కర్ణాటక బీజేపీ పోస్ట్ చేసిన వీడియోను తొలగించాలంటూ ‘ఎక్స్‌’కు ఈసీ ఆదేశాలు

ముస్లిం రిజర్వేషన్లపై కర్ణాటక బీజేపీ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసిన యానిమేషన్ వీడియోను వెంటనే తొలగించాలని ఎక్స్‌ (ట్విటర్)ను ఎన్నికల సంఘం ఆదేశించింది.

లైవ్ కవరేజీ

  1. గుడ్డులో ఏం ఉంటుంది? ఆరోగ్యానికి మంచిదేనా

  2. కరెన్సీ నోట్లపై కొత్త మ్యాప్, నేపాల్ నిర్ణయంపై భారత్‌ ఆగ్రహం ఎందుకు?

  3. ‘‘మొదట పెళ్లికూతుర్ని, తర్వాత భార్యను, మరుసటి రోజే వితంతువుగా మారాను’’ - బంకర్‌లో నా ప్రేమకథ ఎలా ముగిసిందంటే...

  4. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  5. జెలియెన్‌స్కీ హత్యకు కుట్ర : భగ్నం చేసిన ఎస్‌బీయూ

    యుక్రెయిన్ రక్షణ దళ కల్నళ్ల అరెస్ట్

    ఫొటో సోర్స్, Telegram/SBU

    యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమీర్ జెలియెన్‌స్కీ, ఇతర ఉన్నతాధికారుల హత్యకు రష్యా పన్నిన కుట్రను భగ్నం చేసినట్టు యుక్రెనియన్ సెక్యూరిటీ సర్వీసెస్ (ఎస్‌బీయూ) తెలిపింది.

    ఇందుకు సంబంధించి యుక్రెయిన్‌కు చెందిన ఇద్దరు ప్రభుత్వ రక్షణ దళ కల్నళ్లను అరెస్ట్ చేసినట్టు చెప్పింది.

    వీరిద్దరూ రష్యన్ స్టేట్ సెక్యూరిటీ సర్వీసెస్ (ఎఫ్‌ఎస్‌బీ)కు చెందిన ఏజెంట్ల నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్నారని పేర్కొంది.

    ఈ కుట్రను అమలు చేయడానికి జెలియెన్‌స్కీ బాడీగార్డులలో ఆసక్తి చూపేవారి కోసం వీరు అదేపనిగా వెదికారని, ఆసక్తి చూపేవారు దొరికితే జెలియెన్‌స్కీ‌ని కిడ్నాప్ చేసి, హత్య చేయాలనేది పన్నాగమని తెలిపారు.

    రష్యన్ దళాలు కీవ్‌లో దండయాత్రకు దిగి జెలియెన్‌స్కీని హతమార్చడానికి ప్రయత్నించినప్పటి నుంచి , ఇటువంటి కుట్రలు సాధారణంగా మారిపోయాయి.

  6. నగరి పబ్లిక్ టాక్: ఆర్కే రోజా పోటీ చేస్తున్న నగరిలో ప్రజలు ఏమంటున్నారు?

  7. దక్షిణ గాజాలోని రఫాలో పరిస్థితి ఎలా ఉందంటే..

    వీడియో క్యాప్షన్, రఫా క్రాసింగ్ దగ్గర గాజా వైపున్న ప్రాంతాన్నంతా అధీనంలోకి తీసుకున్నామన్న ఇజ్రాయెల్...
  8. ఇజ్రాయెల్ - హమాస్ మధ్య ఒప్పందం ఎందుకు కుదరలేదు, కాల్పుల విరమణ సాధ్యమేనా?

  9. టన్నుల కొద్దీ పేలుడుపదార్థాలు, బంగారంతో ముంబయికి వచ్చిన ఈ నౌక ఎలా పేలిపోయింది? ఆ బంగారమంతా ఏమైంది?

  10. హైదరాబాదులో భారీ వర్షం

    హైదరాబాద్‌లో భారీ వర్షం

    ఫొటో సోర్స్, UGC

    హైదరాబాదులో భారీ వర్షం కురిసింది. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది.

    పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీచడంతో పలుచోట్ల చెట్లు, చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.

    నగరవ్యాప్తంగా చాలాచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

    ఎల్‌బీనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, నాంపల్లి, సికింద్రాబాద్, మల్కాజిగిరి సహా అన్ని ప్రాంతాల్లోనూ వర్షం పడింది.

    పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

  11. పెళ్లంటే సప్తపది, కన్యాదానం, మంగళ సూత్రమేనా? అలా చేయకుంటే పెళ్లి చెల్లదా?

