Unit 1: Essential English Conversation
Select a unit
Session 2
నీ ఊరేమిటి
Listen to find out how to talk about where you come from.
మీ ప్రాంతం గురించి మాట్లాడడం – ఇక్కడ విని నేర్చుకోండి
Session 2 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
నీ ఊరేమిటి?
Listen to find out how to talk about where you come from.
మీ ప్రాంతం గురించి మాట్లాడడం – ఇక్కడ విని నేర్చుకోండి
Listen to the audio and take the quiz.
ఆడియో వినండి

కల్యాణి
హలో! బావున్నారా? Essential English Conversationలకి స్వాగతం! ఇంగ్లీషులో మాట్లాడుకోవడానికి తప్పనిసరి ఐన విషయాలని మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు కల్యాణి. ఇదిగో ... వీళ్లు ఒకరి ఊరి గురించి మరొకరు అడిగి తెలునుకుంటున్నారు – విందామా మరి...
Lauren
Hi David, Where are you from?
David
I’m from London. How about you?
Lauren
I’m from Manchester.
కల్యాణి
కాస్త కష్టంగా ఉందా ... మరేం పర్లేదు, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చూద్దాం ఉండండి ...
మొట్టమొదటా ...
డేవిడ్‌ని - ‘నువ్వెక్కడి నుంచి వచ్చావు?’, ‘where are you from?’ అని లారెన్ అడిగింది. దాన్ని ఒక సారి విని మీరూ అనండి.Where are you from?
‘‘నేను లండన్ నుంచి వచ్చాను’’, ‘‘I’m from London’’ అన్నాడు డేవిడ్. మీరు ‘I’m from’ అని మీ ఊరి పేరు కలిపి చెప్పొచ్చు. అంతేకాకుండా దేశాల పేర్లూ, ప్రదేశాల పేర్లూ, నగరాలూ, పట్టణాలూ ... అన్నిటి పేర్లనూ చేర్చి మనం చెప్పుకోవచ్చు. ఇదిగో, వింటూ మీరూ తిరిగి అనండి మరి.
I’m from London.
I’m from England
I’m from Australia
కల్యాణి
మీరు నగరానికి చెందితే“city” అనీ, గ్రామానికి చెందిన వారైతే “countryside” అనీ, అలా కాక సముద్రతీరమైతే ‘coast’ అనీ, లేక పర్వతప్రాంతమైతే ‘mountains’ అనీ చెప్పొచ్చు.
I’m from the city
I’m from the countryside
I’m from the coast
I’m from the mountains
కల్యాణి
తర్వాత అతను లారెన్‌ని అదే అడిగాడు. అలా అడగాలంటే దానికి ‘how about you?’ అని వాడొచ్చు. అదే ప్రశ్నను ‘and you?’ అని కూడా అడగొచ్చు. ఇదిగో వినండి. ఈ మాటల్ని మీరూ అనండి.
How about you?
and you?
కల్యాణి
లారెన్ సొంత ఊరు మాంఛెస్టర్. కనక ‘I’m from Manchester’ అంది. విని తర్వాత మీరూ అనండి.
I’m from Manchester.
కల్యాణి
బాగుంది – ఇదిగో ఇక్కడ వీళ్లు కూడా ఎక్కడినుండి వచ్చారని కనుక్కుంటున్నారు. వినీ, మీరెలా అన్నారో గుర్తు చేసుకోండి.
Hi Mark, Where are you from?
I’m from Liverpool. How about you?
I’m from Birmingham.
Hi Claire, where are you from?
I’m from London. and you?
I’m from Brighton.
కల్యాణి
సరే, మరోసారి చేసి చూద్దామా? ఇప్పుడు మీరు వినే ఇంగ్లీష్ వాక్యాల్ని తిరిగి అనండి.
Hi David, Where are you from?
I’m from London.
How about you?
I’m from Manchester.
కల్యాణి
సరే, ఈ ఇంగ్లీష్‌ని మీరెంత బాగా గుర్తు పెట్టుకున్నారో చూద్దాం! ఏదీ, ఈ తెలుగు వాక్యాల్ని ఇంగ్లీష్‌లో అనండి.
హాయ్ డేవిడ్, నువ్వెక్కడి నుంచి వచ్చావు?
Hi David, Where are you from?
లండన్ నుంచి .
I’m from London.
మరి నీ సంగతి?
How about you?
నేను మాంఛెస్టర్ నుండి .
I’m from Manchester.
కల్యాణి
బ్రహ్మాండం – ఇంగ్లీష్‌లో ఊరిగురించి ఎలా మాట్లాడాలో ఇప్పుడు మీకు తెలిసింది కదా. మరి మీ ఊరి పేరు చెప్తూ లారెన్ ప్రశ్నకు జవాబివ్వండి.
Hi, where are you from?
I’m from Manchester.
కల్యాణి
భలే, ఇప్పుడు పూర్తిగా మరోసారి విని మీ జవాబులు సరి చూసుకోండి.
Lauren
Hi David, Where are you from?
David
I’m from London. How about you?
Lauren
I’m from Manchester.
కల్యాణి
భలే చక్కగా చేశారే, ఇప్పుడు ఇంగ్లీష్‌లో మీ ఊరి పేరు చెప్పగలరు, ఎదుటి వారి ఊరి పేరు కనుక్కోగలరు. మీరు నేర్చుకున్నది సాధన చెయ్యడం మర్చి పోకండేం! ఇక మీ మిత్రులతో కలిసి ఇంగ్లీష్‌లో ఊరి పేరు చెప్పడం, అడగడం అనే అభ్యాసం చేస్తూ ఉండండి.
రోజు వారీ ఇంగ్లీష్‌ని నేర్పే మరిన్ని కార్యక్రమాల కోసం మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!
Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.
Where are you from?
3 Questions
సరైన జవాబును గుర్తించండి.
Help
Activity
సరైన జవాబును గుర్తించండి.
Hint
ప్రదేశాల గురించి అడగాలంటే ఏ మాట వాడతారు?Question 1 of 3
Help
Activity
సరైన జవాబును గుర్తించండి.
Hint
నీ సంగతేమిటని అడగాలంటే ఏమి వాడతారుQuestion 2 of 3
Help
Activity
సరైన జవాబును గుర్తించండి.
Hint
ఏ ఊరినుండి వచ్చారో చెప్తున్నారు.Question 3 of 3
Excellent!Great job!Bad luck!You scored:
Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
Essential English కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.
Session Vocabulary
where are you from?
నీది ఏ ప్రాంతం?
I’m from ...
నేను ఫలానా... ఊరి దానిని/వాడిని.I’m from the ...
నేను ఫలానా ... ప్రాంతం నుంచి వచ్చాను.how about you?
నీ సంగతేమిటి?city
నగరంcountryside
గ్రామీణ ప్రదేశంcoast
సముద్రతీరంmountains
పర్వత ప్రాంతం