గాజా విషయంలో నెతన్యాహు తప్పు చేస్తున్నారు - జో బైడెన్
గాజాలో వచ్చే ఆరు నుంచి ఏడు వారాల పాటు పూర్తి స్థాయిలో ఆహారం, వైద్య సరఫరాలకు యాక్సస్ కల్పించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.
లైవ్ కవరేజీ
విజయవాడ: 'మేమంతా బూడిద తిని, బూడిద తాగి టెన్షన్‌తో బతుకుతున్నాం'
హీట్‌వేవ్ సమస్యపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష

ఫొటో సోర్స్, ANI
ఈ ఏడాది విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయనే అంచనాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హీట్‌వేవ్ (వడగాలులు)ను ఎదుర్కొనే ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
అన్ని మంత్రిత్వ శాఖలతో పాటు కేంద్రం, రాష్ట్రం, జిల్లా స్థాయిలో అందరూ కలిసి పనిచేయాలని ఆయన కోరారు.
ఈ సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగినట్లు ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఏప్రిల్-జూన్ సమయంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో విపరీతమైన వేడి ఉండే అవకాశం ఉందని ఆయనకు అధికారులు చెప్పినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సమావేశంలో నిత్యావసర మందులు, ఐస్ ప్యాక్, ఓఆర్‌ఎస్, తాగునీటి లభ్యత ఏర్పాట్లపై సమీక్షించారు.
‘‘2024లో ఊహించినదాని కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాదిలోనే దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ జారీ చేసే మార్గదర్శకాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదించాలి. దీనివల్ల విస్తృత స్థాయిలో ప్రజలకు మార్గదర్శకాలు అందుబాటులోకి వస్తాయి’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.
రష్యా వరదలు: ఇది నది కాదు, నగరం..
హీట్ వేవ్ అంటే ఏంటి... దీనికీ ఎన్నికలకూ ఏమిటి సంబంధం?
కాఫీ తాగినప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుంది?
బాగా పనిచేస్తున్నట్లు మీకు అనిపించట్లేదా? ఈ ఆరు చిట్కాలు మీ కోసమే..
తిహార్ జైలులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన సీబీఐ

ఫొటో సోర్స్, KALVAKUNTLA KAVITHA/FACEBOOK
ఫొటో క్యాప్షన్, ఎమ్మెల్సీ కవిత దిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అరెస్టు చేసింది.
కవితను ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది, ప్రస్తుతం ఆమె దిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.
ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి పొందిన తర్వాత సీబీఐ అధికారులు జైలులో కవితను ప్రశ్నించారు.
హరియాణాలో బస్సు బోల్తా : ఐదుగురు చిన్నారులు మృతి

