You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

జగ్గీ వాసుదేవ్: మెదడులో రక్తస్రావం.. ఎమర్జెన్సీ సర్జరీ నిర్వహించిన వైద్యులు

ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్‌‌కు దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగిందని వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.

    మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం..

    గుడ్ నైట్.

  2. నకిలీ పోలీసుగా చలామణి అయిన మాళవిక అసలు పోలీసులకు ఎలా దొరికిపోయారంటే...

  3. జగ్గీ వాసుదేవ్: మెదడులో రక్తస్రావం.. ఎమర్జెన్సీ సర్జరీ నిర్వహించిన వైద్యులు

    ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్‌‌కు దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగిందని వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది.

    జగ్గీ వాసుదేవ్‌ మెదడులో రక్తస్రావం అయిన కారణంగా అత్యవసర శస్త్ర చికిత్స చేయాల్సివచ్చిందని వెల్లడించింది.

  4. మహిళలకు సున్తీ: ఇప్పటి వరకు ఉన్న నిషేధాన్ని తొలగించడంపై గాంబియా మహిళలు ఏమంటున్నారు?

  5. ఆమె 58 ఏళ్ల వయసులో మళ్లీ తల్లయింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వివరణ కోరింది...చట్టం ఏం చెబుతోంది?

  6. టీఎంసీ నేత మహువా మొయిత్రాపై సీబీఐ విచారణకు లోక్‌పాల్ సిఫారసు

    లంచాలు తీసుకుని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగారనే కేసులో తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రాపై సీబీఐ కేసు నమోదు చేసి, విచారణ జరపాలని లోక్‌పాల్ పేర్కొంది.

    సీబీఐ ఈ కేసుపై విచారణ చేపట్టి, ఆరు నెలల్లోగా తమ నివేదికను సమర్పించాలని లోక్‌పాల్ సిఫారసు చేసింది.

    ‘‘రికార్డుల్లో అందుబాటులో ఉన్న సమాచారమంతా పరిగణనలోకి తీసుకుని, పరిశీలించిన తర్వాత, ఆమెకు వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి సందేహం లేదు. చాలావరకు బలమైన సాక్ష్యాలతో ఉన్నాయి. ఆమె పదవి పరంగా చూస్తే, ఇది చాలా తీవ్రమైన విషయం. మా అభిప్రాయం ప్రకారం, ఈ విషయంపై లోతుగా విచారణ చేపట్టి, నిజాన్ని రాబట్టడం అవసరం’’ అని లోక్‌పాల్ తన ఆర్డర్‌లో పేర్కొంది.

    మహువా మొయిత్రాపై వచ్చిన ఆరోపణలేంటి?

    తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మహువా మొయిత్రా లంచాలు తీసుకుని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడుగుతున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు.

    ఆసియాలోని ధనవంతుల్లో ఒకరైన గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ సంస్థలే లక్ష్యంగా ఎంపీ మొయిత్రా ప్రశ్నలు అడుగుతున్నారని, అందుకు ప్రతిఫలంగా ఒక వ్యాపారవేత్త నుంచి ఖరీదైన బహుమతులు, నగదు అందుకున్నారని ఆయన ఆరోపణలు చేశారు.

    ఈ విషయంలో గత సంవత్సరం డిసెంబర్‌లో మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించారు.

    మహువా మొయిత్రా 2010లో టీఎంసీలో చేరడానికి ముందు బ్యాంకర్‌గా పనిచేశారు.

  7. లోక్‌సభ తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

    లోక్‌సభ తొలి దశ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ తేదీలు, ఓటింగ్ సమయాలను ఎన్నికల సంఘం ప్రకటించింది.

    మంగళవారం అర్థరాత్రి ఈ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

    తొలి దశ ఎన్నికల్లో భాగంగా 21 రాష్ట్రాల్లోని 102 లోక్ సభ నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది.

    అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, రాజస్తాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్ అండ్ నికోబార్ ఐల్యాండ్స్, జమ్ము, కశ్మీర్, లక్ష్యద్వీప్, పుదుచ్చేరిలలో నామినేషన్లు స్వీకరించేందుకు చివరి తేదీ మార్చి 27 కాగా, నామినేషన్లు ఉపసంహరణకు మార్చి 30 వరకు సమయం ఉంది.

    బిహార్‌లో మాత్రం నామినేషన్లు స్వీకరించేందుకు చివరి తేదీ మార్చి 28గా నామినేషన్ల విత్‌డ్రాకు ఏప్రిల్ 2 వరకు సమయమిచ్చింది ఈసీ.

    అయితే, ఫలితాలు మాత్రం యథావిధిగా జూన్ 4న విడుదలవుతాయి.

    కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణపై నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది.

  8. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.