You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

భారత్ బంద్‌కు రైతు సంఘాల పిలుపు, దిల్లీ సహా రాష్ట్రాల్లో భద్రత కట్టుదిట్టం

రైతుల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ యునైటెడ్ కిసాన్ మోర్చా సహా అనేక రైతు సంఘాలు శుక్రవారం గ్రామీణ భారత్ బంద్‌‌కు పిలుపునిచ్చాయి. దేశంలోని కొన్ని కార్మిక సంఘాలు కూడా ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి.

లైవ్ కవరేజీ

  1. తాజ్ మహల్ కంటే ముందే, ప్రియురాలి కోసం చోళరాజు నిర్మించిన ‘ప్రేమ చిహ్నం’ కథ తెలుసా?

  2. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.

    మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.

    గుడ్ నైట్.

  3. భారత్ వర్సెస్ ఇంగ్లండ్: టెస్టుల్లో 500 వికెట్లు తీసిన రెండో భారత్ బౌలర్‌గా అశ్విన్ రికార్డు

    రాజ్‌కోట్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డు సృష్టించాడు.

    ఇంగ్లండ్ బ్యాటర్ జాక్ క్రాలీని అవుట్ చేసి, అశ్విన్ టెస్టు క్రికెట్లో 500 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు.

    ఇప్పటికే మాజీ కెప్టెన్, స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించాడు.

    147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా కేవలం 8 మంది బౌలర్లు మాత్రమే 500 వికెట్ల రికార్డును అందుకోగలిగారు.

    అశ్విన్ 99 టెస్టుల్లో 25,714 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు.

  4. పుతిన్ బద్ధ వ్యతిరేకి అయిన అలెక్సీ నావల్నీ అప్పట్లో ‘పాయిజన్ అటాక్’ నుంచి ప్రాణాలతో ఎలా బయటపడ్డారు?

  5. చరిత్రలో తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోతున్న టీడీపీ.. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?

  6. రష్యా: పుతిన్ విమర్శకుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ జైల్లో మృతి.. ప్రభుత్వం ఏం చెప్పింది?

  7. మాంసం బియ్యం: ఈ హైబ్రిడ్ బియ్యం తింటే, మాంసం తిన్నట్లే...

  8. నరేంద్ర మోదీ 'బ్రాండ్ మోదీ'గా ఎలా మారారు?

    ప్రధాని నరేంద్ర మోదీ అంటే ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం. కొందరికి మోదీ భారతదేశంలోని అత్యంత శక్తిమంతుడు, మరికొందరికి నిరంకుశుడు.

    పూర్తి వీడియో చూడండి.

  9. ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రామీణ భారత్ బంద్‌' నిరసనలు

    కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రైతు, కార్మిక సంఘాల పిలుపుతో గ్రామీణ భారత్ బంద్ జరుగుతోంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కార్మిక సంఘాల పిలుపుతో కొన్నిచోట్ల పారిశ్రామిక సంస్థల్లోనూ కార్మికులు విధులు బహిష్కరించారు.

    ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు.

    కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా రైతాంగం, కార్మికులకు అపార నష్టం జరుగుతుందంటూ ఆంధ్రప్రదేశ్ కిసాన్ సంయుక్త సంఘర్ష్ సమితి ప్రతినిధి, మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వర్ రావు విమర్శించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

    దిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి అందరూ మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. ప్రభుత్వం స్పందించే వరకూ నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు.

  10. సర్ఫరాజ్ ఖాన్ : రనౌట్‌పై ఆయన ఏమన్నారంటే..

    ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ కావడంపై చర్చ జరుగుతోంది.

    మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ, అతను ఔట్ అయిన విధానం, దానిపై రోహిత్ శర్మ స్పందన గురించి చర్చ నడుస్తోంది.

    సర్ఫరాజ్ ఖాన్ గురువారం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు.

    రవీంద్ర జడేజా పశ్చాత్తాపం వ్యక్తం చేసినప్పటికీ, అతని వల్లే సర్ఫరాజ్ రనౌట్‌‌ అయ్యాడంటూ జడేజాపై విమర్శలు చేస్తున్నారు.

    ఈ వ్యవహారం గురించి అడిగిన ప్రశ్నకు సర్ఫరాజ్ ఖాన్ గట్టిగానే బదులిచ్చారు.

    ''కొద్దిగా మిస్‌కమ్యూనికేషన్ జరిగింది. అయినా, ఇది ఆటలో భాగం. కొన్నిసార్లు రన్స్ వస్తాయి. కొన్నిసార్లు రావు. ఆటలో ఇలాంటివి సహజం'' అన్నారు.

    సర్ఫరాజ్ ఖాన్ తన టెస్టు కెరీర్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 66 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 62 పరుగులు చేశాడు.

    ''చాలా బావుంది. తొలిసారి ఆడుతున్నా. క్యాప్ తీసుకున్నా. మా నాన్న కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన ఆరేళ్లు నాకు క్రికెట్ నేర్పించారు. నేను ఒక్కసారైనా భారత జట్టుకు ఆడాలనేది ఆయన కల" అని తొలిరోజు ఆట అనంతరం సర్ఫరాజ్ ఖాన్ అన్నారు.

  11. భారత్ బంద్‌కు రైతు సంఘాల పిలుపు, దిల్లీ సహా రాష్ట్రాల్లో భద్రత కట్టుదిట్టం

    రైతుల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ యునైటెడ్ కిసాన్ మోర్చా సహా అనేక రైతు సంఘాలు శుక్రవారం గ్రామీణ భారత్ బంద్‌‌కు పిలుపునిచ్చాయి.

    రైతు సంఘాల గ్రామీణ భారత్ బంద్ పిలుపు మేరకు ఈ బంద్ నిర్వహిస్తున్నారు.

    దేశంలోని కొన్ని కార్మిక సంఘాలు కూడా ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి.

    తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ దేశ రాజధాని దిల్లీ వైపు బయలుదేరిన పంజాబ్ రైతులను హరియాణాలోని అంబాలా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిని అడ్డుకునేందుకు భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు.

    భారత్ బంద్ నేపథ్యంలో, దిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆందోళనకారులు దిల్లీలోకి ప్రవేశించకుండా పూర్తి ఏర్పాట్లు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.

    భారత్ బంద్‌ పాటించాలని యునైటెడ్ కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) కూడా విజ్ఞప్తి చేసింది.

  12. తిరుపతి: ఎస్వీ జూ పార్క్‌లో సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకిన వ్యక్తి మృతి

  13. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.