ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఈ రోజుకు ముగిస్తున్నాం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం..
గుడ్ నైట్.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయం గర్భగుడిలో భస్మ హారతి సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది.
బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఈ రోజుకు ముగిస్తున్నాం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం..
గుడ్ నైట్.
గాజాలో తక్షణ కాల్పుల విరమణ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించిందని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ ప్రకటించారు.
''గాజాపై సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న తీర్మానాన్ని భద్రతా మండలి ఆమోదించింది. తక్షణ కాల్పుల విరమణతో పాటు బందీలందరినీ వెంటనే షరతులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ తీర్మానాన్ని తప్పకుండా అమలు చేయాలి, అలా చేయకపోతే క్షమించబోం'' అని ఎక్స్ (ట్విటర్) లో తెలిపారు.
తీర్మానాన్ని ఎవరు ప్రతిపాదించారు?
అల్జీరియా, సియర్రా లియోన్, మొజాంబిక్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, స్లోవేనియా, గయానా, ఈక్వెడార్, మాల్టా, స్విట్జర్లాండ్ దేశాలు గాజాలో 'తక్షణ కాల్పుల విరమణ' తీర్మానం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టాయి.
ఈ తీర్మానానికి 15 దేశాలు సభ్యులు గల భద్రతా మండలిలో 14 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, అమెరికా ఓటింగ్‌కు దూరంగా ఉంది.
భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్య దేశాలు, పది తాత్కాలిక సభ్య దేశాలు సభ్యులుగా ఉంటాయి. చైనా, రష్యా, ఫ్రాన్స్, యూకే, అమెరికాలు శాశ్వత సభ్య దేశాలు.
కాల్పుల విరమణ తీర్మానాన్ని వీటో చేయకపోవడం అమెరికా తిరోగమన చర్య అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు.
ఇది గాజాలో హమాస్‌కు వ్యతిరేకంగా జరిగే యుద్ధం, బందీల విడుదల ప్రయత్నాలను దెబ్బతీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఐపీఎల్ 17వ సీజన్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు 21 మ్యాచ్‌ల తేదీలనే వెల్లడించిన బీసీసీఐ, సోమవారం మిగతా 53 మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటించింది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మే 21న క్వాలిఫైయర్ 1, మే 22న ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మే 24న క్వాలిఫైయర్-2, మే 26న ఫైనల్ జరగనుంది.
ఐపీఎల్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ ఇదే..
మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహాకాళేశ్యర ఆలయం లో జరిగిన అగ్నిప్రమాదంలో 13 మంది గాయపడ్డారు.
గర్భాలయంలో ఈ ఘటన జరిగింది. హోలీ సందర్భంగా ఆలయంలో భస్మ హారతి సమయంలో గులాల్ చల్లడంతో మంటలు రేగాయి.
గాయపడినవారిని జిల్లా ఆసుప్రతికి తరలించినట్టు ఉజ్జయిని జిల్లా కలెక్టర్ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు. ‘‘భస్మ హారతి సందర్భంగా మంటలు రేగాయి. ఈ ఘటనలో 13 మంది గాయపడ్డారు’’ అని చెప్పారు.
ఆలయంలో హోలీ సంబరాలు జరుపుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
‘‘మహాకాలేశ్వర ఆలయ ప్రాంగణంలో హోలీని సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్న వేళ గర్భాలయంలో గులాల్ చల్లడంతో మంటలు రేగాయి. ఆలయ పూజారి కూడా గాయపడ్డారు. బాధితులందరినీ ఆస్పత్రికి తరలించారు’’ అని పూజారి అనీష్ శర్మ చెప్పారు.
స్థానిక మీడియా కథనాలు కూడా గులాల్ కారణంగానే మంటలు రేగినట్టుగా చెప్పాయి.
గర్భాలయంలో ఓ దీపంపై గులాల్ పడటంతో మంటలు రేగాయి. దీంతో గర్భాలయమంతా మంటలు వ్యాపించాయి.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.