయటకు తీసుకొచ్చినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది ఏడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కార్మికుల మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

మంటల్లో మహిళలు, చిన్నారులూ చిక్కుకున్నారని వారిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకొస్తోందని వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది.

రసాయనాల నిల్వతో మంటలు: డీజీ

భవనంలో రసాయనాలను అక్రమంగా నిల్వ చేసి ఉండొచ్చని, అదే తీవ్రతకు కారణమని ఫైర్ సర్వీసెస్ డీజీ నాగి రెడ్డి అన్నారు.

"భవనంలో రసాయనాలు నిల్వ చేశారు. ఈ కెమికల్స్ కారణంగా మంటలు చెలరేగాయి. అపార్ట్‌మెంట్‌లో 21 మంది ఉండగా, మంటల ధాటికి ఆరుగురు మరణించారు, మిగతావారిని రెస్క్యూ సిబ్బంది రక్షించింది" అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)