You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

సుప్రీంకోర్టు: లంచం తీసుకున్న పార్లమెంటు, శాసనసభల సభ్యులు విచారణ ఎదుర్కోవాల్సిందే

చట్టసభల్లో సభ్యులు లంచం తీసుకోవడం వల్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. కర్ణాటక: అసెంబ్లీలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు.. ముగ్గురు అరెస్ట్

    ఇమ్రాన్ ఖురేషిబెంగళూరు నుంచి, బీబీసీ కోసం,

    రాజ్యసభ ఎంపీగా కాంగ్రెస్ నేత నాసిర్ హుస్సేన్ ఎన్నికైన తరువాత పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారనే ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

    ‘‘ఫోరెన్సిక్ నివేదిక, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ఆధారంగా ఆ ముగ్గురిని అరెస్ట్ చేశాం. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని విధాన సౌధా పోలీసు స్టేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.

    అరెస్టయినవారిలో బెంగళూరు వాసి మునవర్, దిల్లీ వాసి ఇంతియాజ్, కర్ణాటకలోని హవేరికి చెందిన మహమ్మద్ షఫీ ఉన్నారు.

    ఫిబ్రవరి 27న ఈ వివాదం మొదలైంది. రాజ్యసభ సభ్యునిగా కాంగ్రెస్ అభ్యర్థి నాసిర్ హుస్సేన్ గెలిచిన తరువాత, ఆయన మద్దతుదారులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ శాననసభలో నినాదాలు చేశారనే ఆరోపణలు వచ్చాయి.

  3. ఇజ్రాయెల్-గాజా: పదేళ్ల నిరీక్షణ, మూడు ఐవీఎఫ్‌ ప్రయత్నాలతో పుట్టిన కవలల్ని పోగొట్టుకున్న తల్లి.. దాడిలో ఒకే కుటుంబంలోని 20 మంది మృతి

  4. రాధికా మర్చంట్: ముకేశ్ అంబానీ కోడలవుతున్న ఈ అమ్మాయి ఎవరు?

  5. లంచం తీసుకునే ఎంపీలు, ఎమ్మెల్యేలకు విచారణ నుంచి మినహాయింపు లేదన్న సుప్రీంకోర్టు తీర్పు ఏమిటి? 1998 నాటి పీవీ నరసింహారావు కేసుకు దీనికి సంబంధం ఏమిటి

  6. మహిళలపై లైంగిక దాడి చేసి చంపేసే సీరియల్ కిల్లర్ నుంచి తప్పించుకున్న ఏకైక మహిళ ఏమంటున్నారు? ఆ రోజు ఏం జరిగింది

  7. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే: ఆదిలాబాద్ సభలో మోదీ విమర్శలు

    కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలని, ఆ రెండూ ఒకటేనని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.

    ఆదిలాబాద్‌లో నిర్వహించిన ‘విజయ సంకల్ప సభ’లో ఆయన మాట్లాడారు. వికసిత భారత్ కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. దేశ అభివృద్ధి కోసం రూ.వేల కోట్ల పనులను చేపట్టినట్లు చెప్పారు.

    బీజేపీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోందని.. గత 15 రోజుల్లో రెండు ఐఐటీలు, ఓ ట్రిపుల్‌ ఐటీ, ఒక ఐఐఎం, ఎయిమ్స్‌ను ప్రారంభించామని మోదీ అన్నారు. తెలంగాణలోనూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మోదీ తెలిపారు.

    రాంజీ గోండు పేరుతో హైదరాబాద్‌లో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామని, దేశవ్యాప్తంగా ఏడు టెక్స్‌టైల్‌ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించామని.. సమ్మక్క సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీ, రైతుల కోసం పసుపు బోర్డును ఏర్పాటు చేశామని మోదీ చెప్పారు.

    కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ ఇప్పుడేం చేస్తోందని ఆయన ప్రశ్నించారు.

    కాగా అంతకుముందు ప్రధాని మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు.

    హైదరాబాద్ మెట్రో, మూసీ నదీ పరివాహక అభివృద్ధికి సహకరించాలని.. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కోరారు.

  8. గ్రీన్ సప్లిమెంట్లు: ఈ ‘సూపర్ పౌడర్లు’ ఆరోగ్యానికి మ్యాజిక్‌లా పని చేస్తాయా?

  9. నాలుగు లోక్‌సభ సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్

    తెలంగాణలో బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. తొలి విడత నాలుగు స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

    కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మాలోత్ కవిత పేర్లను కేసీఆర్ ప్రకటించారు.

