ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పంజాబ్ గవర్నర్, చంఢీగఢ్ అడ్మినిస్ట్రేటర్ పదవులకు భన్వరీలాల్ పురోహిత్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో వైదొలుగుతున్నట్లు ఆయన శనివారం ప్రకటించారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
విశాఖ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (13), యశస్వీ జైస్వాల్ (15)లు క్రీజులో ఉన్నారు.
అంతకుముందు భారత బౌలర్లు రాణించడంతో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ చేసిన 76 పరుగులే అత్యధిక స్కోరు. కెప్టెన్ బెన్ స్టోక్స్ 46 పరుగులు సాధించాడు.
భారత జట్టు మొదటి ఇన్సింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ 209 పరుగులు చేశాడు. ప్రస్తుతం టీమిండియా 171 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది.
పంజాబ్ గవర్నర్, చంఢీగఢ్ అడ్మినిస్ట్రేటర్ పదవులకు భన్వరీలాల్ పురోహిత్ రాజీనామా చేశారు.
వ్యక్తిగత కారణాలతో వైదొలుగుతున్నట్లు ఆయన శనివారం ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా పత్రాన్ని అందజేశారు.
బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీకి భారతరత్న పురస్కారం ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయం ట్విటర్ వేదికగా ప్రకటించారు.
‘అడ్వాణీని భారతరత్న పురస్కారంతో గౌరవిస్తున్నాం. ఈ తరంలోని అత్యంత గొప్ప రాజనీతిజ్ఞులలో అడ్వాణీ ఒకరు’ అని మోదీ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
‘ఈ దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ఆయన క్షేత్ర స్థాయి నుంచి జీవితం ప్రారంభించి దేశ ఉప ప్రధాని పదవి వరకు సేవలు అందించారు. ఆయనతో ఫోన్‌లో మాట్లాడి అభినందనలు తెలియజేశాను’ అని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఇండియన్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేశాడు.
విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో యశస్వి ఏడు సిక్సర్లు, 18 బౌండరీలతో చెలరేగిన యశస్వి 277 బాల్స్‌లో డబుల్ సెంచరీ పూర్తి చేశారు.
ఒక సిక్సర్, మరో ఫోర్ కొట్టి డబుల్ సెంచరీ క్లబ్‌లో చేరాడు. అనంతరం 209 పరుగుల వద్ద అవుటయ్యాడు.
ఇదే అతని కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ.
అతిచిన్న వయసులో డబుల్ సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడిగా యశస్వి నిలిచాడు.
అంతకుముందు సునీల్ గవాస్కర్, వినోద్ కాంబ్లీ ఈ రికార్డ్ సాధించారు.
ఓవర్‌నైట్ 336/6 స్కోరుతో భారత్ మొదటి ఇన్నింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 383 పరుగులు చేసింది.
సిరియా, ఇరాక్‌లోని ఏడు ఇరాన్ సంబంధిత స్థావరాలపై అమెరికా దాదాపు 30 నిమిషాల పాటు వైమానిక దాడులు చేసింది.
అమెరికా నుంచి బయలుదేరిన లాంగ్ రేంజ్ సూపర్‌సోనిక్ బీ-1 బాంబర్లతో ఈ దాడులు చేశారు.
సిరియా, ఇరాక్‌లలోని ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC)కి చెందిన క్వాడ్స్ ఫోర్స్ స్థావరాలతో పాటు తిరుగుబాటు గ్రూపుల స్థావరాలపై అమెరికా ఈ దాడులు చేసింది.
అమెరికన్ బాంబర్లు అరగంటలో సిరియాలోని నాలుగు, ఇరాక్‌లోని మూడు స్థావరాలపై 85కి పైగా బాంబు దాడులు చేశారు.
ఈ స్థావరాల్లో కమాండ్ కంట్రోల్ కార్యకలాపాలు, లాజిస్టిక్స్ హబ్‌లు, డ్రోన్ స్టోరేజ్ యూనిట్లు ఉన్నాయని చెబుతున్నారు.
ఈశాన్య జోర్డాన్‌లోని అమెరికన్ సైనిక స్థావరంపై జనవరి 28న డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు అమెరికన్ సైనికులు మరణించారు. ఇది ఇరాన్‌తో సంబంధమున్న తీవ్రవాద గ్రూపుల పనేనని అమెరికా తెలిపింది. ఈ దాడికి అమెరికా ప్రతిదాడి చేసింది.
అమెరికన్ సైనిక స్థావరంపై దాడి తర్వాత అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ''ఎవరైనా అమెరికన్ పౌరుడికి హాని చేస్తే, తప్పకుండా వారికి తగిన విధంగా సమాధానం ఇస్తాం'' అన్నారు.
విశాఖపట్నంలో నివాసం ఉంటున్న విజయనగరం జిల్లా బొండపల్లి తహసీల్దార్ సనపల రమణయ్య హత్యకు గురయ్యారు.
ఓ వ్యక్తి ఇనుప రాడ్డుతో బలంగా తలపైన కొట్టడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
అనంతరం ఆయనను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు.
తహసీల్దార్ రమణయ్య నివాసముంటున్న అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో ఈ ఘటన జరిగింది.
తహసీల్దార్‌తో ఒక వ్యక్తి గొడవపడుతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పీఎం పాలెం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం...
సనపల రమణయ్య విజయనగరం జిల్లా బొండపల్లిలో తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
రెండు రోజుల కిందటే ఆయనకు విశాఖలోని చినగదిలి నుంచి బొండపల్లికి బదిలీ అయ్యింది.
శుక్రవారం బొండపల్లిలో విధులు ముగించుకుని తాను నివాసముంటున్న కొమ్మదిలోని అపార్ట్‌మెంట్‌కు రాత్రి 8.30 గంటలకు చేరుకున్నారు.
రాత్రి సుమారు 10:15 గంటల సమయంలో ఫోన్ రావడంతో ఫ్లాట్ నుంచి కిందకు వచ్చారు.
అక్కడ ఓ వ్యక్తితో పది నిమిషాల పాటు సీరియస్‌గా సంభాషణ జరిగినట్లు సీసీ కెమెరాలో రికార్డయింది.
ఆ తర్వాత ఆయనపై దాడి జరిగింది. తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే రమణయ్య కుప్పకూలిపోయారు.
అది గమనించిన వాచ్‌మెన్, చుట్టూపక్కల వారు కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న రమణయ్యను వెంటనే విశాఖ అపోలో హాస్పిటల్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.
విశాఖ కొమ్మాదిలోని STBL సినీ థియేటర్ వెనక ఉన్న చరణ్ క్యాస్టిల్స్ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులో రమణయ్య నివాసముంటున్నారు. తహసీల్దార్ రమణయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు.
రమణయ్య సొంత ఊరు శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దిమ్మిలాడ గ్రామం. ఆయన గత పదేళ్లుగా డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, కలెక్టరేట్‌లో ఏవోగా విధులు నిర్వహించారు. వజ్రపు కొత్తూరు, పద్మనాభం, విశాఖ రూరల్ చినగదిలి మండలాల్లో రమణయ్య ఎమ్మార్వోగా పనిచేశారు.
రెండు రోజుల కిందట విజయనగరం నగరం జిల్లా బొండపల్లికి ఆయనకు బదిలీ అయ్యింది.
రమణయ్యపై దాడి సమాచారం తెలిసిన అనంతరం విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు.
భూ వివాదాలు లేదా వ్యక్తిగత కక్షల కారణంగా ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈలింక్ క్లిక్ చేయండి.