‘మమ్మల్ని బెదిరించడం ఆపండి’ చైనాకు తైవాన్ కొత్త అధ్యక్షుడి విజ్ఞప్తి

తైవాన్‌ను బెదిరించడం ఆపి, తైవాన్‌లోని ప్రజాస్వామ్య ఉనికిని ఆమోదించాలని తైవాన్‌ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన విలియం లై చైనాకు పిలుపునిచ్చారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్‌ ఇంతటితో సమాప్తం. తాజా వార్తలు, ఆసక్తికర కథనాల కోసం బీబీసీ న్యూస్ తెలుగు వెబ్‌సైట్, యూట్యూబ్ చానెల్, ఫేస్‌బుక్ పేజీలను ఫాలో అవండి. ధన్యవాదాలు.

  2. పల్నాడులో హింస, ఘర్షణలకు కారణం ఎవరు? సిట్ నివేదికలో ఏముంది?

  3. ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణించిన హెలికాప్టర్‌ కూలిపోవడానికి కారణం ఇదేనా?

  4. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణం తర్వాత ఇప్పుడు అక్కడ ఏం జరగబోతోంది?

  5. నెతన్యాహు, హమాస్ నేతల అరెస్ట్ వారెంట్ కోసం దరఖాస్తు

    బెంజిమిన్ నెతన్యాహు

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    గాజాలో యుద్ధ నేరాలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, హమాస్ నేతలకు అరెస్ట్ వారెంట్లు జారీ చేయాలని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)కు చీఫ్ ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ కేసీ దరఖాస్తు చేశారు.

    అక్టోబర్ 7, 2033 నుంచి యుద్ధ నేరాలకు, అమానవీయ నేరాలకు ఈ ఇద్దరు కారణం అనేందుకు సహేతుకమైన ఆధారాలు ఉన్నాయని కరీమ్ ఖాన్ కేసీ చెప్పారు.

    ఇజ్రాయెలీ రక్షణ మంత్రి యెవ్ గల్లాంట్, హమాస్ రాజకీయనేత ఇస్మాయిలీ హనీయెహ్, ఆ సంస్థ మిలటరీ చీఫ్ మహమ్మద్ డీఫ్‌ను కూడా అరెస్ట్ చేయాలని ఆయన కోరారు.

    ఆక్రమిత ప్రాంతాలలో గడిచిన మూడేళ్ళుగా ఇజ్రాయెల్ చర్యలను, ఇటీవలి హమాస్ చర్యలపై కూడా హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ జరుపుతోంది.

    అయితే ప్రాసిక్యూటర్ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ యుద్ధ క్యాబినెట్ మంత్రి, నెతన్యాహు రాజకీయ విరోధి బెన్నీ గాట్జ్ నిరసించారు.

  6. ‘బెదిరింపులు ఆపండి’: చైనాకు తైవాన్ కొత్త అధ్యక్షుడి విజ్ఞప్తి

    తైౌవాన్ కొత్త అధ్యక్షుడు లై

    ఫొటో సోర్స్, Getty Images

    తైవాన్‌ను బెదిరించడం ఆపి, తైవాన్‌లోని ప్రజాస్వామ్య ఉనికిని ఆమోదించాలని తైవాన్‌కు కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన విలియం లై చైనాకు పిలుపునిచ్చారు.

    అధ్యక్షుడిగా సోమవారం ప్రమాణస్వీకారం చేసిన కొద్దిసేపటి తరువాత ఘర్షణతో కాకుండా, చర్చలతో సమస్య పరిష్కరించుకుందామని ఆయన బీజింగ్‌కు విజ్ఞప్తి చేశారు.

    తైవాన్ తనదేనంటూ దీర్ఘకాలంగా బెదిరిస్తున్న చైనా విషయంలో తైవాన్ ఎన్నడూ వెనకడుగు వేయదని చెప్పారు.

    ‘తైవాన్ స్వాతంత్రం కోసం ఏ రూపంలో చేసే ప్రయత్నమైనా విఫలమవుతుంది’’ అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తమ రోజువారి మీడియా సమావేశంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం తెలిపారు.

    కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు లై, ఆయన డెమెక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ తైవాన్ స్వాతంత్రానికి అనుకూలంగా ఉంటుందనే కారణంతో బీజింగ్‌కు గిట్టదు. పైగా లై పార్టీ జనవరిలో ఎన్నికలలో గెలిచిన నాటి నుంచి తైవాన్ సముద్ర జలాల్లోనూ, గగనతలంపైనా చైనా సైనిక చొరబాట్లను పెంచింది.

    ఈ రకమైన సైనిక చొరబాట్లు గడిచిన కొన్నేళ్ళ నుంచి సాధారణంగా మారి, ఘర్షణ భయాలను పెంచుతోంది. ఈ వ్యవహారాన్ని లై సోమవారంనాటి తన ప్రసంగంలో ‘‘ప్రపంచ శాంతి, సుస్థిరతకు అతిపెద్ద వ్యూహాత్మక సవాలు’’గా అభివర్ణించారు.

  7. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి: 7 ప్రశ్నలు - సమాధానాలు

  8. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిపై హమాస్ ఏమన్నది?

    ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఆ దేశ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దొల్లహియన్ మృతిపై సంతాపం తెలుపుతూ హమాస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

    ‘‘ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమైనీకి, ఇరాన్ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు మా సానుభూతి తెలియజేస్తున్నాం’’ అని హమాస్ చెప్పింది.

    ‘‘ఈ క్లిష్టమైన, బాధాకరమైన సమయంలో ఇరాన్‌కు మేం తోడుగా ఉంటాం. మా యుద్ధానికి పూర్తి మద్దతు ఇస్తూ, ఇరాన్ సంక్షేమం కోసం సుదీర్ఘ కాలం పాటు పోరాడిన ప్రముఖ నేతలు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు’’ అని హమాస్ తెలిపింది.

    ‘‘యూదుల అకృత్యాలకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజల కోసం మేం చేస్తున్న పోరాటానికి ఆయన మాకు మద్దతుగా నిలిచారు’’ అని పేర్కొంది.

    ఈ విషాదం నుంచి ఇరాన్ ప్రజలు బయటపడతారని విశ్వసిస్తున్నామని, ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొన్న సుదీర్ఘ చరిత్ర ఇరాన్ ప్రజలకు ఉందని చెప్పింది.

    మధ్య ప్రాచ్యంలో ఎన్నో ఏళ్ల పాటు ప్రాక్సీ దళాలను ఇరాన్ పెంచి పోషిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇరాన్ అండదండలతో నడుస్తున్న దళాలలో హమాస్ కూడా ఒకటి.

  9. ఇబ్రహీం రైసీ: మత బోధకుడు ఇరాన్ అధ్యక్షుడు ఎలా అయ్యారు, ఆయన ప్రయాణం ఎలా సాగింది?

  10. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే పోలీసులు పాటించాల్సిన నిబంధనలేంటి?

  11. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి మృతి, అసలేం జరిగిందంటే..

  12. ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం: ‘ఎవరూ ప్రాణాలతో ఉన్నట్లు అనిపించడం లేదు’

    ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం

    ఫొటో సోర్స్, Reuters

    ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ప్రదేశాన్ని సహాయక బృందాలు గుర్తించాయని ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ పేర్కొంది. హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయిందని, ఎవరూ ప్రాణాలతో ఉన్నట్లు అనిపించడం లేదని ఇరాన్ అధికారులు చెప్పారు.

  13. లోక్‌సభ ఎన్నికలు 2024: ఐదవ దశ పోలింగ్ ప్రారంభం, 49 సీట్లకు ఓటింగ్

    లోక్‌సభ ఎన్నికల ఐదవ విడత పోలింగ్

    ఫొటో సోర్స్, ANI

    లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.

    ఈ దశలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 49 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

    మొత్తంగా 695 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న ఈ దశలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాలు కూడా పోటీలో ఉన్నారు.

  14. ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని గుర్తించిన సహాయక బృందాలు

    ఇరాన్ అధ్యక్షుడు

    ఫొటో సోర్స్, REUTERS

    ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ప్రదేశాన్ని సహాయక బృందాలు గుర్తించాయని ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ పేర్కొంది.

