బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం
ఈనాటి బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. రేపు ఉదయం తాజా అప్డేట్స్‌తో లైవ్ పేజి మళ్ళీ మీ ముందుకు వస్తుంది.
అంతవరకూ సెలవు. ధన్యవాదాలు.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు దిల్లీ తరలించారు. ఈరోజు దిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఆమెను అధికారులు విచారించనున్నారు.
ఈనాటి బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. రేపు ఉదయం తాజా అప్డేట్స్‌తో లైవ్ పేజి మళ్ళీ మీ ముందుకు వస్తుంది.
అంతవరకూ సెలవు. ధన్యవాదాలు.
రానున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు అధికార వైసీపీ సమాయత్తమైంది. ఇప్పటికే పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులను ప్రకటించిన వైసీపీ, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను శనివారం ప్రకటించింది.ఇడుపులపాయలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో అభ్యర్థుల పేర్లను మంత్రి ధర్మాన ప్రసాదరావు చదివారు.రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాల్లో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అనకాపల్లి మినహా మిగిలిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్ధులను వైసీపీ ప్రకటించింది.
(ఈ కథనం అప్ డేట్ అవుతోంది)
దిల్లీ లిక్కర్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి స్థానిక రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో విచారణకు హాజరుకావాలని ఇప్పటికే ఎనిమిదిసార్లు కేజ్రీవాల్‌కి ఈడీ నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన విచారణకు హాజరుకాలేదు.
ఈ కేసులో కేజ్రీవాల్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు శనివారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ఆమె నివాసం వద్ద అరెస్టు చేశారు ఈడీ అధికారులు.
మనీలాండరింగ్ కేసులో ఆమెను అరెస్టు చేసిన ఈడీ అధికారులు దిల్లీ తరలించారు. ఈరోజు దిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితను అధికారులు విచారించనున్నారు.
దిల్లీ లిక్కర్ కేసులో ఆమెపై మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ విశేషాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింకును క్లిక్ చేయండి.