జమ్ముకశ్మీర్: కొండచరియలు విరిగిపడటంతో తల్లి, ముగ్గురు పిల్లలు మృతి

జమ్ముకశ్మీర్‌లోని మహోర్ సబ్‌డివిజన్‌లోని చసానా గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రాంతంలో గత 24 గంటల్లో భారీ నుంచి ఓ మోతాదు వర్షాపాతం నమోదైంది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. ఓర్కా: షార్క్‌లను చంపి కాలేయం తింటున్న తిమింగలాలు.. కారణమేంటి

  3. భారత నౌకాదళ సిబ్బందిలోని సీమ్యాన్ మిస్సింగ్

    సాహిల్ వర్మ

    ఫొటో సోర్స్, INDIAN NAVY

    ఫొటో క్యాప్షన్, సాహిల్ వర్మ (ఫైల్)

    భారత నౌకా దళానికి చెందిన సాహిల్ వర్మ ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి కనిపించడం లేదు. ఆయన ఆచూకీ కోసం భారత నేవీ ఎయిర్ క్రాఫ్ట్, నౌకలతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.

    "ఫిబ్రవరి 27 నుంచి సాహిల్ వర్మ (సీమ్యాన్-2) కనిపించకుండా పోవడం దురదృష్టకరం. ఆయన భారత నేవీ షిప్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు" అని భారత నేవీకి చెందిన వెస్ట్రన్ కమాండ్ పేర్కొంది.

    సాహిల్ వర్మ ఆచూకీ తెలుసుకునేందుకు అత్యున్నత స్థాయి బోర్డును ఏర్పాటు చేసినట్లు వెస్ట్రన్ కమాండ్ తెలిపింది. ఘటనపై విచారణకు బోర్డును ఆదేశించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. ఝార్ఖండ్: భర్తని కొట్టి స్పానిష్ టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం.. పోలీసులు ఏం చెప్తున్నారు

  5. కీరన్ పొలార్డ్: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు వెస్టిండీస్ క్రికెటర్‌ రావడంపై పాకిస్తాన్ అభిమానుల విమర్శలు ఎందుకు?

  6. పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నిక

    షెహబాజ్ షరీఫ్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, షెహబాజ్ షరీఫ్

    పాకిస్తాన్ 24వ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు.

    336 మంది సభ్యులు గల పాక్ జాతీయ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో పీఎంఎల్-ఎన్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీల మద్దతు అభ్యర్థి షెహబాజ్‌కు 201 ఓట్లు వచ్చాయి.

    ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థి ఒమర్ అయూబ్‌కు 92 ఓట్లు వచ్చాయి.

    పాకిస్తాన్‌లో ఇటీవల జరిగిన ఎన్నికలలో ఏ పార్టీ స్పష్టమైన మెజారిటీని సాధించలేకపోయింది. పీటీఐ మద్దతు గల స్వతంత్ర అభ్యర్థులు తొంభైకి పైగా సీట్లు గెలుచుకున్నారు.

    75 సీట్లతో పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ రెండో స్థానంలో నిలిచింది. బిలావల్ భుట్టో నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 54 స్థానాలతో మూడో స్థానంలో నిలవగా, ఎంక్యూఎం పాకిస్థాన్‌కు 17 సీట్లు వచ్చాయి.

    దీంతో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పీఎంఎల్-ఎన్‌లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

    పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడే షెహబాజ్ షరీఫ్.

  7. జీఎస్టీలో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏమిటి? ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడి కేసులో ప్రధాన అభియోగం ఐటీసీ అక్రమాలేనా

  8. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల డిజైన్, నిర్మాణాల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు

    అన్నారం బ్యారేజ్

    ఫొటో సోర్స్, I&PR TELANGANA

    కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల అధ్యయనాన్ని చేపట్టేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌తో పాటు ఐదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

    కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ జే. చంద్రశేఖర్ అయ్యర్ ఈ కమిటీకి చైర్మన్‌గా ఉండనున్నారు.

    కమిటీలో యు.సి. విద్యార్థి, ఆర్. పాటిల్, శివ కుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్, అమితాబ్ మీనాలు సభ్యులుగా ఉన్నారు.

    నాలుగు నెలల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ కమిటీ తన నివేదికను సమర్పించనుంది.

    మూడు బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల తీరును, డ్యామేజీకి గల కారణాలను పూర్తి స్థాయిలో కమిటీ పరిశీలించనుంది.

  9. భారత్-థాయిలాండ్‌ దేశాల మధ్య బియ్యం ఎగుమతుల వివాదం ఏంటి?

  10. జమ్ముకశ్మీర్‌: కొండచరియలు విరిగిపడటంతో తల్లి, ముగ్గురు పిల్లలు మృతి

    విరిగిపడ్డ కొండచరియలు

    ఫొటో సోర్స్, ANI

    జమ్ముకశ్మీర్‌లోని మహోర్ సబ్‌డివిజన్‌లోని చసానా గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి.

    దీంతో, ఇంట్లో నిద్రిస్తున్న 2 నెలల చిన్నారి సహా ముగ్గురు పిల్లలు, తల్లి చనిపోయారు.

    వీరి ఇంటికి సమీపంలోనే ఉదయం పూట కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వారి ఇల్లు కూడా ధ్వంసమైంది.

    ఈ ప్రాంతంలో గత 24 గంటల్లో భారీ నుంచి ఓ మోతాదు వర్షపాతం నమోదైందని రియాసీ డిప్యూటీ కమీషనర్ విశేష్ పౌల్ మహాజన్ చెప్పారు.

    జమ్ము కశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం లేదా మంచు వర్షం కురిసే అవకాశముందని ఐఎండీ అంచనావేసింది.

    మరోవైపు దేశ రాజధాని దిల్లీలో కూడా ఇవాళ ఉదయం వర్షం పడింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం

    నమస్తే.

    తాజా వార్తలను ఎప్పటికప్పుడు మీకందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.