ఏపీ సీఎం జగన్‌పై రాయితో దాడి, కంటిపై స్వల్ప గాయం

శనివారం సాయంత్రం విజయవాడ సింగ్ నగర్‌లో ‘మేమంతా సిద్ధం’ పేరుతో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో పాల్గొంటుండగా ఈ ఘటన జరిగింది.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

    ధన్యవాదాలు.

  2. ఏపీ సీఎం జగన్‌పై రాయితో దాడి, కంటిపై స్వల్ప గాయం

    జగన్‌పై రాయితో దాడి

    ఫొటో సోర్స్, UGC

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై దుండగులు రాయి విసరడంతో ఆయన ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది.

    శనివారం సాయంత్రం విజయవాడ సింగ్ నగర్‌లో ‘మేమంతా సిద్ధం’ పేరుతో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో పాల్గొంటుండగా ఈ ఘటన జరిగింది.

    సీఎం పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి కూడా స్వల్ప గాయమైంది.

    ఘటన జరిగిన వెంటనే వైద్యులు సీఎంకు బస్సులోనే ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ఆయన బస్సు యాత్రను కొనసాగించారు.

    ఘటన మీద పోలీసులు అప్రత్తమయ్యారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు రంగంలో దిగారు. చీకటి ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

  3. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్ బలగాలు

    ఫైల్ ఫోటో

    ఫొటో సోర్స్, REUTERS

    హార్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న ఒక వాణిజ్య నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకుంది. శనివారం ఉదయం ఈ సంఘటన జరిగింది.

    యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ తీర ప్రాంతానికి 50 మైళ్ల దూరంలో ఇరాన్‌కు చెందిన ప్రత్యేక దళాలు ఎంఎస్‌సీ ఏరిస్‌ నౌకను ఆధీనంలోకి తీసుకున్నాయి.

    ఈ నౌకను తమ జలాల్లోకి తీసుకెళ్లినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ‘ఇర్నా’ రిపోర్టు చేసినట్లు రాయిటర్స్ పేర్కొంది.

    రాయిటర్స్ వార్తా సంస్థ విడుదల చేసిన ఫుటేజీలో, హెలికాప్టర్‌తో వెంబడించి ఈ నౌకను వారి ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిసింది.

    పోర్చుగల్‌ జెండాతో వెళ్తున్న ఎంఎస్‌సీ ఏరిస్ నౌక, ఇజ్రాయెల్ బిలియనీర్ ఇయాల్ ఓఫర్‌కు చెందిన జోడియాక్ మారిటైమ్ సంస్థది.

    ఇరాన్-ఇజ్రాయెల్ మధ్యలో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారుతున్న సమయంలో ఈ వాణిజ్య నౌకను వారు స్వాధీనం చేసుకున్నారు.

    ఈ నౌకలో 25 మంది సిబ్బంది ఉన్నట్లు ఎంఎస్‌సీ చెప్పింది.

    పరిస్థితులను మరింత ప్రమాదకరంగా మార్చితే, ఇరాన్ దానికి తగ్గ పర్యవసనాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ హెచ్చరించింది.

  4. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తత: యుద్ధభయం ఉన్నా ఇజ్రాయెల్ వెళ్లడానికి ఈ యూపీ యువకులు ఎందుకు సిద్ధమవుతున్నారు?

  5. మానవ మలంతో విమానాలు నడిపిస్తారా, ఎలా సాధ్యం?

  6. సైబర్ బానిసలు: ‘నా కళ్ళ ముందే ఆ ఇద్దరు అమ్మాయిలను 17మంది రేప్ చేశారు, నన్ను 16 రోజులు చిత్ర హింసలు పెట్టారు’

  7. బ్రేకింగ్ న్యూస్, సిడ్నీ మాల్‌: దుండగుడి కత్తి దాడిలో ఆరుగురు మృతి, అనుమానితుడి కాల్చివేత

    సిడ్నీ షాపింగ్ సెంటర్
    ఫొటో క్యాప్షన్, షాపింగ్ సెంటర్ బయట అత్యవసర సేవల వాహనాలు కనిపిస్తున్నాయి

    సిడ్నీ షాపింగ్ సెంటర్‌లో దుండగుడు చేసిన కత్తి దాడిలో ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. గాయాలు పాలైన వారిని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. గాయాలు పాలైన వారిలో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు.

    దాడి అనంతరం పోలీసులు అనుమానితుడిపై కాల్పులు జరిపారు.

    బోండీ జంక్షన్‌లోని వెస్ట్‌ఫీల్డ్ మాల్‌ వద్ద పలువురు చనిపోయారని, ప్రజలు భయంతో పారిపోతుండటం చూడొచ్చని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.

