ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శుక్రవారం బెంగళూరులో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
శనివారం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ప్రకటించిన భారతరత్న పురస్కారాన్ని ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు.
ఈ ఏడాది బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూేర్, బీజేపీ సీనియర్ నాయకులు ఎల్.కె.అడ్వాణీ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ప్రధాని చౌదరీ చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు భారత ప్రభుత్వం భారతరత్న అవార్డులను ప్రకటించింది.
ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి హోం గ్రౌండ్స్‌లో జరిగే మ్యాచుల్లో అక్కడి జట్లే విజయం సాధిస్తున్నాయి. అలా ఓ ట్రెండ్ మొదలైంది.
శుక్రవారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లోనూ అదే కొనసాగుతుందని, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధిస్తుందని ఆ జట్టు అభిమానులు ఆశించారు. కానీ, ఆ ట్రెండ్‌కు కోల్‌కతా బ్రేక్ వేసింది.
బెంగళూరు నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని 19 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా అందుకుంది. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెంకటేశ్ అయ్యర్ 50 పరుగులు, సునీల్ నరైన్ 47 పరుగులు, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 39 పరుగులు చేశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 83 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కామెరాన్ గ్రీన్ 33 పరుగులు, మాక్స్‌వెల్ 28 పరుగులు రాబట్టారు.
నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి బెంగళూరు 182 పరుగులు చేసింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసంఈ లింక్ క్లిక్ చేయండి.