  10. హిందూమతం- నా అభిమతం-5: ఆరెస్సెస్‌లో చేరడం నుంచి ముస్లింను పెళ్లి చేసుకోవడం వరకు రసికా అగాషే కథ

  11. స్టార్ డ్యూన్స్:ప్రతియేటా 50 సెం.మీ.లు కదులుతున్న ఈ ఇసుక తిన్నెల కథ ఏంటి?

  12. విశాఖపట్నం: ఖరీదైన కెమెరా కోసమే సాయి కుమార్‌ను చంపేశారా, నిందితులను సోషల్ మీడియా ఎలా పట్టించింది?

  13. షుగర్ ఉన్న పదార్ధాలు తినొద్దని ఒట్టు పెట్టుకున్నా పదే పదే ఎందుకు తినాలనిపిస్తుంది... ఎలా కంట్రోల్ చేసుకోవాలి?

  14. సుప్రీంకోర్టు: లంచం తీసుకున్న పార్లమెంటు, శాసనసభల సభ్యులు విచారణ ఎదుర్కోవాల్సిందే

    పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు చట్ట సభల్లో ప్రశ్నలు అడగడానికి లేదా ఓటు వేయడానికి డబ్బులు తీసుకుని పట్టుబడితే కచ్చితంగా విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది.

    1998లో పీవీ నరసింహారావు ఎంపీల కొనుగోలు కేసులో ఎంపీలు, ఎమ్మెల్యేలపై విచారణ జరక్కుండా ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు కొట్టివేసింది.

    చట్టసభల సభ్యులు ఓటు వేసేందుకు, ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నట్లు తేలినా రాజ్యాంగంలోని ఆర్టికల్ 105(2), 194(2) కింద వారిపై విచారణ జరిపేందుకు వీలు లేకుండా రక్షణ లభిస్తోంది.

    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుంద్రేష్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ పర్దీవాలా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పుని వెల్లడించింది.

    2012లో రాజ్యసభలో ఓటు వేసేందుకు జేఎంఎం సభ్యురాలు సీత సోరెన్ లంచం తీసుకున్నారన్న కేసులో వచ్చిన తీర్పుపై జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

    చట్టసభల్లో సభ్యులు లంచం తీసుకోవడం వల్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.

  15. నిక్కీ హేలీ: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం రేసులో ట్రంప్ పై తొలి విజయం

    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ తొలి విజయం సాధించారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన అభ్యర్థిత్వం రేసులో ఆమెను విజయం వరించింది.

    వరస విజయాలతో ముందున్న డోనల్డ్ ట్రంప్ విజయ పరంపరను నిక్కీ హేలీ గెలుపు అడ్డుకుంది. కానీ, ఈ వారం ఓటింగ్‌లో డోనల్డ్ ట్రంప్ చాలా మంది మద్దతుదారులను సంపాదించుకోనున్నారు.

    నిక్కీ హేలీ అంతకుముందు జరిగిన పలు ప్రైమరీల్లో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ, తాను రేసులో ఉన్నట్లు చెప్పారు. అయినా పోటీ నుంచి తప్పుకునేందుకు నిక్కీ హేలీ నిరాకరించారు.

    గత వారం నిక్కీ హేలీ తన సొంత రాష్ట్రమైన సౌత్ కరోలినాలో ఓడిపోయారు. కానీ, ట్రంప్‌కు తానే ప్రత్యామ్నాయమని ఓటర్లకు చెప్పారు హేలీ. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో డోనాల్డ్ ట్రంప్ ముందున్నారు.

  16. తెలంగాణ: రెండు రోజుల పాటు ప్రధాని మోదీ పర్యటన

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణకు రానున్నారు. రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు.

    ఈ రోజు ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు ఆదిలాబాద్‌లోని పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్‌ల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో మోదీ పాల్గొంటారు. 11.15 గంటల నుండి 12 గంటల వరకు పబ్లిక్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు.

    ఆదిలాబాద్‌లో రూ.56 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారని పీఐబీ ఇండియా ట్వీట్ చేసింది. సంగారెడ్డిలో రూ.6,800 కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని తెలిపింది. హైదరాబాద్‌లోని సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌ను జాతికి అంకితం చేయనున్నారు.

    మధ్యాహ్నం తమిళనాడు వెళ్లి.. తిరిగి రాత్రికి హైదరాబాద్‌ చేరుకుంటారు.

    5వ తేదీన మోదీ సంగారెడ్డిలో పర్యటిస్తారు. వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తెలంగాణ పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఒడిశాకు వెళ్తారు.

  17. బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం

    నమస్తే.

    తాజా వార్తలను ఎప్పటికప్పుడు మీకందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.