    ‘ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్న ప్రదేశాన్ని గుర్తించాం. కానీ, పరిస్థితి అంత బాగోలేదు’ అని ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థకు ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ హెడ్ చెప్పారు.

    మరికొద్ది నిమిషాల్లో సహాయక బృందాలు ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుంటాయని ఆయన తెలిపారు.

    హార్డ్ ల్యాండింగ్ జరిగినట్లు భావిస్తున్న ప్రాంతానికి సుమారు 2 కిలో మీటర్ల దూరంలో సహాయక బృందాలు ఉన్నాయని చెప్పారు.

  15. ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం: ‘హార్డ్ ల్యాండింగ్’ అంటే ఏమిటి?

    ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం

    ఫొటో సోర్స్, Reuters

    ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా ‘హార్డ్ ల్యాండింగ్’గా చెబుతోంది.

    విమానాలు క్రాష్ అయినప్పుడు జరిగే ప్రమాదాలను చెప్పడానికి రష్యాలోని అధికారులు ‘హార్డ్ ల్యాండింగ్’ అనే పదాన్ని వాడుతుంటారు.

    సైనిక విమానాలు ప్రమాదాలకు గురైనప్పుడు రష్యా రక్షణ శాఖ తరచూ ఈ పదాన్ని వాడుతుంటుంది.

    2022 జూన్‌లో Il-76 సైనిక కార్గో విమానం రష్యాలోని ర్యాజాన్ ప్రాంతంలో క్రాష్ అయింది. ఆ ప్రమాదంలో ఐదుగురు సిబ్బంది చనిపోయారు. అప్పుడు విమానం పూర్తిగా ధ్వంసమైనప్పటికీ, రష్యా మిలటరీ తొలుత ఈ ప్రమాదాన్ని హార్డ్ ల్యాండింగ్‌గా పేర్కొంది.

    కలవరపాటును లేదా ఒక్కసారిగా గాబరా వల్ల కలిగే భయాందోళనను తగ్గించేందుకు రష్యా అధికారులు ‘‘క్రాష్’’ అనే పదాన్ని ఎక్కువగా వాడరని నిపుణులు చెప్పారు.

  16. ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం, హీట్ సోర్స్‌ను గుర్తించిన తుర్కియే డ్రోన్

    డ్రోన్ ఏరియల్ వ్యూ

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, డ్రోన్ ఏరియల్ వ్యూ

    ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఆ దేశ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దొల్లహియన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది.

    వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు ఇరాన్ హోం మంత్రి అహ్మద్ వాహిది ధ్రువీకరించారు.

    హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్న ప్రదేశాన్ని (హీట్ సోర్స్‌ను) తుర్కియే డ్రోన్ గుర్తించినట్లు వార్తా సంస్థ అనాడోలు పేర్కొంది.

    ఇరాన్ అధ్యక్షుడు

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    సహాయక చర్యలలో పాల్గొంటున్న బైరక్తర్ అకింజి హై అల్టిట్యూడ్ లాంగ్ రేంజ్ డ్రోన్ సేకరించిన వీడియో ఫుటేజీలో రాత్రిపూట ఏరియల్ వ్యూ కనిపిస్తోంది. అందులో కొండ పక్కన నల్లటి గుర్తులు కనిపిస్తున్నట్లు వార్తా సంస్థ అనాడోలు తెలిపింది.

    ఈ ఫుటేజీలో సేకరించిన సమాచారాన్ని ఇరాన్ అధికారులకు పంపినట్లు ఈ వార్తా సంస్థ రిపోర్టు చేసింది.

    ఇరాన్ అధ్యక్షుడి ఆచూకీ వెతకడంలో సాయపడేందుకు తుర్కియే ఈ డ్రోన్‌ను పంపించింది.

    ప్రమాదం జరిగిన తర్వాత ఆదివారం నుంచి భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు.

    ఇరాన్ అధ్యక్షుడి కోసం వెతుకుతున్న సహాయక బృందాలు

    ఫొటో సోర్స్, Reuters

  17. లైవ్ పేజీకి స్వాగతం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.