భీమా కోరేగావ్ కేసు: సామాజిక కార్యకర్త షోమా సేన్‌కు సుప్రీంకోర్టు బెయిల్

భీమా కోరేగావ్ కేసులో జైలులో ఉన్న సామాజిక కార్యకర్త షోమా సేన్‌కు జస్టిస్ అనిరుద్ధ బోస్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. కచ్చతీవు అప్పగింతకు శ్రీలంక సిద్ధమా, కాదా? ఆ మంత్రి ఏమన్నారు?

  3. దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎక్కడ?

  4. గాజాలో సహాయ సిబ్బందిపై వైమానిక దాడి: ఇద్దరు సీనియర్ అధికారులను తొలగించిన ఇజ్రాయెల్ సైన్యం

    నెతన్యాహు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, నెతన్యాహు

    గాజాలో 'వరల్డ్ సెంట్రల్ కిచెన్' సహాయ సిబ్బంది మృతితో ఇజ్రాయెల్ నష్ట నియంత్రణ చర్యలు ప్రారంభించింది. ఘటనకు బాధ్యులను చేస్తూ ఇద్దరు సీనియర్ అధికారులను ఇజ్రాయెల్ సైన్యం తొలగించింది.

    ఏప్రిల్ 1న గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు బ్రిటన్ పౌరులు, ఓ ఆస్ట్రేలియన్ సహా ఏడుగురు సహాయ సిబ్బంది చనిపోయారు. ఓ గోడౌన్ వద్ద వారు సాయాన్ని అందించి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో గాజాలో తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నామని వరల్డ్ సెంట్రల్ కిచెన్ ప్రకటించింది.

    ఇది యుద్ధంలో మానవతా సాయం అందిస్తున్న సంస్థలపై జరిపిన దాడి అని, ఈ దాడులకు ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని డబ్ల్యూసీకే వ్యవస్థాపకుడు ఆండ్రూస్ డిమాండ్ చేశారు.

    చారిటీ లోగో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను డబ్ల్యూసీకే సహాయ సిబ్బంది ధరించారని పాలస్తీనా వైద్య వర్గాలు తెలిపాయి.

    ఈ ఘటనపై పూర్తిస్థాయి సమీక్ష చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తాజాగా ఇద్దరు సీనియర్ అధికారులను విధుల నుంచి తొలగించింది.

  5. హవానా సిండ్రోమ్: ఈ అంతుచిక్కని ఆరోగ్య సమస్యకూ రష్యా నిఘా వ్యవస్థకూ సంబంధం ఉందా?

  6. భీమా కోరేగావ్ కేసు: సామాజిక కార్యకర్త షోమా సేన్‌కు సుప్రీంకోర్టు బెయిల్

    సుప్రీంకోర్టు

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, సుప్రీంకోర్టు

    భీమా కోరేగావ్ కేసులో జైలులో ఉన్న సామాజిక కార్యకర్త షోమా సేన్‌కు జస్టిస్ అనిరుద్ధ బోస్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.

    బెయిల్‌పై బయటికి వెళ్లిన తర్వాత స్పెషల్ కోర్టు అనుమతి లేకుండా షోమా సేన్ మహారాష్ట్ర విడిచి వెళ్లకూడదు. ఆమె పాస్‌పోర్టు సరెండర్ చేయాలి. ఆమె ఉండబోయే ఇంటి చిరునామాను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు తెలియజేయాలి.

    ఆమె తన ఫోన్ నంబర్ విచారణ అధికారులకు తెలియజేయడం తదితర షరతులతో షోమా సేన్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

    ఏమిటీ భీమా కోరేగావ్ కేసు?

    2018 జనవరి 1వ తేదీన మహారాష్ట్రలోని పుణెకు దగ్గరలో ఉన్న భీమా కోరేగావ్‌‌లో అల్లర్లు జరిగాయి.

    1818లో జరిగిన భీమా కోరేగావ్ యుద్ధానికి 200 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో వేడుకలు చేసుకునేందుకు ఆ రోజు అక్కడకు లక్షల మంది దళితులు వచ్చారు. అక్కడ చెలరేగిన అల్లర్లు దేశం మొత్తం ప్రకంపనలు సృష్టించాయి.

