‘అబ్‌కీ బార్ 400 పార్, తీస్రీ బార్ మోదీ సర్కార్’.. ఇదీ లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ కొత్త నినాదం

రానున్న లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ తన నినాదాన్ని ఖరారు చేసింది. ‘అబ్‌కీ బార్ 400 పార్, తీస్రీ బార్ మోదీ సర్కార్’ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. దీనర్థం.. ‘ఈసారి 400 సీట్లు మన లక్ష్యం.. మూడోసారి మూడో ప్రభుత్వం’.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు మళ్లీ కలుద్దాం.

  2. ‘అబ్‌కీ బార్ 400 పార్, తీస్రీ బార్ మోదీ సర్కార్’.. ఇదీ లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ కొత్త నినాదం

    Modi, BJP leaders

    ఫొటో సోర్స్, ANI

    రానున్న లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ తన నినాదాన్ని ఖరారు చేసింది. ‘అబ్‌కీ బార్ 400 పార్, తీస్రీ బార్ మోదీ సర్కార్’ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. దీనర్థం.. ‘ఈసారి 400 సీట్లు మన లక్ష్యం.. మూడోసారి మూడో ప్రభుత్వం’.

    మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో నిర్వహించిన పార్టీ సీనియర్ నేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

    ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవియాతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ హాజరయ్యారు.

    కాగా 2014 లోక్‌సభ ఎన్నికలకు ‘అచ్చే దిన్ ఆనేవాలే హే’(మంచి రోజులొస్తున్నాయి) అని.. 2019 లోక్‌సభ ఎన్నికలకు 'ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్'(మరోసారి మోదీ ప్రభుత్వం) అనే నినాదాలతో బీజేపీ ప్రజల్లోకి వెళ్లింది.

  3. వైఎస్సార్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జిల రెండో జాబితా

    YSRCP నియోజకవర్గ ఇంచార్జిల రెండో జాబితా

    ఫొటో సోర్స్, YSRCP

    నియోజకవర్గాల ఇంచార్జిలను మార్చుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా రెండో లిస్ట్ విడుదల చేసింది.

    27 మంది పేర్లతో ఉన్న ఈ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి రిలీజ్ చేశారు. ఇందులో కొన్ని అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలు కూడా ఉన్నాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనలో జాబితా రూపొందించినట్లు చెప్పారు.

    లోక్ సభ నియోజకవర్గాలు

    1)అనంతపురం ఎంపీ స్థానం - మాలగుండ్ల శంకరనారాయణ

    2)హిందూపురం ఎంపీ స్థానం - జోలదరాశి శాంత

    3)అరకు ఎంపీ స్థానం (ఎస్టీ) - కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి

    అసెంబ్లీ నియోజకవర్గాలు

    1)రాజాం (ఎస్సీ) – డాక్టర్ తలే రాజేశ్

    2)అనకాపల్లి - మలసాల భరత్ కుమార్

    3)పాయకరావుపేట (ఎస్సీ) -కంబాల జోగులు

    4)రామచంద్రాపురం - పిల్లి సూర్యప్రకాష్

    5)పి.గన్నవరం (ఎస్సీ) - విప్పర్తి వేణుగోపాల్

    6)పిఠాపురం - వంగ గీత

    7)జగ్గంపేట - తోట నరసింహం

    8)ప్రత్తిపాడు - వరుపుల సుబ్బారావు

    9)రాజమండ్రి సిటీ - మార్గాని భరత్

    10)రాజమండ్రి రూరల్ - చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ

    11)పోలవరం (ఎస్టీ) - తెల్లం రాజ్యలక్ష్మి

    12)కదిరి - బీఎస్ మక్బూల్ అహ్మద్

    13)ఎర్రగొండపాలెం (ఎస్సీ) - తాటిపర్తి చంద్రశేఖర్

    14)ఎమ్మిగనూర్ - మాచాని వెంకటేష్

    15)తిరుపతి - భూమన అభినయ్ రెడ్డి

    16)గుంటూరు ఈస్ట్ - షేక్ నూరి ఫాతిమా

    17)మచిలీపట్నం - పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)

