‘ఏపీలో వైసీపీ ప్రభుత్వం అవినీతిలో ఫుల్ స్పీడులో ఉంది’: ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. యుక్రెయిన్ వాసుల ప్రాణాలు తీస్తున్న ఉత్తర కొరియా ఆయుధాలు, అసలేం జరుగుతోంది?

  3. బ్రెజిల్‌ను కుదిపేసిన భారీ వర్షాలు, వరదలు 70 మందికి పైగా మృతి

    వీడియో క్యాప్షన్, దక్షిణ బ్రెజిల్‌ను కుదిపేసిన భారీ వర్షాలు, వరదలు

    దక్షిణ బ్రెజిల్‌లో భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపడటంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. 80 వేల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.

    దేశాధ్యక్షుడు లులా డ సిల్వ ఈ ప్రాంతంలో రెండోసారి పర్యటించారు.

    75 మందికి పైగా ప్రజలు చనిపోయారని, దాదాపు 100 మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు.

    బీబీసీ ప్రతినిధి జాన్ డానిసన్ అందిస్తున్న రిపోర్ట్..

  4. దక్షిణ గాజాలోని రఫాలో సైనిక ఆపరేషన్‌కు సర్వం సిద్ధం చేసిన ఇజ్రాయెల్

    వీడియో క్యాప్షన్, దక్షిణ గాజాలోని రఫాలో సైనిక ఆపరేషన్‌కు సర్వం సిద్ధం చేసిన ఇజ్రాయెల్

    నిస్సహాయత అంటే ఏంటో తెలియాలంటే.. రఫాకు వెళ్లే రోడ్డుపై బార్లుదీరిన ఈ వాహనాల వరుసను చూస్తే చాలు.

  5. రోహిత్ వేముల తల్లి: ‘నా కొడుకు కులాన్ని పోలీసులు ఎలా నిర్ధరిస్తారు, ఇది కేసును పక్కదారి పట్టించే కుట్ర’

  6. హీట్ వేవ్: ఉష్ణోగ్రత 37C దాటితే మన శరీరానికి ఏమౌతుంది? మెదడు ఎలా స్పందిస్తుంది?

  7. కేవలం 18 వేలతో శ్రీలంక టూర్, అక్కడ ఏయే ప్రదేశాలు చూడొచ్చు, ఈ-వీసా పొందడం ఎలా?

  8. ‘ఏపీలో వైసీపీ ప్రభుత్వం అవినీతిలో ఫుల్ స్పీడులో ఉంది’: ప్రధాని మోదీ

    నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, TDP FB page

    ఏపీలో వైసీపీ ప్రభుత్వం అవినీతిలో ఫుల్ స్పీడులో ఉందని, అభివృద్ధికి బ్రేకులు పడ్డాయని ప్రధాని మోదీ విమర్శించారు.

    మద్యనిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు మద్యం మాఫియా, ఇసుక మాఫియా నడుస్తున్నాయని ఆరోపించారు.

    సోమవారం మధ్యాహ్నం రాజమండ్రిలో నిర్వహించిన బహిరంగసభలో మోదీ ప్రసంగించారు.

    మూడు రాజధానుల నిర్మాణం పేరుతో వైసీపీ సర్కారు ఖజానాను ఖాళీచేసిందని, ఒక్క రాజధాని కూడా ఇవ్వలేకపోయిందని మోదీ విమర్శించారు.

    ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరానికి తాము 15వేల కోట్ల రూపాయలు ఇచ్చినా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్నారు.

    జూన్ 4న ఏపీలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, ఆ తరువాత సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని మోదీ చెప్పారు.

    అలాగే దేశవ్యాప్తంగా గుట్టలు గుట్టలుగా దొరుకుతున్న డబ్బంతా కాంగ్రెస్ నేతల వద్దే దొరుకుతోందని, తాజాగా ఝార్ఖండ్‌లో మంత్రి కార్యదర్శి నౌకరు ఇంట్లో భారీ ఎత్తున డబ్బు పట్టుబడిందని మోదీ తెలిపారు.

    ప్రజల సంపదను తిరిగి ప్రజల వద్దకే చేర్చేలా త్వరలో కొత్త చట్టం తీసుకువచ్చేందుకు న్యాయనిపుణులతో సంప్రదిస్తున్నట్టు మోదీ తెలిపారు.

    జూన్ 4 తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం ఇటువంటి సమస్యలన్నింటినీ దూరం చేస్తుందన్నారు.

