You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కాళేశ్వరం ప్రాజెక్ట్: మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మేడిగడ్డలో పర్యటించారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.

    మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.

    గుడ్ నైట్.

  2. ఇంటింటికీ వెళ్లి 45 మంది పౌరులను కాల్చి చంపిన ఇథియోపియా బలగాలు.. మృతుల్లో ఒకరు గర్భవతి

  3. ఇతర పక్షుల ఆహారాన్ని కొట్టేసే స్కువాల సంఖ్య ఎందుకు తగ్గిపోయింది?

  4. మేడిగడ్డలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి

    కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మేడిగడ్డలో పర్యటించారు.

    కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బరాజ్‌లో పిల్లర్లు కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి ప్రాజెక్టు ఎడమ వైపున కాఫర్ డ్యామ్ వద్దకు చేరుకుని పిల్లర్లలో పగిలిన 7వ బ్లాక్ ప్రాంతాన్ని సందర్శించారు.

    అనంతరం మేడిగడ్డ వద్ద మంత్రుల బృందం, ఎమ్మెల్యేలతో కలిసి నీటిపారుదల చీఫ్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    ప్రాజెక్ట్ నిర్మాణానికి అంచనా వ్యయం, నిర్మాణానికి అయిన ఖర్చు, విద్యుత్ బిల్లు, నిర్వహణ ఖర్చులు, ఎన్ని ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తున్నారు, భవిష్యత్ కార్యాచరణ వంటి విషయాలను చీఫ్ ఇంజినీర్ ఇచ్చిన పీపీటీ ద్వారా రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు.

  5. కంటి శుక్లాలను ఎలా గుర్తించాలి... ఆపరేషన్‌కు ముందు, తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

  6. లాటరీ తగిలినట్లు ఈ దేశం ఒక్కసారిగా సంపన్న దేశంగా ఎలా మారింది?

  7. దిల్లీ చలో: కేంద్రంతో రైతుల చర్చలు ఎందుకు విఫలమయ్యాయి?

  8. 'నా పుట్టినరోజున మా అమ్మను నాన్న చంపేశాడు, అదంతా టిక్‌టాక్‌ వీడియోలో ఎందుకు చెప్పానంటే...'

  9. రైతులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

    దిల్లీ వైపు వస్తున్న రైతుల గుంపును చెదరగొట్టేందుకు పంజాబ్, హరియాణా మధ్య శంభు బోర్డర్‌కు కొన్ని కిలోమీటర్ల ముందు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.

    అంబాలా సమీపంలో ఈ ప్రాంతం ఉంటుంది.

    పంటలకు కనీస మద్దతు ధర హామీతో పాటు, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ, నిరసనగా రైతులు దిల్లీకి బయలుదేరారు.

    దిల్లీలోకి రాకుండా రైతులను నిలువరించేందుకు సరిహద్దుల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బారికేడ్లు, ముళ్ల తీగలు ఏర్పాటు చేశారు.

    అక్కడే ఉన్న బీబీసీ ప్రతినిధి అభినవ్ గోయల్ తెలిపిన వివరాల ప్రకారం, పంజాబ్ రైతులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు, ట్రాలీలతో శంభు సరిహద్దు వైపు వచ్చారు.

  10. లాభాల మోత మోగుతున్నా టెక్ కంపెనీలు జాబ్ కోతలకు ఎందుకు దిగుతున్నాయి?

  11. రైతులు దిల్లీకి రాకుండా బారికేడ్లు, మేకులు..

    రైతులు 'చలో దిల్లీ' నిరసనలకు పిలుపునివ్వడంతో దిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

    దిల్లీ సరిహద్దుల్లో రోడ్లపై పోలీసులు భారీగా బారికేడ్లను పెట్టారు. ముళ్ల కంచెలు వేశారు. అనేక ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. కొన్ని రోడ్లను మూసివేశారు.

  12. అప్పుడు గంగానది శవాలతో ఉప్పొంగింది... మరణమృదంగం మోగించిన 1918 నాటి ఫ్లూ మహమ్మారి

  13. అరబ్ ఎమిరేట్స్‌లో హిందూ ఆలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

    భారత ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ పర్యటన ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని గల్ఫ్ దేశ రాయబారి తెలిపారు.

    రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ యూఏఈ వెళ్లారు. ఫిబ్రవరి 13, 14 తేదీల్లో ఆయన యూఏఈలో పర్యటిస్తున్నారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో భేటీ అవుతారు.

    ఫిబ్రవరి 14న అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.

    అబుదాబిలో దాదాపు 27 ఎకరాల్లో స్వామి నారాయణ్ ఆలయాన్ని నిర్మించారు. అబుదాబిలో ఇదే మొదటి హిందూ ఆలయం.

    2015 తర్వాత ప్రధాని యూఏఈలో పర్యటించడం ఇది ఏడోసారి.

  14. రైతుల నిరసన పిలుపుతో దిల్లీలో భద్రత కట్టుదిట్టం, రహదారుల మూసివేత

    పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రైతుల 'చలో దిల్లీ' నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అనేక ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు.

    యూపీ వైపు నుంచి దిల్లీ వచ్చే ఘాజీపూర్ బోర్డర్, సోనిపట్, పానిపట్, కర్నాల్, బహదూర్‌గఢ్, రోహ్‌తక్‌లకు వెళ్లే అనేక రహదారులను మూసివేసినట్లు దిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

    దిల్లీ నుంచి ఘాజీపూర్ మీదుగా ఘజియాబాద్‌ వెళ్లేందుకు, అక్షరధామ్ లేదా పట్పర్‌గంజ్/మదర్ డైరీ రోడ్డు లేదా చౌదరి చరణ్ సింగ్ మార్గ్‌లో ఐఎస్‌బీటీ ఆనంద్ విహార్ మీదుగా పుష్తా రోడ్‌లో వెళ్లి మహారాజ్‌పూర్ లేదా అప్సర వైపు నుంచి వెళ్లాలని దిల్లీ పోలీసులు తెలిపారు.

    అంతేకాకుండా, ఎన్‌హెచ్ -44 మీదుగా హరియాణా వెళ్లే రహదారిలోనూ కొన్ని డైవర్షన్లు చేశారు.

    నెల రోజుల పాటు దిల్లీలో రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని దిల్లీ పోలీసులు అంతకుముందు విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.

    కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్, అర్జున్ ముండా రైతులతో అర్థరాత్రి వరకూ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో తమ నిరసన కొనసాగుతుందని రైతులు ప్రకటించారు.

    మూడు రాష్ట్రాల రైతులు మంగళవారం అంటే, ఇవాళ ఉదయం 10 గంటలకు దిల్లీ వైపు వెళ్లనున్నారు.

    పోలీసులు ఏమంటున్నారు?

    ఫిబ్రవరి 13న యునైటెడ్ కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చాతో పాటు మరికొన్ని రైతు సంఘాలు చలో దిల్లీ పిలుపునిచ్చాయి. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ పార్లమెంట్ ఎదుట నిరసనకు సిద్ధమయ్యాయి.

    రైతుల నిరసనల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశంతో పాటు హింస చెలరేగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దిల్లీ పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

    ఆందోళనకారులు ట్రాక్టర్ ట్రాలీలతో వస్తే ఇతరులకు అసౌకర్యం కలిగే అవకాశం ఉందని, అందువల్ల న్యూదిల్లీ పరిధిలో ట్రాక్టర్ రాకపోకలను నిషేధించినట్లు తెలిపారు.

  15. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.