ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఈ రోజుకు ముగిస్తున్నాం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం..
గుడ్ నైట్.
ఇజ్రాయెల్ గాజాలో చేసిన వైమానిక దాడులలో ముగ్గురు బ్రిటన్ జాతీయులు సహా ఏడుగురు సహాయక సిబ్బంది చనిపోయారు. వారు వరల్డ్ సెంట్రల్ కిచెన్ (డబ్ల్యుసీకే) కోసం పనిచేస్తున్నారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఈ రోజుకు ముగిస్తున్నాం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం..
గుడ్ నైట్.

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు కలెక్టర్లను, ఆరుగురు ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చింది.
వీరిలో కృష్ణా, అనంతపురం, తిరుపతి జిల్లాల కలెక్టర్లు పి.రాజబాబు, ఎం.గౌతమి, పి.లక్ష్మీశా ఉన్నారు.
బదిలీ అయిన ఐదుగురు ఎస్పీల్లో ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ పి. జాషువా, అనంతపురం ఎస్పీ కె.కె.ఎన్. అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ కె. తిరుమలేశ్వర్ ఉన్నారు.
ఈ ఐదుగురు ఎస్పీలతోపాటు గుంటూరు రేంజ్ ఐజీ జి.పాలరాజును ఎన్నికల బాధ్యతల నుంచి తప్పిస్తూ, వారిని బదిలీ చేయాలంటూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త అధికారుల నియామకం జరిగే వరకు వారి దిగువ అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది.
అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోగా ఆయా నియామకాలకు సంబంధించి ఒక్కో పోస్టుకు ముగ్గురు అధికారుల పేర్లను సిఫార్సు చేయాలంటూ సీఎస్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

ఫొటో సోర్స్, APCEO

ఫొటో సోర్స్, Getty Images
‘పతంజలి’ తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో ఆ కంపెనీ దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
రాందేవ్ బాబాపై, పతంజలి ఆయుర్వేద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో సమాధానం చెప్పాలని ప్రశ్నించింది.
కోర్టుకు రామ్‌దేవ్‌తోపాటు బాలకృష్ణ హాజరయ్యారు.
పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనలను నిలుపుదల చేసేలా ఆదేశాలివ్వాలంటూ కొన్ని నెలల కిందట ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
కేసును విచారించిన న్యాయస్థానం, వెంటనే పతంజలి ఔషధాలకు సంబంధించిన తప్పుదోవ పట్టించే ప్రకటనలను ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా నుంచి తొలగించాలని ఫిబ్రవరి 27న ఆదేశించింది.
అలాంటి ప్రకటనలు మళ్లీ ప్రసారం చేయడంతో కోర్టు ధిక్కారం కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
కంపెనీలోని మీడియా సిబ్బందికి సుప్రీంకోర్టు ఆదేశాలు తెలియకపోవడంతో అలా జరిగిందని బాలకృష్ణ తన అఫిడవిట్‌లో చెప్పారు. అయితే, రామ్‌దేవ్ బాబా అఫిడవిట్ దాఖలు చేయలేదు.
దీంతో, పతంజలి చర్యలు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం కిందకే వస్తాయంటూ జస్టిస్ కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారంలోగా మరో అఫిడవిట్ దాఖలు చేయడమే కాకుండా ఏప్రిల్ 10న బాబా రామ్‌దేవ్, బాలకృష్ణ స్వయంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
కేంద్ర ఆయుష్ శాఖను కూడా కోర్టు ప్రశ్నించింది. పతంజలి వ్యవహారంపై ఆ కంపెనీ ఆయుష్‌కు వివరణ ఇచ్చినా, అది కోర్టు వరకు ఎందుకు రాలేదని అడిగింది.
ఔషధాలకు బదులు తమ ఉత్పత్తులు వాడాలంటూ పతంజలి ప్రచారం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం ఎందుకు కళ్లు మూసుకుంటోందని కోర్టు ప్రశ్నించింది.

ఫొటో సోర్స్, Reuters
ఇజ్రాయెల్ గాజాలో చేసిన వైమానిక దాడులలో ముగ్గురు బ్రిటన్ పౌరులు, ఓ ఆస్ట్రేలియన్ సహా ఏడుగురు సహాయక సిబ్బంది చనిపోయారు. వారు వరల్డ్ సెంట్రల్ కిచెన్ (డబ్ల్యుసీకే) కోసం పనిచేస్తున్నారు.
ఓ గోడౌన్ వద్ద వారు అప్పుడే సాయాన్ని అందించి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
దీంతో తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నామని, భవిష్యత్ గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వరల్డ్ సెంట్రల్ కిచెన్ ప్రకటించింది.
ఇది కేవలం డబ్ల్యుసీకేకు వ్యతిరేకంగా జరిగిన దాడి కాదు. ఇది ఆహారాన్ని ఓ ఆయుధంగా వాడుతున్న యుద్ధంలో మానవతా సాయం అందిస్తున్న సంస్థలపై జరిపిన దాడి అని, ఈ దాడులకు ఇజ్రాయెలే కారణమని డబ్ల్యుసీకే వ్యవస్థాపకుడు జోెస్ అండ్రూస్ ఆరోపించారు.
చారిటీ లోగో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను డబ్ల్యుసీకే సహాయక సిబ్బంది ధరించారని పాలస్తీనా వైద్య వర్గాలు తెలిపాయి.
ఈ ఘటపై పూర్తి స్థాయి సమీక్ష చేస్తామని ఇజ్రాయెలీ సైన్యం ప్రకటించింది.
ఉన్నత స్థాయి విచారణ ద్వారా ఈ విషాద ఘటనకు దారి తీసిన పరిస్థితులను అర్థం చేసుకుంటామని ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రకటించింది.
ఏడుగురి సహాయక సిబ్బంది మరణం గాజాలోని ప్రమాదకర పరిస్థితులను తేటతెల్లం చేస్తున్నాయని యూనిసెఫ్ అధికార ప్రతినిధి బీబీసీకి చెప్పారు.
రేడియో 4తో జేమ్స్ ఎల్డర్ మాట్లాడుతూ డబ్ల్యుసీసీ సహాయకుల మృతి భయాందోళన కలిగిస్తోందని, తీవ్ర విషాద ఘటన అని చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ముగ్గురు విదేశీ సహాయక సిబ్బందితో పాటు వారి డ్రైవర్ మరణించారు.
చనిపోయిన సహాయక సిబ్బందిలో ఒకరు ఆస్ట్రేలియా వాసి కాగా, మరొకరు పోలాండ్, ఇంకొకరు బ్రిటిష్ పౌరుడు అని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారి డ్రైవర్ పాలస్తీనాకు చెందినవారని చెప్పింది.
వరల్డ్ సెంట్రల్ కిచెన్ (డబ్ల్యూసీకే) అని లోగో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను ఈ సహాయక సిబ్బంది ధరించారని బీబీసీకి పాలస్తీనాకు చెందిన సోర్స్ ఒకరు చెప్పారు.
వరల్డ్ సెంట్రల్ కిచెన్, అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో). గాజాలో ప్రజలకు ఈ సంస్థ ఆహారాన్ని అందిస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది.
దాడిలో చనిపోయిన ఈ నలుగురి మృతదేహాలను తమ ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు అల్-అక్సా ఆసుపత్రికి చెందిన ఒక సోర్స్ తెలిపారు.
ఈ సహాయక సిబ్బంది కారులో దైర్ అల్ బలాహ్ ఏరియాలోని తీర ప్రాంతం గుండా ప్రయాణిస్తున్న సమయంలో వారిపై వైమానిక దాడి జరిగింది.