ఫొటో సోర్స్, YEARS
హరియాణా రాష్ట్రంలోని మహేంద్రగఢ్ జిల్లాలో ఓ స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఐదుగురు చిన్నారులు మృతి చెందారు.
‘‘ఈ ఘటన ఉదయం 9 గంటలకు జరిగింది. 20 మంది పిల్లలను మా వద్దకు తీసుకువచ్చారు. వారిలో నలుగురు పిల్లల ప్రాణాలు ఆస్పత్రికి రాకముందే పోయాయి. వెంటిలేటర్ అమర్చిన కొద్దిసేపటికి మరో పిల్లాడు చనిపోయాడు. మరో 15 మంది గాయాలకు చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి నిలకడగా ఉంది. కొందరిని మెరుగైన చికిత్స కోసం రెఫర్ చేశాం’’ అని నిహా హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ రవి కౌశిక్ చెప్పారు.
మహేంద్రగఢ్ జిల్లాలో కనైనా గ్రామం వద్ద బస్సు ప్రమాదానికి గురైంది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
'భారత గూఢచార సంస్థ' పాకిస్తాన్‌లో 20 మందిని చంపేసిందా, ది గార్డియన్ పత్రిక కథనంపై పాక్ ఏమంటోంది?
ప్రధాని మోదీని కలిసేందుకు ఎదురు చూస్తున్నా: ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, ANI
భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నానంటూ టెస్లా, స్పేస్ ఎక్స్, సామాజిక వేదిక ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు.
అయితే ఈ భేటీ ఇండియాలో జరుగుతుందా, లేదా మరే దేశంలోనా అనే స్పష్టతను ఆయన ఇవ్వలేదు.
భారత్‌లో టెస్లా కార్ల కంపెనీ ఏర్పాటు,పెట్టుబడులకు సంబంధించి మస్క్ కీలక ప్రకటన చేస్తారని రాయ్‌టర్స్ కథనం పేర్కొంది.
జూన్ 2023లో ఎలాన్ మస్క్ మోదీని న్యూయార్క్‌లో కలుసుకున్నారని రాయ్‌టర్స్ రాసింది.
ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని, భారత్‌లో తాను ఓ ఫ్యాక్టరీ నిర్మించాలనుకుంటున్నాని గతంలో మస్క్ భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
ఈనెలలో భారత్ కొత్త ఎలక్ట్రిక్ వాహన పాలసీని తీసుకువచ్చింది.
ఈమేరకు భారత్‌లో 50 కోట్ల పెట్టుబడి పెట్టి, ఫ్యాక్టరీని నెలకొల్పితే , కొన్ని మోడళ్ళపై దిగుమతి సుంకాన్ని 100 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తామని తెలిపింది.
ఈ నేపథ్యంలో మోదీ, మస్క్ భేటీలో ఈ అంశం చర్చకు వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కెనడా ఎన్నికల్లో భారత్, చైనా జోక్యం చేసుకున్నాయా?
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేస్తే, ఇజ్రాయెల్‌కు రక్షణగా నిలబడతామన్న అమెరికా
లోక్‌సభ ఎన్నికలు: తెలంగాణలో సుప్రీంకోర్టు బెంచ్‌పై ఇప్పుడెందుకు చర్చ మొదలైంది, కాంగ్రెస్ ఏమన్నది?
ఏపీపీఎస్సీ గ్రూప్ -2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఫిబ్రవరి 25న ఈ పరీక్ష నిర్వహించారు.
92,250 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించగా, 2,557 మందిని వివిధ కారణాలతో రిజెక్ట్ చేసినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
పూర్తి ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
మెయిన్స్ పరీక్షలు జులై 28న నిర్వహించనున్నారు.
గజల్ అలఘ్: ప్రెగ్నెన్సీపై ఈమె చేసిన పోస్ట్ పెద్ద చర్చకు దారితీసింది, విషయం ఏంటంటే..
రజాకార్: హిందుత్వ సినిమాలు ఓటర్లను ప్రభావితం చేయగలవా?
అంతరించిపోయిన ఈ నక్క ఒకప్పుడు మనిషికి బెస్ట్ ఫ్రెండా?
నితీష్ కుమార్ రెడ్డి: ఈ తెలుగు ‘హిట్‌మ్యాన్’కు టీమీండియాలో ఛాన్స్ వస్తుందా?
బస్తాల్లో రూ.5.6 కోట్ల నగదు, మూడు కేజీల బంగారం, 103 కేజీల వెండి నగలు..
వీడియో క్యాప్షన్, బస్తాల నిండా కోట్ల విలువైన నోట్ల కట్టలు, బంగారం, వెండి ఆభరణాలు.. రూ.5.6 కోట్ల నగదు, మూడు కేజీల బంగారాన్ని, 103 కేజీల వెండి ఆభరణాలను కర్ణాటకలోని బళ్లారి పోలీసులు సీజ్ చేశారు. ఏప్రిల్ 7న ఒక జువెలరీ షాపు యజమాని ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. లెక్కల్లో చూపని నగదు, బంగారం, వెండి ఆభరణాలు గుర్తించారు. ఈ బంగారం, వెండి ఆభరణాల విలువ రూ.2 కోట్ల దాకా ఉంటుందని పోలీసులు తెలిపారు.