    18)చంద్రగిరి - చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

    19)పెనుకొండ - కె.వి. ఉషా శ్రీచరణ్

    20)కళ్యాణదుర్గం - తలారి రంగయ్య

    21)అరకు ఎస్టీ – గొడ్డేటి మాధవి

    22)పాడేరు (ఎస్టీ) – మత్స్యరాస విశ్వేశ్వర రాజు

    23)విజయవాడ సెంట్రల్ – వెల్లంపల్లి శ్రీనివాస్

    24)విజయవాడ వెస్ట్- షేక్ ఆసిఫ్

    YSRCP నియోజకవర్గ ఇంచార్జిల సెకండ్ లిస్ట్

    ఫొటో సోర్స్, YSRCP

  4. కల్పనా సోరెన్: సీఎం భార్య కోసమే ఆ ఎమ్మెల్యే సీటు ఖాళీ చేశారా?

  5. యాపిల్ ఐఫోన్ కంపెనీని మోదీ ప్రభుత్వం టార్గెట్ చేసిందా, వాషింగ్టన్ పోస్ట్ కథనంలో ఏముంది?

  6. మహాత్మ జ్యోతిబా, సావిత్రిబాయి ఫూలే స్థాపించిన తొలి బాలికల పాఠశాల ఏడాదిలోనే ఎందుకు మూతపడింది, ఆ తర్వాత ఏమైంది?

  7. బ్రేకింగ్ న్యూస్, జపాన్: రన్‌వేపై కాలిపోయిన విమానం.. 379 మంది ప్రయాణికులను రక్షించిన సిబ్బంది

    తగలబడుతున్న విమానం

    ఫొటో సోర్స్, screen grab

    టోక్యో హనెడా విమానాశ్రయంలో జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఏఎల్ 516 విమానం మంటల్లో చిక్కుకుంది.

    విమానం రన్‌వేపై ఉండగా కాలిపోయింది.

    విమానం కిటికీలు, విమానం దిగువ భాగం నుంచి మంటలు వస్తున్న దృశ్యాలు జపాన్ టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి.

    జపాన్‌కు చెందిన వార్తాసంస్థ ఎన్‌హెచ్‌కే అక్కడి అధికారులను ఉటంకిస్తూ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించింది.

    రన్ వేపై కాలిపోతున్న విమానం

    ఫొటో సోర్స్, screen grab

    హనెడా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన తరువాత జపాన్ కోస్ట్‌గార్డ్‌కు చెందిన మరో విమానాన్ని ఢీకొనడం వల్ల మంటలు చెలరేగి ఉండొచ్చని ఎన్‌హెచ్‌కే తెలిపింది.

    ప్రమాదానికి గురైన విమానం హోక్కడో విమానాశ్రయం నుంచి బయలుదేరి వచ్చిందని పేర్కొన్నారు.

    విమానాశ్రయ అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

    విమానంలోని 379 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు ఎన్‌హెచ్‌కే పేర్కొంది.

    అయితే, కోస్ట్‌గార్డ్ విమానం నుంచి ఒకరు ప్రాణాలతో బయటపడగా మరో అయిదుగురి ఆచూకీ తెలియలేదు.

  8. జపాన్‌ భూకంపం: 48కి చేరిన మృతుల సంఖ్య

  9. భారత్ నుంచి ప్రవహించే సింధు నదిలో బంగారం వెలికితీస్తున్న పాకిస్తానీలు

    నౌషెహ్రా జిల్లాలో సింధు నది నుంచి అక్రమంగా చేపడుతున్న బంగారం తవ్వకాలను అడ్డుకునేందుకు ఆ జిల్లా అధికారులు, ఖనిజ శాఖ అధికారులు కలిసి చర్యలు చేపడుతున్నారు.

    కాబుల్ నదిలో, నౌషెహ్రా వరకు సింధు నదిలో బంగారం వేట చాలా కాలంగా ఉన్నదే అయినప్పటికీ 2022 నుంచి యంత్రాల వినియోగం ఎక్కువైందని నిజాంపూర్ డిప్యూటీ కమిషనర్ ఖలీద్ ఖట్టక్ ‘బీబీసీ’తో చెప్పారు.

