భూమిపై మొదట్లో నీరు ఉండేది కాదా? అంతరిక్షం నుంచి వచ్చి చేరిందా

భూమిపై మొదట్లో నీరు ఉండేది కాదా? అంతరిక్షం నుంచి వచ్చి చేరిందా

బ్రిటన్‌లోని గ్లూసెస్టర్‌షైర్‌ నగరంలో గత ఏడాది పడిన ఉల్కలో నీరు ఉందని.. ఆ నీరు భూమి మీద ఉన్న నీటికి దాదాపుగా నిఖార్సుగా సరిపోలిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

వందల కోట్ల సంవత్సరాల కిందట భూమి రూపొందుతున్న తొలినాళ్లలో అంతరిక్షం నుంచి వచ్చిపడిన ఉల్కల ద్వారా నీరు, ఇతర కీలక రసాయన పదార్థాలు భూమికి వచ్చాయనే ఆలోచనలను ఇది బలపరుస్తోంది.

బ్రిటన్‌లో సేకరించిన అత్యంత ముఖ్యమైన ఉల్కగా గ్లూసెస్టర్‌షైర్ ఉల్కను పరిగణిస్తున్నారు.ఈ ఉల్క మీద విశ్లేషణలో అద్భుతమైన అంశాలు కనిపించాయని శాస్త్రవేత్తలు తమ తొలి సవివర ప్రచురణలో పేర్కొన్నారు.

ఇంగ్లండ్‌లోని వించ్‌కోంబ్ పట్టణంలో గత ఏడాది ఒక రాత్రి పూట ఆకాశం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ ఉల్క వచ్చి పడింది.

పలువురి ఇళ్ల తోటల్లో, రోడ్ల మీద, పొలాల్లో పడిన దాని అవశేషాలను సేకరించారు.

పూర్తి వివరాలు ఈ వీడియోలో..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)