    ‘‘స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 4 గంటలకు (భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు) కొంతమందిని కత్తితో పొడిచారనే వార్తలు వచ్చాయి. ఒక అనుమానితుడిపై కాల్పులు జరిపాం’’ అని పోలీసులు చెప్పారు.

    పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉండటంతో ప్రజల్ని ఆ ఏరియా నుంచి వెళ్లిపోవాలని కోరారు.

    ఘటనా స్థలంలో అంబులెన్స్‌లు, పోలీసు వాహనాలు ఉన్నట్లుగా సోషల్ మీడియా ఫోటోలు చూపిస్తున్నాయి.

    ఒక పెద్ద కత్తి పట్టుకున్న వ్యక్తితో పాటు భారీ ప్రాణనష్టం జరిగినట్లుగా ఆ ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

    దాడికి పాల్పడినట్లుగా భావిస్తోన్న ఒక వ్యక్తిని పోలీసులు కాల్చి చంపినట్లు వార్తా సంస్థ ఏఎఫ్‌పీతో అధికారులు చెప్పారు.

  8. ఇజ్రాయెల్ మీద ఇరాన్‌ దాడికి దిగుతుందా... ఆ రెండు దేశాలకు వెళ్ళవద్దంటూ అమెరికా, భారత్ వంటి దేశాలు ఎందుకు తమ పౌరుల్ని హెచ్చరిస్తున్నాయి?

  9. పాకిస్తాన్: పంజాబ్‌కు చెందిన 9 మందిని కాల్చి చంపిన సాయుధులు

    బలూచిస్తాన్‌లోని నోష్కీ సమీపంలో శనివారం తెల్లవారుజామున పంజాబ్‌కు చెందిన 9 మందిని గన్‌మెన్ కాల్చి చంపినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    ప్రయాణిస్తున్న ఒక బస్సు నుంచి వారిని కిందకు దించి, కాల్చి చంపారని అధికారులు చెప్పినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది.

    ఇలాంటిదే మరో ఘటన కూడా జరిగినట్లు పాకిస్తాన్‌కు చెందిన డాన్ న్యూస్‌ను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ వెల్లడించింది.

    ఒక వాహనంపై జరిగిన దాడిలో ఒక వ్యక్తి చనిపోగా నలుగురు గాయపడినట్లు డాన్ న్యూస్ రిపోర్ట్ చేసింది.

    ‘‘నోష్కీ సమీపంలో క్వెట్ట-టఫ్టాన్ హైవే ఎన్-40 మీద ఒక బస్సును దాదాపు 10-12 మంది గన్‌మెన్లు అడ్డుకున్నారు. బస్సులో నుంచి 9 మంది ప్రయాణికులను తీసుకెళ్లారు’’ అని డాన్ న్యూస్‌తో డిప్యూటీ కమిషనర్ హబీబుల్లా ముసాఖేల్ చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. ప్రోటీన్స్ శాకాహారులకు ఎలా లభిస్తాయి? అందరూ తెలుసుకోవాల్సిన 5 ముఖ్యాంశాలు...

  11. వాయనాడ్: కేరళ రాజకీయాలను కుదిపేస్తున్న 'ర్యాగింగ్' డెత్, రంగంలోకి దిగిన సీబీఐ

  12. జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 105 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది

  13. ఐపీఎల్: కుల్‌దీప్, జేక్ ఫ్రేజర్ చెలరేగడంతో దిల్లీకి రెండో విజయం, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ సెంటిమెంట్ బ్రేక్

    క్రికెట్

    ఫొటో సోర్స్, Getty Images

    ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మొదట 160 కన్నా ఎక్కువ పరుగులు చేస్తే ఆ మ్యాచ్‌లో గెలుపు ఖాయమనే మాటకు కాలం చెల్లిపోయింది.

    లక్నో పరంపరకు దిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్రేక్ వేసింది.

    శుక్రవారం నాటి మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ జట్టు 6 వికెట్లతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై గెలుపొందింది.

    తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది.

    ఆయుష్ బదోని (35 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది.

    కేఎల్ రాహుల్ (22 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 3, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీశారు.

    అనంతరం దిల్లీ క్యాపిటల్స్ జట్టు 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 170 పరుగులు చేసి గెలుపొందింది.

    ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో దిల్లీకి ఇది రెండో గెలుపు.

    అరంగేట్ర ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (35 బంతుల్లో 55; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్ రిషభ్ పంత్ (24 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడారు. పృథ్వీ షా (32) రాణించాడు.

    నేడు రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది.

  14. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ఈ పేజీని ప్రచురిస్తోంది.

    నిన్నటి లై‌వ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.