ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం..
గుడ్ నైట్.
వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్‌లు రెండూ వేర్వేరు పార్టీలు కాదని, ఒకటేనని విమర్శలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. చిలకలూరిపేటలోని బొప్పూడిలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ప్రజాగళం పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం..
గుడ్ నైట్.

ఫొటో సోర్స్, ANI
వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్‌లు రెండూ వేర్వేరు పార్టీలు కాదని, ఒకటేనని విమర్శలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడులో బీజేపీ, టీడీపీ, జనసేనల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు ప్రధాని మోదీ.
లోక్‌సభ ఎన్నికలను ప్రస్తావిస్తూ, కేంద్రంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల సహకారం అవసరమని అన్నారు.
ఈ ఎన్నికల్లో 400లకు పైగా స్థానాలను తమ కూటమి గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేసిన మోదీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ఇంకా ఏమన్నారంటే...

ఫొటో సోర్స్, ANI
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన కొత్త సమాచారాన్ని ఎన్నికల కమిషన్ తన వెబ్‌సైట్‌లో ఉంచింది.
ఈ డేటాలో ఎలక్టోరల్ బాండ్ కొనుగోలు చేసిన తేదీ, బ్యాంకు బ్రాంచి, డిపాజిట్ తేదీ వంటి సమాచారం ఉంది.
అయితే, ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అల్ఫాన్యూమరిక్ సంఖ్య (సీరియల్ నంబర్) మాత్రం పేర్కొనలేదు.
మార్చి 14న ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచింది ఎన్నికల సంఘం.
అందులో ఏ పార్టీ ఏ తేదీన ఎంతమొత్తం ఎన్‌క్యాష్ చేసుకుందో వివరాలు ఉన్నాయి. కానీ, ఎలక్టోరల్ బాండ్లకు కేటాయించిన సీరియల్ సంఖ్య మాత్రం పేర్కొనలేదు.
కొత్త సమాచారాన్ని అప్డేట్ చేసిన విషయమై ఎన్నికల కమిషన్ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి, వివరాలను బహిర్గతం చేసినట్లు తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రూ.6,060.51 కోట్ల విలువైన బాండ్లను ఎన్‌క్యాష్ చేసుకున్న బీజేపీ..
ఎలక్టోరల్ బాండ్లను ఎన్‌క్యాష్ చేసుకున్న రాజకీయ పార్టీల్లో బీజేపీ మొదటి స్థానంలో ఉండగా, తృణముల్ కాంగ్రెస్ రెండోస్థానంలో ఉంది.
బీజేపీ రూ. 6,060.51 కోట్లు, టీఎంసీ రూ.1,609.53 కోట్లు, కాంగ్రెస్ రూ.1421.86 కోట్ల విలువైన బాండ్లను ఎన్‌క్యాష్ చేసుకున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లో చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడికి రానున్నారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లతో కలిసి మోదీ అక్కడి బహిరంగ సభలో పాల్గొననున్నారు.
మోదీ పర్యటన నేపథ్యంలో సభా ప్రాంగణంలో 5 వేల మంది పోలీసులతో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు, జాగిలాలతో అణువణువు తనిఖీలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/KTR
బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్ రావులు ఆదివారంనాడు దిల్లీ చేరుకోనున్నారు . మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు ఈనెల 23 వరకు ఈడీ కస్టడీ విధిస్తూ దిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది.
మరోవైపు కవిత భర్త అనిల్‌కి కూడా విచారణ కోసం ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్, ప్రశాంత్ రెడ్డిలు దిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటు కవిత అరెస్టు తర్వాత తెలంగాణలో పలుచోట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేశాయి.
ఇదే సందర్భంలో బీఆర్ఎస్‌తో బీఎస్పీ పొత్తు రద్దు చేసుకుంది. బీఎస్పీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) పోరు తుది అంకానికి చేరింది.
నేడు దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. ఆర్సీబీ జట్టుకు స్మృతీ మంధాన, దిల్లీ జట్టుకు మెగ్ లానింగ్ కెప్టెన్లుగా ఉన్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ విశేషాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.