  12. కర్ణాటక బీజేపీ పోస్ట్ చేసిన వీడియోను తొలగించాలంటూ ‘ఎక్స్‌’కు ఈసీ ఆదేశాలు

    ఎన్నికల సంఘం కార్యాలయం

    ఫొటో సోర్స్, Getty Images

    ముస్లిం రిజర్వేషన్లపై కర్ణాటక బీజేపీ (BJP4Karnataka) హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసిన యానిమేషన్ వీడియోను వెంటనే తొలగించాలని ఎక్స్‌ (ట్విటర్)ను ఎన్నికల సంఘం ఆదేశించింది.

    ఆ వీడియో అభ్యంతరకరంగా ఉందని, దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని ఈసీ తెలిపింది.

    ఆ వీడియోను తొలగించాలని మే 5న ‘ఎక్స్‌’కు చెప్పినా ఇప్పటి వరకూ తొలగించలేదని, ఇప్పుడు తక్షణమే దానిని తొలగించాలని ఆదేశించినట్లు ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ అనుజ్ చందక్ తెలిపారు.

    ఎన్నికల సంఘం లేఖ

    ఫొటో సోర్స్, ANI

  13. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన సుప్రీం కోర్టు

    అరవింద్ కేజ్రీవాల్

    ఫొటో సోర్స్, Getty Images

    దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

    రేపటి తర్వాత (అంటే మే 9న) తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్న కోర్టు, ఆ రోజు విచారణకు తీసుకోకపోతే వచ్చే వారానికి వాయిదా వేస్తామని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నట్లు లైవ్ లా వెబ్‌సైట్ పేర్కొంది.

    దిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టైన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌‌‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరిపింది.

    బెయిల్ పిటిషన్‌ విచారణ సందర్భంగా సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన బెంచ్ కొన్ని వ్యాఖ్యలు చేసింది.

    ''ఇక్కడ రెండు, మూడు సమస్యలున్నాయి. ఒకటి ఆయనే దిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇవి అసాధారణ పరిస్థితులు. ఆయనను సాధారణ నేరస్తుడిగా పరిగణించలేం'' అని కోర్టు వ్యాఖ్యానించింది.

    ఈ కేసులో గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియడంతో అరవింద్ కేజ్రీవాల్‌ను దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఆయన కస్టడీని 20వ తేదీ వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులిచ్చింది.

  14. హీరామండీ: సంజయ్ లీలా బన్సాలీ కొత్త వెబ్ సిరీస్‌పై లాహోర్ ప్రజలెందుకు ఆగ్రహంగా ఉన్నారు?

  15. పెనైల్ క్యాన్సర్‌: పురుషాంగం తొలగించడానికి కారణమవుతున్న ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది?

  16. వరల్డ్ ఆస్తమా డే: ఆస్తమా ఎందుకు వస్తుంది? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

  17. వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి బీబీసీ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే..?

  18. శాండ్‌విచ్‌లు తిన్న 500 మందికి అస్వస్థత, అసలేం జరిగిందంటే...

  19. ఆకలి వేయకున్నా ఏదో ఒకటి తినాలని ఎందుకు అనిపిస్తుంది?

  20. లోక్‌సభ ఎన్నికలు: 93 నియోజక వర్గాల్లో మూడో దశ పోలింగ్

    ఓటు హక్కు వినియోగించుకున్న మోదీ

    ఫొటో సోర్స్, ANI

    లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది.

    ఈ దశలో 1300 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో సుమారు 120 మంది మహిళలు పోటీ చేస్తున్నారు.

    ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరుతున్నారు.

    1.85 లక్షల పోలింగ్ స్టేషన్లలో మొత్తంగా 17.24 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

    ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ మూడో దశ పోలింగ్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నిషాన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోలింగ్

    ఫొటో సోర్స్, Getty Images

    హోంమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు శివ్‌రాజ్ సింగ్ చౌహన్, దిగ్విజయ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఎన్‌సీపీ(ఎస్‌పీ) నేత సుప్రియా సూలే, సమాజ్‌వాదీ పార్టీ నేత డింపుల్ యాదవ్ వంటి ప్రముఖులు ఇవాళ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

    ఇవాళ పోలింగ్ జరుగుతున్న 93 లోక్‌సభ స్థానాలలో 2019 జనవరి ఎన్నికల్లో బీజేపీ 72 సీట్లను గెలుచుకుంది.

    ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు ఏడు దశలలో ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు జరుగుతున్నాయి. ఫలితాలు జూన్ 4న వెల్లడిస్తామని ఎన్నికల కమిషన్ గతంలో చెప్పింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2