  9. లోక్‌సభ ఎన్నికలు 2024: 100 మంది సంపన్న అభ్యర్థులలో 64 మంది తెలుగువాళ్లే, ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే..

  10. తూర్పు రఫా ప్రాంతాాన్ని ఖాళీ చేయిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం

    ఇజ్రాయెల్ - పాలస్తీనా

    ఫొటో సోర్స్, Reuters

    రఫాలోని హ్యుమానిటేరియన్ జోన్ వైపు వెళ్లాలని స్థానికులకు చెబుతున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. 14 లక్షలకుపైగా మంది ఆశ్రయం పొందుతున్న రఫా నగరంపై దాడికి ముందు ఈ చర్యలు చేపట్టింది.

    తూర్పు రఫాలోని కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం పిలుపునిచ్చిన తరువాత, కొంతమంది గాజా ప్రజలు నగరాన్ని విడిచి వెళ్లడం మొదలైంది.

    ఇది చిన్న ఆపరేషన్ అని, దీనివల్ల నగరంలో 1,00,000 మంది ప్రభావితమయ్యే అవకాశం ఉందని, తూర్పు రఫా మొత్తాన్ని తరలించడంలేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) చెబుతోంది.

    నిరాశ్రయులను సమీపంలోని ఖాన్ యూనిస్, అల్ మవాసిలోని శరణార్థి ప్రాంతాలకు తరలిస్తామని, అక్కడ వారికి సాయం అందుతుందని తెలిపింది.

    ఇజ్రాయెల్ - పాలస్తీనా

    ఫొటో సోర్స్, Reuters

    రఫాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఒక్కరాత్రిలోనే 12 మంది చనిపోయారు. మరోవైపు కెరెమ్ షాలోమ్ క్రాసింగ్ సమీపంలో హమాస్ జరిపిన రాకెట్ దాడిలో ముగ్గురు ఇజ్రాయెలీ సైనికులు మరణించారు.

    కీలకాంశాల్లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య అంగీకారం కుదరకపోవడంతో ఇప్పటికే గాజాలో కాల్పుల విరమణ ఒప్పంద పునరుద్ధరణ, బందీలను విడుదల లక్ష్యంగా జరిగిన చర్చలు నిలిచిపోయాయి.

    హమాస్ డిమాండ్లకు లొంగిపోవడమంటే ఓడిపోవడంతో సమానమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. చర్చలను నెతన్యాహు నాశనం చేశారని హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే ఆరోపించారు.

  11. వైఎస్ జగన్- షర్మిల మధ్య విభేదాలకు అసలు కారణమేంటి? - బీబీసీ ఇంటర్వ్యూలో షర్మిల ఏం చెప్పారు?

  12. ‘మొబైల్ టార్చ్ వెలుతురులో సిజేరియన్ ఆపరేషన్ చేశారు, నా కోడలు, మనవడు చనిపోయారు’

  13. ఝార్ఖండ్: మంత్రి సెక్రటరీ ఇంట్లో పనిమనిషి వద్ద దొరికిన నోట్ల కట్టలు

    ఈడీ దాడులు

    ఫొటో సోర్స్, ANI

    ఝార్ఖండ్‌లోని రాంచీలో పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాల్లో కోట్లాది రూపాయల నగదు బయటపడుతోంది.

    దాడుల్లో స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్న నోట్ల కట్టల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ఝార్ఖండ్ మంత్రి పర్సనల్ సెక్రటరీ ఇంట్లో పనిమనిషి ఇంటి నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకున్నట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.

    ఈ విషయంపై ఈడీ అధికారులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఈ రోజు ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.

    అక్రమాస్తుల కేసులో ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలోని మాజీ చీఫ్ ఇంజినీర్ వీరేంద్ర కుమార్ రామ్‌ను గత ఏడాది ఫిబ్రవరిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి రాంచీ సహా చాలా చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

    జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆలంగీర్ ఆలం పర్సనల్ సెక్రటరీ (పీఎస్) సంజీవ్ లాల్ ఇంట్లో పనిచేసే వ్యక్తి ఇంటికి కూడా ఈడీ అధికారులు వెళ్లారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    సంజీవ్ లాల్ ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తికి చెందినదిగా చెబుతున్న ఈ ఇంట్లో నుంచి అధికారులు బ్యాగుల్లో నుంచి డబ్బు తీస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

    దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఝార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. అవినీతికి ఇది నిలువెత్తు నిదర్శనమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ వ్యాఖ్యలు చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2