    వీడియో క్యాప్షన్, భారత్ నుంచి ప్రవహించే ‘సింధు’లో బంగారం తవ్వుతున్న పాకిస్తానీలు
  10. అయోధ్య: సోనియా గాంధీకి ఆహ్వానంపై వీహెచ్‌పీ వాదన ఏమిటి?

  11. పిల్లల భవిష్యత్తు కోసం వారితోనే పొదుపు చేయించే మూడు చిట్కాలు

  12. దక్షిణ కొరియా: ప్రతిపక్ష నేతపై మీడియా సమావేశంలో కత్తితో దాడి, కెల్లీ నగ్, బీబీసీ న్యూస్

    లీ జే మ్యూంగ్

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, లీ జే మ్యూంగ్

    దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత లీ జే మ్యూంగ్ పై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడిచేశాడు.

    ఓడరేవు నగరమైన బుసాన్‌లో మంగళవారం ఉదయం ఆయన ఓ న్యూస్ కాన్ఫరెన్స్‌లో ఉండగా ఈ ఘటన జరిగింది.

    ఈ ఘటనలో ఆయన మెడకు ఎడమ వైపున గాయమైంది.

    దాడిచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

    లీ కి సెంటిమీటర్ మేర గాయమైందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, స్పృహలోనే ఉన్నారని వార్తాకథనాలు చెబుతున్నాయి.

    లీ కి అయిన గాయం ప్రమాదకరం కాదని పోలీసులు చెప్పారు.

    దాడిచేసిన వ్యక్తి వయసు 60 నుంచి 70 ఏళ్ళ మధ్య ఉంటుందని, ఆటోగ్రాఫ్ అడిగే నెపంతో అతను లీని సమీపించి హఠాత్తుగా కత్తితో దాడిచేశాడని తెలిపారు.

    నిందితుడి వద్ద ఉన్న ఆయుధం 20 సెంటీమీటర్ల నుంచి 30 సెంటిమీటర్ల పొడవు ఉంటుందని యెన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

    తను ఎవరు, తన లక్ష్యమేమిటనే విషయంపై దాడిచేసిన వ్యక్తి పెదవి విప్పడం లేదని పోలీసులను ఉటంకిస్తూ యెన్‌హావ్ తెలిపింది.

    దాడి జరగ్గానే లీ రద్దీగా ఉన్న జనంపై పోడిపోయారని, తరువాత నేలపైన వాలిపోయారని, చుట్టుపక్కల జనం దాడిచేసే వ్యక్తిని అడ్డుకోవడానికి యత్నించినట్టుగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోల్లో కనిపిస్తోంది.

    గాయపడిన లీని హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారని న్యూస్ ఏజెన్సీ యెన్ హాప్ తెలిపింది.

    2022లో అధ్యక్ష ఎన్నికల్లో లీ జే మ్యూంగ్ తృటిలో అధ్యక్ష పీఠాన్ని కోల్పోయారు.

  13. జపాన్ భూకంపం: 80 శాతం భూకంపాలు ‘రింగ్ ఆఫ్ ఫైర్’లోనే ఎందుకు వస్తాయి?

  14. ఒడిశా: పూరీ జగన్నాథ ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి

    పూరీ జగన్నాథ ఆలయం

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, భక్తులు ఆలయ ప్రాంగణంలోకి రావడానికి ముందు సంప్రదాయ వస్త్రాలు ధరించాలని ఆలయ నిర్వహణ కమిటి తెలిపింది.

    ఒడిశాలోని పూరీలో ఉన్న జగన్నాథ ఆలయానికి వచ్చే వారికి డ్రెస్ కోడ్ తప్పనిసరని ఆలయ పాలనా కమిటీ స్పష్టం చేసింది. ఆలయ ప్రాంగణంలో గుట్కా, పాన్ మసాలా తినడం, ఉమ్మడాన్ని పూర్తిగా నిషేధించారు. దీంతో పాటు పాలిథీన్, ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని రద్దు చేశారు.

