You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

మేం ఓడిపోతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది: యుక్రెయిన్ ప్రధాని

రష్యా చేతిలో ఒకవేళ యుక్రెయిన్ ఓడిపోతే ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని యుక్రెయిన్ ప్రధాని డెనిస్ షమిహాల్ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. పాకిస్తాన్: ‘సైన్యం మమ్మల్ని చితకబాదింది, ఏ మొహంతో డ్యూటీ చేయగలం’ అని అక్కడి పోలీసులు ఎందుకు వాపోతున్నారు?

  3. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఖద్దరుపై మనసు పడుతున్న కలెక్టర్లు

  4. పారిస్ ఒలింపిక్స్: ఫ్రాన్స్‌లో హిజాబ్‌పై నిషేధం, ఈ నిబంధనపై క్రీడాకారులు ఏమంటున్నారు?

  5. అన్నామలై: తెలుగు నేతలు ప్రచారం చేసిన కోయంబత్తూరులో కుల సమీకరణలు పనిచేస్తాయా?

  6. నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా ఆస్తులు జప్తు చేసిన ఈడీ

    నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు చెందిన రూ. 97.79 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ నిరోధక చట్టం-2002 కింద జప్తు చేసింది.

    ఈడీ ఇచ్చిన సమాచారం ప్రకారం, జప్తు చేసిన ఆస్తిలో రాజ్ కుంద్రా భార్య, నటి శిల్పాశెట్టి పేరిట ఉన్న జుహు ఫ్లాట్ కూడా ఉంది. దీంతో పాటు రాజ్ కుంద్రా పేరిట ఉన్న పుణె ఫ్లాట్, ఈక్విటీ షేర్లను కూడా సీజ్ చేశారు.

    రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను రూపొందించి, వాటిని యాప్ ద్వారా ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలతో 2021 జులైలో ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

    ఆ తర్వాత ఆయన బెయిల్ పై బయటకి వచ్చారు.

  7. అనన్య రెడ్డి: సివిల్స్‌లో 3వ ర్యాంకు ఎలా సాధించానంటే..

  8. ఎమ్మెల్యే కావాలంటే ఫస్ట్ స్టెప్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

  9. ‘‘రష్యా చేతిలో యుక్రెయిన్ ఒకవేళ ఓడిపోతే మూడో ప్రపంచయుద్ధమే’’

    రష్యా చేతిలో ఒకవేళ యుక్రెయిన్ ఓడిపోతే ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని యుక్రెయిన్ ప్రధాని డెనిస్ షమిహాల్ అన్నారు.

    ఫారిన్ రిలీఫ్ బిల్లును ఆమోదించాలని అమెరికా కాంగ్రెస్‌ను డెనిస్ డిమాండ్ చేశారు.

    యుక్రెయిన్‌కు రిలీఫ్ ప్యాకేజీ ఇవ్వడంపై శనివారం అమెరికా పార్లమెంట్‌లో ఓటింగ్ జరగనుంది.

    ‘‘సహాయం అందకుంటే యుక్రెయిన్ ఓడిపోతుంది. దీని వల్ల అంతర్జాతీయ భద్రతా వ్యవస్థ మొత్తం కూలిపోతుంది. భద్రత కోసం ప్రపంచానికి కొత్త వ్యవస్థ అవసరం. అప్పుడు కొత్త ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. ఇంకా ఇలాంటి యుద్ధాలు ఎన్నో రావొచ్చు. అప్పుడు, ఈ వ్యవహారం మూడో ప్రపంచ యుద్ధం వైపు వెళ్లవచ్చు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

  10. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.