గాజాలో కాల్పుల విరమణపై ఐక్యరాజ్యసమితిలో వీగిన అమెరికా తీర్మానం

గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదలపై ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. రష్యా, చైనాలు వీటోను ఉపయోగించాయి.

లైవ్ కవరేజీ

  1. ఐపీఎల్: దిల్లీ కేపిటల్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం

    san curran

    ఫొటో సోర్స్, ani

    ఐపీఎల్-17లో శుక్రవారం దిల్లీ కేపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

    తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా పంజాబ్ జట్టు 19.2 ఓవర్లలోనే లక్ష్యం చేరుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయింది.

    దిల్లీ జట్టులో డేవిడ్ వార్నర్ 29, మిషెల్ మార్ష్ 20, హోప్ 33, రిషబ్ పంత్ 18 పరుగులు చేశారు.

    పంజాబ్ జట్టులో సామ్ కరన్ 63, శిఖర్ ధవన్ 22, ప్రభ్ సిమ్రన్ 26 పరుగులు చేశారు.

  2. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ ఎందుకు స్పందించింది? భారత్ ఏమని బదులిచ్చింది

  3. మాస్కో మ్యూజిక్ హాల్‌లో దాడి, 115 మంది మృతి.. యుక్రెయిన్, అమెరికా ఏమన్నాయి?

  4. దిల్లీ మద్యం కుంభకోణం కేసు: కవితకు ఈడీ కస్టడీ పొడిగింపు

    కవిత ఈడీ రిమాండ్ పొడిగింపు

    ఫొటో సోర్స్, Twitter/ANI

    దిల్లీ మద్యం విధానం కుంభకోణంతో ముడిపడిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 26 వరకు ఈడీ కస్టడీని పొడిగించిందని వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది.

    కోర్టు వద్ద కవిత మీడియాతో మాట్లాడుతూ.. తనది అక్రమ అరెస్టని, న్యాయపోరాటం చేస్తానని చెప్పారు.

    కవితను ఈ నెల 15న ఈడీ అరెస్టు చేసింది. అనంతరం కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఈ నెల 23 వరకు ఆమెను ఈడీ కస్టడీకి ఇచ్చారు.

    దిల్లీ మద్యం కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీలోని కొందరు నేతలకు రూ.100 కోట్ల ముడుపుల చెల్లింపుల వ్యవహారంలో కవితకు ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది.

    ఇదే కేసులో దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌‌ను మార్చి 21 రాత్రి ఈడీ అరెస్టు చేసింది.

  5. లద్దాఖ్: కేంద్రం ద్రోహం చేసిందంటూ గడ్డ కట్టే చలిలో వేల మంది రోడ్ల మీదకు ఎందుకు వచ్చారు?

  6. శ్రీకాకుళం: ఎలుగుబంటి దాడిలో ఇద్దరు మృతి

    అనకాపల్లిలో ఎలుగుబంటి దాడి

    ఫొటో సోర్స్, lakkojusrinivas

    శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

    గ్రామంలో తోట పనికి వెళ్లి వస్తున్న ముగ్గురిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో సీహెచ్ లోకనాథం, లైశెట్టి కుమార్‌ మృతి చెందగా, మహిళ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

    ఈ గ్రామం ఉద్దానం ప్రాంతంలో ఉంది. ఇక్కడ తరుచూ ఎలుగుబంట్లు గ్రామాల్లోకి రావడం, మనుషులపై దాడి చేయడం జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

  7. మహువా మొయిత్రా ఇంట్లో సీబీఐ సోదాలు

    మహువా మొయిత్రా

    ఫొటో సోర్స్, X/MAHUAMOITRA

    ఫొటో క్యాప్షన్, మహువా మొయిత్రా

    తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ మహువా మొయిత్రా ఇంట్లో సీబీఐ సోదాలు చేసింది.

    కోల్‌కతాలోని అలీపూర్‌లో ఉన్న మహువా ఫ్లాట్‌తోపాటు,ఇతర నగరాల్లో ఆమెకు సంబంధించిన చోట్ల సోదాలు చేస్తున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.

    మహువా డబ్బులు తీసుకొని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే గతంలో ఆరోపించారు. ఎథిక్స్ కమిటీ సూచనల మేరకు మూడు నెలల కిందట మహువాను లోక్‌సభ నుంచి స్పీకర్ బహిష్కరించారు.

    నిషికాంత్ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సీబీఐని లోక్‌పాల్ ఆదేశించింది. దీనిపై ఆరు నెలల్లోగా నివేదిక సమర్పించాలని కోరింది. అనంతరం మహువాపై సీబీఐ గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.

    ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మహువా, కృష్ణానగర్‌ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.

  8. ఈడీ ఎవరినైనా అరెస్టు చేయొచ్చా? అన్ని అధికారాలు ఎలా వచ్చాయి?

  9. గాజాలో కాల్పుల విరమణపై ఐక్యరాజ్యసమితిలో వీగిన అమెరికా తీర్మానం

    అమెరికా తీర్మానం

    ఫొటో సోర్స్, EPA-EFE

    గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. శాశ్వత సభ్యదేశాలైన రష్యా, చైనా వీటోను ఉపయోగించి, తీర్మానాన్ని వ్యతిరేకించాయి.

    మొత్తం 15 సభ్య దేశాలలో తీర్మానానికి 11 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. అల్జీరియా వ్యతిరేకించింది. గయానా గైర్హాజరైంది.

    తీర్మానంలోని పదజాలంపై రష్యా అభ్యంతరం వ్యక్తం చేసింది.

    గతంలో పలు దేశాలు గాజాలో కాల్పుల విరమణ కోసం తీర్మానం ప్రవేశపెట్టగా, ఇజ్రాయెల్‌కు మద్దతు పలుకుతూ దానిని అమెరికా వీటోతో వ్యతిరేకించింది.

    గాజాలో అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 30 వేల మందికి పైగా చనిపోయారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో గాజాలో ఇజ్రాయెల్ తన దాడుల తీవ్రతను తగ్గించాలని ఆశిస్తున్నట్లు అమెరికా చెబుతోంది.

    మరోవైపు కీలక మిత్రపక్షం (అమెరికా) మద్దతు లేకున్నా రఫాలో ప్రణాళికాబద్ధమైన గ్రౌండ్ అటాక్‌తో ముందుకు సాగుతామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు.

  10. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.