    భక్తులు ఆలయ ప్రాంగణంలోకి రావడానికి ముందు సంప్రదాయ వస్త్రాలు ధరించాలని ఆలయ నిర్వహణ కమిటి తెలిపింది.

    జీన్స్, షార్ట్స్, టోర్న్ జీన్స్ ప్యాంట్లు, భుజాలు కనిపించే చొక్కాలు, మిడ్డీలు లాంటి డ్రస్సులు వేసుకున్న వారిని ఆలయంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

    జనవరి 1న ఈ నిబంధనను అమల్లోకి తెచ్చిన తర్వాత భక్తుల్లో పురుషులు లాల్చీ, పంచె, మహిళలు చీరలు కట్టుకుని ఆలయంలోకి వస్తున్నారు.

    ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై జరిమానా వేస్తామని ఆలయ నిర్వహణ కమిటీ తెలిపింది.

    జనవరి 1 నుంచి భువనేశ్వర్‌లోని లింగరాజ ఆలయంలో పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించారు.

  15. సిద్ధూ మూసేవాలా హత్య: గోల్డీ బరాడ్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం

    గోల్డీ బరాడ్
    ఫొటో క్యాప్షన్, గోల్డీ బరాడ్

    పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాల హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలున్న గోల్డీ బరాడ్‌ను భారత ప్రభుత్వం ఉగ్రవాది(టెర్రరిస్టు)గా ప్రకటించింది. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న గోల్డీ బరాడ్ కోసం పంజాబ్ పోలీసులు గాలిస్తున్నారు.

    చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద సత్వీందర్ సింగ్ అలియాస్ సత్యేందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బరాడ్‌ను ఉగ్రవాదిగా పేర్కొంటూ కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ జారీచేసింది.

    ఖలీస్తానీ సంస్థ అయిన బాబర్ కల్సా ఇంటర్నేషనల్‌కు అనుబంధంగా గోల్డీ బరాడ్ పనిచేస్తున్నారు. ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నారు. ఆయన 1994 ఏప్రిల్ 11న పంజాబ్‌లోని శ్రీ ముక్తసర్ సాహిబ్జిల్లాలో జన్మించారు.

    సిద్ధూ మూసేవాలా

    ఫొటో సోర్స్, Sidhu Moose Wala

    ఫొటో క్యాప్షన్, సిద్ధూ మూసేవాలా

    గోల్డీ బరాడ్ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు భావించిన కేంద్ర ప్రభుత్వం ఉపాలోని నాలుగో షెడ్యూల్ కింద ఆయన్ను ఉగ్రవాదిగా గుర్తించింది.

    గోల్డీ బరాడ్‌కు సీమాంతర ఉగ్రవాద సంస్థల మద్దతు ఉందని, అనేక హత్యలతో ఆయనకు సంబంధం ఉందని కేంద్రం చెప్పింది.

    దీంతోపాటు ఆయన భారత రాజకీయ నాయకులకు అనేక బెదిరింపు ఫోన్ కాల్స్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం, వివిధ సామాజిక మాధ్యమాల్లో చంపేస్తాననే పోస్టులు పెట్టడం తదితర కార్యకలాపాల్లో ఆయన ప్రమయం ఉందని తెలిపింది.

    డ్రోన్‌ల ద్వారా ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా చేయడంతోపాటుహత్యలు చేసేందుకు షార్ప్ షూటర్లను కూడా ఏర్పాటు చేస్తుంటారని కేంద్రం చెప్పింది.

    పోలీసులు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, అనేక కేసుల్లో నిందితుడుగా ఉన్న గోల్డీ బరాడ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

    అరాచకం, ఉగ్రవాదం, హత్యలు, దేశ వ్యతిరేక కార్యకలాపాల ద్వారా పంజాబ్‌లో శాంతికి విఘాతం కలిగించేందుకు గోల్డీ బరాడ్, ఆయన అనుచరులు కుట్ర పన్నుతున్నారని కేంద్రం తెలిపింది.

    గోల్డీ బరాడ్ కోసం 2022 మేలో ఇంటర్‌పోల్ ‘రెడ్ కార్నర్’ నోటీసు జారీచేసింది.

  16. హలో!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.