    పుణెలోని శనివార్‌వాడాలోని నిర్వహించిన ‘‘ఎల్గార్ పరిషత్’’ కాన్ఫెరెన్స్‌లో రెచ్చగొట్టే ప్రసంగాలే ఈ అలర్లకు కారణమని, మావోయిస్టులకు కూడా దీనితో సంబంధముందని ఆరోపణలు చేస్తూ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కాన్ఫెరెన్స్ అంతకుముందు రోజు అంటే 2017 డిసెంబరు 31న జరిగింది.

    ఈ కేసులో వివిధ రాష్ట్రాలకు చెందిన వామపక్ష ఉద్యమకారులు, రచయితలు, జర్నలిస్టులు, ప్రొఫెసర్లు, టీచర్లను అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు.

    ఈ కేసులో సురేంద్ర గాడ్లింగ్, సుధీర్ ధావలే, రోనా విల్సన్, షోమా సేన్, మహేశ్ రౌత్, రచయిత వరవరరావు, సామాజిక కార్యకర్తలు సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గొంజాల్వెజ్, జర్నలిస్టు గౌతమ్ నవలఖాలను 2018 జూన్, ఆగస్టు నెలల్లో అరెస్టు చేశారు.

    రచయిత-ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే, ఫాదర్ స్టాన్ స్వామి, హనీ బాబు, సాగర్ గోర్ఖే, రమేశ్ గైచోర్, జ్యోతి జగ్తాప్‌లను ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరికి ఇప్పటికే బెయిల్ లభించింది.

  7. ఫ్యామిలీ స్టార్ రివ్యూ: విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురాంల 'గీతగోవిందం' మ్యాజిక్ రిపీటయిందా?

  8. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్.. నిరుపేద మహిళలకు ప్రతి ఏడాది రూ.1 లక్ష సాయం

    మల్లికార్జున్ ఖర్గే

    ఫొటో సోర్స్, @RahulGandhi

    ఫొటో క్యాప్షన్, మల్లికార్జున్ ఖర్గే

    లోక్‌సభ ఎన్నికల వేళ మేనిఫెస్టో ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.

    ఎలక్టోరల్ బాండ్ల పేరుతో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది.

    ప్రధానంగా యువత, మహిళలు, రైతులు, కార్మికులు, సమాన న్యాయంపై హామీలు ఇచ్చారు.

    శుక్రవారం దిల్లీలో, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఈ మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ, నారీన్యాయ్ కింద ప్రతి ఏడాది నిరుపేద మహిళలకు రూ.1 లక్ష చొప్పున సాయం అందిస్తామని చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    మేనిఫెస్టోలోచెప్పిన హామీల్లో కొన్ని..

    • నారీ న్యాయ్ కింద ప్రతి ఏడాది నిరుపేద మహిళలకు రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం.
    • కిసాన్ న్యాయ్ కింద రైతులకు రుణమాఫీ, కనీస మద్దతు ధర హామీ.
    • శ్రామిక్ న్యాయ్‌‌లో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కనీస వేతనం రూ.400 ఇచ్చేలా హామీ.
    • సామాజిక-ఆర్థిక న్యాయ్ కింద కులగణనకు హామీ
  9. తెలంగాణ: ఖమ్మం పార్లమెంటు సీటు మీదే ఈ మూడు కుటుంబాల గురి... అసలు కథేంటి?

  10. ది కేరళ స్టోరీ: దూరదర్శన్‌లో ప్రసారం నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌‌కు లేఖ రాసిన కేరళ కాంగ్రెస్ నేత

    దూరదర్శన్

    ఫొటో సోర్స్, THE KERALA STORY

    దూరదర్శన్‌ చానల్‌లో ‘ది కేరళస్టోరీ’ సినిమా ప్రసారంపై ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు కేరళ కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులు వీడీ సతీశన్. చిత్రం ప్రసారం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు.

