లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.
తమ స్కూల్‌లో నమాజ్ నిషేధం వివక్షగా పేర్కొంటూ వెంబ్లీలోని మిషెలా స్కూల్‌కు చెందిన ఒక విద్యార్థిని హైకోర్టును ఆశ్రయించింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.

ఫొటో సోర్స్, CABINET OFFICE
లండన్‌లోని ఒక స్కూల్‌లో నమాజ్ నిషేధంపై ముస్లిం విద్యార్థిని వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.
తమ స్కూల్‌లో నమాజ్ నిషేధం వివక్షగా పేర్కొంటూ వెంబ్లీలోని మిషెలా స్కూల్‌కు చెందిన ఒక విద్యార్థిని హైకోర్టును ఆశ్రయించింది.
‘‘ఫిర్యాదుదారు స్కూల్‌లో ఎన్‌రోల్ చేసుకునేటప్పుడే, మతాన్ని వ్యక్తపరిచే విషయం నిషేధించడమన్న విషయాన్ని అంగీకరించాల్సి ఉంది’’ అని 84 పేజీల తీర్పులో జస్టిస్ థామస్ లిండెన్ చెప్పారు.
హైకోర్టు నిర్ణయం అన్ని స్కూళ్లకు విజయమని ఫ్రీ స్కూల్ వ్యవస్థాపకులు, ప్రధానోపాధ్యాయురాలు కేథరీన్ బీర్బల్ సింగ్ తెలిపారు.
హైకోర్టులో అప్పీట్ కొట్టేసిన తర్వాత విద్యార్థిని, తానే అదే స్కూల్‌లో చదువుతానని, జీసీఎస్‌ఈ పరీక్షలపై దృష్టిపెడతానని చెప్పింది.
‘‘అప్పీల్‌కు వెళ్లి ఓడిపోయాను. కానీ, నిషేధానికి వ్యతిరేకంగా అప్పీల్‌కు వెళ్లి సరైన పనే చేశానని అనుకుంటున్నాను. నాకు, నా మతానికి కట్టుబడి ఉండేందుకు నేను ప్రయత్నించాను’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భారీ వర్షాల కారణంగా కొన్ని గల్ఫ్ దేశాలు అతలాకుతలమయ్యాయి. దీనివల్ల ఆకస్మిక వరదలు సంభవించాయి.
అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయ కార్యకలాపాలు కొద్దిసేపు నిలిపివేశారు. కొన్ని విమానాలను దారి మళ్ళించినట్టు ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్రకటించారు. తరువాత విమాన రాకపోకలను యధావిధిగా అనుమతించారు.
నీట మునిగిన రన్‌వేపై విమానాలు వెళుతున్న దృశ్యాలు ఓ ధృవీకరించని వీడియోలో కనిపించింది.
వరదల కారణంగా కనీసం 18 మంది మృతి చెందారని ఒమన్ అధికారులు చెప్పారు.
గల్ఫ్ ప్రాంతంలోని ఏడాదంతా నమోదయ్యే వర్షపాతం కొన్నిదేశాల్లో ఒక్కరోజులోనే నమోదైంది.
మంగళవారం ఉదయం అబుదాబీ, దుబాయ్, షార్జా సహా దేశంలోని చాలా ప్రాంతాలకు యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
వేడి, పొడి వాతావరణానికి ప్రసిద్ధి పొందిన గల్ఫ్ ప్రాంతం ఇటీవల కాలంలో తరచూ వరదల బారిన పడుతోంది.
పొరుగునే ఉన్న ఒమెన్‌లో ఆకస్మికంగా సంభవించిన వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 18కి పెరిగినట్టు అధికారులు చెప్పారు.
రోడ్డుపైన కార్లు వరదనీటిలో చిక్కుకున్న దృశ్యాలు బహ్రెయిన్‌లో కనిపిస్తున్నాయి.
ఈ అసాధారణ వాతావరణ పరిస్థితులను కొంతమంది వాతావరణ మార్పులతో ముడిపెతున్నారు.
భూమి వేడెక్కుతున్న కొద్దీ భవిష్యత్తులో మరిన్ని తుపానులు తప్పవని వారు చెబుతున్నారు.
సగటున ఒక సెంట్రీగ్రేడ్ వేడి పెరిగితే తేమ 7శాతం పెరుగుతుంది.
దీనివల్ల భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని సందర్భాలలో తక్కువ సమయంలోనే పెద్ద వర్షం కురుస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఐపీఎల్‌లో భాగంగా మంగళవారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)పైరాజస్తాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) గెలుపొందింది.
రాజస్తాన్ రాయల్స్ విజయానికి చివరి 36 బంతుల్లో 96 పరుగులు చేయాల్సిన దశలో జోస్ బట్లర్ చెలరేగి ఆడాడు.
అతను 60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 107 పరుగులు చేసి ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ను 2 వికెట్ల తేడాతో గెలిపించాడు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసింది.
సునీల్ నరైన్ ధాటిగా ఆడుతూ సెంచరీ చేశాడు. అతను 56 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. రఘువంశీ (30) రాణించాడు.
ప్రత్యర్థి బౌలర్లలో అవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ చెరో 2 వికెట్లు తీశారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 224 పరుగులు చేసి గెలిచింది.
ఇది రాయల్స్‌కు ఆరో విజయం. మొత్తం 12 పాయింట్లతో రాయల్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
బట్లర్ సెంచరీతో చెలరేగగా, పావెల్ (13 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు) చివర్లో కాస్త వేగంగా ఆడాడు.
రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో బట్లర్ తర్వాత రియాన్ పరాగ్ (34) అత్యధిక పరుగులు చేశాడు. మిగతా వారంతా విఫలమయ్యారు.
బట్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో సునీల్ నరైన్ శతకం వృథా అయింది.
కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు తీశారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసంఈ లింక్‌పైక్లిక్ చేయండి.