Essential English Conversation :1واحد
انتخاب واحد
جلسه 7
నీకు వివాహమైందా?
Listen to find out how to ask if someone is married.
ఎదుటివారికీ, పెళ్లయిందా లేదా – ఇది కనుక్కోవడమెలాగో విని తెలుసుకోండి.
Session 7 score
0 / 3
- 0 / 3تمرین 1
تمرین 1
Are you married? నీకు వివాహమైందా?
Listen to find out how to ask if someone is married.
ఎదుటివారికీ, పెళ్లయిందా లేదా – ఇది కనుక్కోవడమెలాగో విని తెలుసుకోండి.
Listen to the audio and take the quiz. ఆడియో వినండి,క్విజ్ చెయ్యండి.

కల్యాణి
హలో! బావున్నారా? Essential English Conversation లకి స్వాగతం! ఇంగ్లీషులో మాట్లాడుకోవడానికి తప్పనిసరి ఐన విషయాలని మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు కల్యాణి. ఎదుటివారికీ, పెళ్లయిందా లేదా – ఇది కనుక్కోవడమెలాగో ఇప్పుడు నేర్చుకుందురు గాని.
ఇదిగో ... వీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి విని చూడండి.
Sue
Are you married?
Mark
No, I’m not, but I’m engaged. How about you?
Sue
Yes, I am.
కల్యాణి
కాస్త కష్టంగా ఉందా ... మరేం పర్లేదు, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చూద్దాం ఉండండి ...
మొట్టమొదటా ...
మార్క్ పెళ్లయిన వాడా కాదా ఇది తెలుసుకోడానికి – నువ్వు వివాహితుడివా - ‘are you married?’ అని సూ, డిగింది. సాధారణంగా ఔను - ‘yes’ అనో లేక కాదు - ‘no’ అనో జవాబు వస్తుంది కనక దీనిని yes or no ప్రశ్న అంటాం. వినీ తిరిగి మీరూ అనండి.
Are you married?
కల్యాణి
దానికి మార్క్ లేదు, నేను పెళ్లయినవాడిని కాను ‘No, I’m not.’ అని చెప్పాడు, అయితే - ‘but I’m engaged’ అని కూడా చెప్పాడు.
No I’m not, but I’m engaged
మీ సంగతీ సందర్భాన్ని బట్టీ – పెళ్లి కాలేదు - అవివాహితులం, ‘I’m single’ అనో, సహచరులతో ఉన్నాం - ‘I have a partner’ అనో, కాదంటే విడిపోయాం - ‘I’m divorced’ అని కూడా చెప్పొచ్చు. ఇదిగో వీటన్నిటినీ విని చూడండి.
I’m single.
పెళ్లి కాలేదు - అవివాహితులం
I have a partner.
సహచరులతో ఉన్నాం
I’m divorced.
కాదంటే విడిపోయాం
దీన్ని విని మీరూ అనండి.
కల్యాణి
మార్క్ దానిని అనుసరించి వచ్చే మరో ప్రశ్న – ‘మీ సంగతి ఏమిటి?’ ‘how about you?’ వేసాడు. మనను వేసిన ప్రశ్నే ఎదుటివారిని అడగాలనుకుంటే ఇలా అడుగుతాం. విని మీరూ అనండి.
How about you?
కల్యాణి
మార్క్ ప్రశ్న ‘yes’ or ‘no’ question కనుక Yes, I am.
ఔను, నేను పెళ్లయిన దానిని అని సూ చెప్పింది. విని మీరూ అనండి.
‘Yes, I am.’
కల్యాణి
బాగుంది – ఇదిగో ఇక్కడ వీళ్లు కూడా ఒకరి వైవాహిక స్థితి గురించి మరొకరు అడిగి తెలుసుకుంటున్నారు. వినీ, మీరెలా అన్నారో గుర్తు చేసుకోండి.
Are you married?
Yes, I am. How about you?
