రాజ్‌కోట్ టెస్ట్: తల్లి అనారోగ్యం వల్ల టెస్ట్ నుంచి మధ్యలో వైదొలగిన భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్

అశ్విన్ తప్పుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం కాగా, అతని తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడమే కారణమని బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ శుక్లా ట్వీట్‌ చేశారు.

లైవ్ కవరేజీ

  1. ఎజియావో: మనుషుల యవ్వనం కోసం గాడిదలను చంపేస్తున్నారు

  2. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.

    మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.

    గుడ్ నైట్.

  3. ఆదిమ మానవులలో నరమాంసం తినే అలవాటు ఎందుకు ఉండేది?

  4. తమిళనాడు: బాణసంచా తయారీకేంద్రంలో పేలుడు.. 10 మంది మృతి

    తమిళనాడులోని శివకాశి సమీపంలో ఓ బాణసంచా తయారీకేంద్రంలో జరిగిన పేలుడులో 10 మంది మరణించారు.

    తమిళనాడులోని శివకాశి సమీపంలో ఓ బాణసంచా తయారీకేంద్రంలో జరిగిన పేలుడులో 10 మంది మరణించారు.

    శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ భారీ పేలుడులో 10 మంది ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

    చనిపోయినవారిలో నలుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు.

    గాయపడినవారు శివకాశి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నరు.

  5. కృష్ణా జలాల వివాదం: సాగర్, శ్రీశైలం కేఆర్ఎంబీకి ఇవ్వకూడదని తెలంగాణ చేసిన తీర్మానంతో ఏం జరగనుంది.. తెలంగాణకు లాభమా, నష్టమా?

  6. కక్ష్యలోకి ఇన్సాట్ -3 డీఎస్ ఉపగ్రహం.. జీఎస్ఎల్‌వీ-ఎఫ్14 ప్రయోగం విజయవంతం

    జీఎస్ఎల్‌వీ-ఎఫ్14

    ఫొటో సోర్స్, ANI

    శ్రీహరికోట నుంచి ఇన్సాట్ -3 డీఎస్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్‌వీ-ఎఫ్14 వాహక నౌక విజయవంతంగా మోసుకెళ్లింది.

    శనివారం సాయంత్రం 5.35 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్‌వీ-ఎఫ్14 వాహక నౌక ఇన్సాట్ -3 డీఎస్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

    భూ, సముద్ర ఉపరితలాలపై వాతావరణ పరమైన మార్పులను పరిశీలించే లక్ష్యంతో ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. భారత్ వర్సెస్ ఇంగ్లాండ్: మూడో టెస్టు మ్యాచ్.. సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్

    యశస్వి జైస్వాల్

    ఫొటో సోర్స్, Getty Images

    రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడవ టెస్టు మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ సెంచరీ చేశాడు.

    వరుసగా బౌండరీలతో 122 బంతుల్లో 100 పరుగులను సాధించాడు. 9 ఫోర్లను, 5 సిక్సులను జైస్వాల్ కొట్టాడు.

    విశాఖపట్నంలో ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు ఆడిన సందర్భంగా జైస్వాల్ డబుల్ సెంచరీ చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో 209 పరుగులు సాధించాడు.

    జైస్వాల్ కెరీర్‌లో మూడవ సెంచరీ ఇన్నింగ్స్ ఇది.

    ఈ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 80 పరుగులు మాత్రమే చేశాడు.

    యశస్వి జైస్వాల్ గత ఏడాది వెస్ట్ ఇండీస్ పర్యటనలో సందర్భంగా తొలి టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు తొలిసారి సెంచరీ చేశాడు. ఆరు టెస్టు మ్యాచ్‌లలో మూడు సార్లు సెంచరీలు చేశాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. దెయ్యాలు వచ్చి వింత వింత ముగ్గులు వేస్తున్నాయని జనం హడలిపోతున్న ఆ ఊరిలో అసలేం జరుగుతోంది?

  9. గుల్‌బదన్: ఒట్టోమాన్ సుల్తాన్‌ను ఎదిరించిన మొఘల్ యువరాణి కథ...

  10. రాజ్‌కోట్ టెస్ట్: తల్లి అనారోగ్యం వల్ల టెస్ట్ నుంచి మధ్యలో వైదొలగిన భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్

    రవిచంద్రన్ అశ్విన్

    ఫొటో సోర్స్, Getty Images

    ఇంగ్లండ్‌తో జరుగుతున్న రాజ్‌కోట్ టెస్టు నుంచి స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వైదొలిగాడు. కుటుంబంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

    బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ శుక్లా చేసిన ట్వీట్‌తో, అశ్విన్ తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. ఆమె త్వరగా కోలుకోవాలని రాజీవ్ శుక్లా ఆకాంక్షించారు.

    ‘‘ఈ కఠినమైన పరిస్థితిలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి, అందులోని సభ్యులు, సిబ్బంది నుంచి అశ్విన్‌కు ఆయన కుటుంబానికి సంపూర్ణ మద్ధతు ఉంటుంది’’అని బీసీసీఐ ట్వీట్ చేసింది.

    రవిచంద్రన్ కావలసిన ఏ సహకారానికైనా సిద్ధంగా ఉన్నామని బీసీసీఐ పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.