మయోట్ ద్వీపం: సముద్రంలో స్మశాన వాటిక

మయోట్ ద్వీపం: సముద్రంలో స్మశాన వాటిక

ఈ ఏడాది మార్చిలో మడగాస్కర్ తీరంలో పడవ మునిగి సుమారు 34 మంది చనిపోయారు. వారంతా మెరుగైన జీవితం కోసం ఫ్రెంచ్ ఐలాండ్ మయోట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన వారే.

‘‘ఇదొక సముద్రపు స్మశాన వాటిక. కానీ శవాల లెక్క ఉండదు. 2012లో నేను వచ్చినప్పుడు, సుమారు 10వేల మంది చనిపోయి ఉండవచ్చని అధికారులు చెబుతూ ఉండేవారు. నేటికీ వారు అదే లెక్క చెబుతున్నారు. ఈ దీవికి చేరే క్రమంలో ఎంత మంది చనిపోయారో లెక్కించడానికి కూడా ఎవరూ ప్రయత్నించడం లేదు.’’ అని ఓ బాధితుడు వెల్లడించారు.

అయితే ఇలా పెద్ద ఎత్తున జరుగుతున్న వలసను అడ్డుకునేందుకు ఫ్రెంచి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

గతేడాది మయోట్ నుంచి 24 వేల మంది డీపోర్ట్ చేశారు. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు ఫ్రెంచ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)