    “ఏప్రిల్ 5న దూరదర్శన్ చానల్‌లో ది కేరళ స్టోరీ ప్రసారం అవుతున్న విషయం తెలిసింది. దేశాన్ని మతపరంగా విభజించే సంఘ్ పరివార్ విషపూరిత ఎజెండాలో ఈ సినిమా ఓ భాగమని నేను నమ్ముతున్నాను" అని లేఖలో రాశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    అంతకుముందు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా దీనిపై స్పందించారు.

    ఆయన ట్విట్టర్‌ (ఎక్స్)లో ఆయన, “మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ‘కేరళ స్టోరీ’ చిత్రాన్ని దూరదర్శన్‌లో ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వ టీవీ చానల్ బీజేపీ-ఆరెస్సెస్ ప్రచార సాధనంగా మారకూడదు” అని రాశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  11. తొలితరం తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత

    శాంతిస్వరూప్

    ఫొటో సోర్స్, Youtube

    తొలితరం తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూశారు.

    గురువారం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని మలక్‌పేట‌ యశోదా ఆసుపత్రిలో చేరారు.

    చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూసినట్లు యశోద ఆసుపత్రి వర్గాలు బీబీసీకి చెప్పాయి.

    శాంతిస్వరూప్ తొలి తెలుగు న్యూస్ రీడర్‌గా గుర్తింపు పొందారు.

    1983 నుంచి దూరదర్శన్‌లో వార్తలు చదవడం ప్రారంభించారు.

    2011లో ఆయన ఉద్యోగ విరమణ చేశారు. ఒకప్పుడు దూరదర్శన్ చూసే ప్రతి ఒక్కరికి శాంతిస్వరూప్ చిరపరిచితులు. తొలినాళ్లలో టెలీప్రాంప్టర్ లేకుండానే, చాలా ఏళ్లపాటు పేపర్ చూసి చదివేవాడినని ఆయన పలు సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో చెప్పారు.

    ఆయనకు భార్య రోజారాణి, ఇద్దరు కుమారులున్నారు.

  12. ఇజ్రాయెల్-గాజా: బాధితులకు సాయం అందించేందుకు మూడు సరిహద్దులను తెరవనున్న ఇజ్రాయెల్

    ఇజ్రాయెల్-గాజా

    ఫొటో సోర్స్, Getty Images

    గాజాకు మానవతా సాయం చేరవేసేందుకు వీలుగా మూడు మార్గాలను తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది.

    యుద్ధం ప్రారంభమైన సమయంలో మూసివేసిన ఉత్తరగాజాలోని ఎరెజ్‌గేట్‌ను, ఇప్పుడు తాత్కాలికంగా తెరవనున్నారు.

    ఆహారం, వస్తువులు, ఇతర సామగ్రిని పంపేందుకు అష్దోద్ పోర్ట్‌ కూడా తెరుచుకోనుంది.

    వీటితోపాటు జోర్డాన్‌ నుంచి గాజాకు చేరుకునేందుకు ఉన్న కెరెమ్ షాలోమ్ క్రాసింగ్‌ కూడా తెరుచుకోనుంది.

    గత సోమవారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు సహాయసిబ్బంది మరణించారు.

    ఈ ఘటన తరువాత అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో చర్చలు జరిపారు. అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది ఇజ్రాయెల్.

    వరల్డ్ కిచెన్ సెంటర్‌కు చెంది ఏడుగురు సహాయక సిబ్బంది మరణం తరువాత, ఆ సంస్థ సరుకుల పంపిణీ నిలిపివేసింది.

    యుద్ధం మొదలైనప్పటి నుంచి, ఇప్పటివరకు సహాయక సామాగ్రి పంపిణీ చేసే సిబ్బందిలో 196 మంది మరణించారు.

    అక్టోబర్ 7న హమాస్ మెరుపుదాడి అనంతరం ఇజ్రాయెల్ సైన్యం గాజాపై దాడులు మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఈ గాజాలో 33 వేల మంది మరణించారని, హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

  13. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

  14. గాజాలో కాల్పుల విరమణ తీర్మానాన్ని వ్యతిరేకించి అమెరికా తప్పు చేసింది: చైనా