You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

రష్యా వరదలు: ఇది నది కాదు, నగరం..

రష్యాలోని ఆరెన్‌బర్గ్ నగరంలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు నదుల్లా మారాయి. ఇంత వరదను స్థానికులు గతంలో ఎప్పుడూ చూళ్లేదని అధికారులు చెబుతున్నారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. విజయవాడ: 'మేమంతా బూడిద తిని, బూడిద తాగి టెన్షన్‌తో బతుకుతున్నాం'

  3. పాకిస్తాన్ క్రికెట్‌లో కొత్త 'డ్రామా', అమీర్ రీఎంట్రీకి కారణాలేంటి?

  4. శ్రీకాంత్ బొల్లా బయోపిక్: కళ్లులేని ఈ వ్యక్తి వందల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి ఎలా అయ్యారంటే...

  5. మద్యం పాలసీ కేసు: మూడు రోజుల సీబీఐ కస్టడీకి కల్వకుంట్ల కవిత

    బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మూడు రోజుల సీబీఐ కస్టడీకి దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది.

    దిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను విచారణ కోసం ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది.

    ఇరువైపుల వాదనలను విన్న రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా, మూడు రోజుల పాటు అంటే ఏప్రిల్ 15 వరకు ఆమెను సీబీఐ కస్టడీకి అప్పగిస్తున్నట్లు తెలిపారు.

    మార్చి 15న ఆమెను అరెస్టు చేసింది. దిల్లీలోని తీహార్ జైలులో ఉన్న కవితను గురువారం (ఏప్రిల్ 11న) సీబీఐ అరెస్ట్ చేసింది.

  6. రష్యా వరదలు: ఇది నది కాదు, నగరం..

    రష్యాలోని ఆరెన్‌బర్గ్ నగరంలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు నదుల్లా మారాయి. ఇంత వరదను స్థానికులు గతంలో ఎప్పుడూ చూళ్లేదని అధికారులు చెబుతున్నారు.

    వరద ప్రభావిత ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నగరంలో దాదాపు అన్ని ఇళ్లూ నీటమునిగాయని మేయర్ చెప్పారు. ఆయన ఒక పడవలో తిరుగుతూ నష్టాన్ని అంచనా వేశారు. రష్యాలో వసంతకాలంలో వరదలు రావడం కొత్తేమీ కాదు. కానీ, అవి ఈ స్థాయిలో ఎప్పుడూ రాలేదని అధికారులు చెప్పారు.

    భారీ వర్షాలతోపాటూ, వేగంగా కరుగుతున్న మంచు వల్ల నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండడంతో ఈ వరదలు వచ్చాయని భావిస్తున్నారు.

    ఆరెన్‌బర్గ్‌లో వేల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోతున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి అత్యవసర సేవల సిబ్బంది వారికి సాయం చేస్తున్నారు. నిత్యావసర సరుకులు, వస్తువులు, వాహనాలు అన్నీ వరదలో కొట్టుకుపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ఉరల్ పర్వతాలు, పశ్చిమ సైబీరియాలోని పట్టణాలు, గ్రామాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. వరద తీవ్రత ఇంకా పెరుగుతూనే ఉంది.

    రష్యాతోపాటూ పక్కనే ఉన్న కజకిస్తాన్‌‌ను కూడా వరద ముంచెత్తింది. కజకిస్తాన్‌‌‌లో దాదాపు లక్ష మందిని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి తలించారు.

  7. బుమ్రా, సూర్యకుమార్ యాదవ్: ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ మాంత్రికుల మాయాజాలం ఎలా సాగిందంటే?

  8. ఏజెంట్ల చేతిలో మోసపోయి రష్యా దళాల తరఫున యుక్రెయిన్ మీద పోరాడిన ఇద్దరు భారతీయులు స్వదేశానికి ఎలా తిరిగి వచ్చారు, ఏమంటున్నారు?

  9. హీట్‌వేవ్ సమస్యపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష

    ఈ ఏడాది విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయనే అంచనాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హీట్‌వేవ్ (వడగాలులు)‌ను ఎదుర్కొనే ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

    అన్ని మంత్రిత్వ శాఖలతో పాటు కేంద్రం, రాష్ట్రం, జిల్లా స్థాయిలో అందరూ కలిసి పనిచేయాలని ఆయన కోరారు.

    ఈ సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగినట్లు ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఏప్రిల్-జూన్ సమయంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో విపరీతమైన వేడి ఉండే అవకాశం ఉందని ఆయనకు అధికారులు చెప్పినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

    ఈ సమావేశంలో నిత్యావసర మందులు, ఐస్ ప్యాక్, ఓఆర్‌ఎస్, తాగునీటి లభ్యత ఏర్పాట్లపై సమీక్షించారు.

    ‘‘2024లో ఊహించినదాని కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాదిలోనే దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ జారీ చేసే మార్గదర్శకాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదించాలి. దీనివల్ల విస్తృత స్థాయిలో ప్రజలకు మార్గదర్శకాలు అందుబాటులోకి వస్తాయి’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

  10. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.