No, I’m not. I’m single.
Are you married?
No, I’m not. I’m divorced. How about you?
Yes, I am.
Are you married?
Yes, I am. How about you?
No, I’m not. I have a partner.
కల్యాణి
Ok, మరో సారి చేద్దామా, ఈ ఇంగ్లీష్ వాక్యాలను విని మీరూ అనండి.
Are you married?
No, I’m not, but I’m engaged.
How about you?
Yes, I am.
కల్యాణి
సరే, ఈ ఇంగ్లీష్‌ని మీరెంత బాగా గుర్తు పెట్టుకున్నారో చూద్దాం! ఏదీ, ఈ తెలుగు వాక్యాల్ని ఇంగ్లీష్‌లో అనండి.
నీకు పెళ్లయిందా
Are you married?
లేదు, కానీ నా పెళ్లి కుదిరింది.
No, I’m not, but I’m engaged.
మరి నీ సంగతి
How about you?
ఔను, నేను వివాహితురాలిని.
Yes, I am.
కల్యాణి
బ్రహ్మాండం – ఇంగ్లీష్‌లో వైవాహిక స్థితి గురించి ఎలా మాట్లాడాలో ఇప్పుడు మీకు తెలిసింది కదా. మరి సూ ప్రశ్నకు జవాబివ్వండి. తర్వాత అడిగే ప్రశ్న “మీ సంగతేమిటి?” అడగడం మర్చి పోకండీ.
Are you married?
Yes, I am.
కల్యాణి
భలే, ఇప్పుడు పూర్తిగా మరోసారి విని మీ జవాబులు సరి చూసుకోండి.
Sue
Are you married?
Mark
No, I’m not, but I’m engaged. How about you?
Sue
Yes, I am.
కల్యాణి
భలే చక్కగా చేశారే, ఇప్పుడు ఇంగ్లీష్‌లో ఎదుటి వారి వైవాహిక స్థితి కనుక్కోగలరు, మీ గురించి ఔననో కాదనో చెప్పగలరు. మిత్రులతో కలిసి మీరు నేర్చుకున్నది సాధన చెయ్యండి, అదే ప్రశ్న తిరిగి అడగడానికి ‘how about you?’ వాడడం మర్చి పోకండేం!
రోజు వారీ ఇంగ్లీష్‌ని నేర్పే మరిన్ని కార్యక్రమాల కోసం మమ్మల్ని మళ్లీ కలవండి.
Bye!
Check what you’ve learned by putting the words in the correct order.
పదాలను సరైన వరసలో పెట్టి, మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.
Are you married?
3 Questions
Put the words in the correct order.
పదాలను సరైన వరసలో పెట్టండి.
Help
تمرین
Put the words in the correct order.
పదాలను సరైన వరసలో పెట్టండి.
Hint
మొదటి పదం: AreQuestion 1 of 3
Help
تمرین
Put the words in the correct order.
పదాలను సరైన వరసలో పెట్టండి.
Hint
మొదటి పదం: HowQuestion 2 of 3
Help
تمرین
Put the words in the correct order.
పదాలను సరైన వరసలో పెట్టండి.
Hint
చివరి పదం: notQuestion 3 of 3
Excellent!آفرین! نمره شماBad luck!:
Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
Essential English కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.
واژه های تازه این جلسه
Are you married?
నువ్వు వివాహితుడి(రాలి)వా ?(నీకు పెళ్లయిందా)?
No, I’m not.
లేదు, నేను వివాహితుడి(రాలి)ని కానుYes, I am.
ఔను, నేను వివాహితుడి(రాలి)ని.I’m married.
నాకు పెళ్లయింది.I’m single.
నేను ఎవరితోనూ జంటగా లేను.I’m divorced.
నేను విడాకులు తీసుకున్నానుI’m engaged.
నాకు పెళ్లి కుదిరింది.How about you?
మీ సంగతి ఏమిటి?