ఆంధ్రప్రదేశ్: టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ భేటీ

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుతో ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్ సంస్థ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ శనివారం భేటీ అయ్యారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం

  2. ‘బతికున్నవారి కంటే శవాలే నయం’.. మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేసే మహిళ

  3. ఒకే మహిళ కడుపులో రెండు గర్భాశయాలు, రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు పిల్లలకు జన్మ

  4. భారత్‌కు వస్తున్న ఇజ్రాయెల్ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి

    ఇజ్రాయెల్ నౌక

    ఫొటో సోర్స్, Getty Images

    భారత పశ్చిమ తీరానికి సమీపంలోని అరేబియా సముద్రంలో ఇజ్రాయెల్‌ వాణిజ్య నౌకపై వైమానిక (డ్రోన్) దాడి జరిగిందని బ్రిటన్‌కు చెందిన 'సముద్ర భద్రతా సంస్థ' అంబ్రేను ఉటంకిస్తూ వార్తాసంస్థ రాయిటర్స్ తెలిపింది. నౌకపై దాడి జరిగినప్పుడు, అది గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరానికి సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఉంది.

    హమాస్‌తో ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఎర్ర సముద్రం వెలుపల కార్గో షిప్‌పై దాడి జరగడం ఇదే తొలిసారి.

    సిబ్బందికి, ఓడకు భద్రత కల్పించామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఇండియన్ నేవీ అధికారి ఒకరు ఆ వార్తా సంస్థతో చెప్పారు. ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ షిప్‌లు అదనపు సహాయాన్ని అందించడానికి ఇజ్రాయెల్‌ నౌకల వైపు కదులుతున్నాయి.

    ఆలిండియా రేడియో ప్రకారం ఎంవీ కెమ్ ప్లూటో అనే ఈ ట్యాంకర్‌ సౌదీ అరేబియా నుంచి ముడి చమురును రవాణా చేస్తోంది. ఈ షిప్ మంగళూరుకు వెళుతోంది. ట్యాంకర్‌లో దాదాపు 20 మంది భారతీయులు ఉన్నారు.

  5. ఆంధ్రప్రదేశ్: టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ భేటీ

    చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్
    ఫొటో క్యాప్షన్, చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ (ఫైల్)

    టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుతో ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్ సంస్థ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ శనివారం భేటీ అయ్యారు.

    హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నారా లోకేష్‌తో కలిసి ఆయన గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు.

    చంద్రబాబుతో సుమారు గంటన్నర పాటు ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు.

    ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్ బృందం చేసిన సర్వే రిపోర్ట్‌ను చంద్రబాబుకు అందించినట్లు ప్రచారం జరుగుతోంది.

    గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైఎస్సార్‌సీపీకి పనిచేశారు. ఐ ప్యాక్ సంస్థ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా జగన్ విజయంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి పనిచేశారు. అనంతరం ఐప్యాక్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు చెప్పి, బిహార్‌లో సొంతంగా రాజకీయ కార్యచరణకు పూనుకున్నారు.

    ఈ నేపథ్యంలో చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి ప్రశాంత్ కిషోర్ సేవలు అందించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అనంతరం ఐప్యాక్ సంస్థ ఎక్స్(ట్విటర్)‌లో స్పందించింది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీకి తమ సేవలు కొనసాగుతాయని ప్రకటించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    కాగా, టీడీపీతో ప్రశాంత్ కిషోర్ భేటీపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. మెటీరియల్ మంచిది కాకపోతే, మేస్త్రీ ఏం చేయగలడని ఎక్స్ (ట్విటర్)లో తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  6. అత్తాపూర్: హైదరాబాద్‌లో అంకుర ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం - 6 అంతస్తులలో మంటలు

    హైదరాబాద్ అంకుర ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

    ఫొటో సోర్స్, UGC

    హైదరాబాద్ అత్తాపూర్ దగ్గర అంకుర ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

    ఈ భవనంలోని పలు అంతస్తుల్లో మంటలు చెలరేగుతున్నాయి.

    సాయంత్రం ఘటన జరిగిన సమయంలో ఆసుపత్రిలో రోగులు, సిబ్బందితో పాటూ నర్సింగ్ హాస్టల్ విద్యార్థినులు కూడా ఉన్నారు.

    జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు ఒక దాన్నుంచి ఒకటిగా ఆరు అంతస్తులకు పాకినట్టు సమాచారం.

    అక్కడ ఉన్న రోగులను సిబ్బంది బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి.

    ఆసుపత్రి పైన ఫ్లెక్సీ నుంచి మంటలు అంటుకున్నట్టు భావిస్తున్నారు.

    ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలియరాలేదు.

    వారాంతం కావడంతో ఎక్కువ మంది భవనం లో లేరని తెలుస్తుంది.

    అదే సమయంలో నర్సింగ్ హాస్టల్ కూడా అదే భవనంలో ఉండడంతో వారంతా కిందకు వచ్చారు.

    ప్రస్తుతానికి ప్రాణ నష్టం జరగినట్టు సమాచారం లేదు. సిబ్బంది అప్రమత్తతతో ఎక్కువ మందిని కాపాడినట్టు తెలుస్తోంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. అమెరికా: హిందూ ఆలయంపై ఖలీస్తానీ నినాదాలు

    ఖలిస్తాన్ మూవ్ మెంట్

    ఫొటో సోర్స్, Hindu American Foundation

    కాలిఫోర్నియాలోని స్వామినారాయణ్ మందిరం గోడలపై, బోర్డులపై ఖలీస్తానీ అనుకూల నినాదాలు, ప్రధాని మోదీని టెర్రరిస్టుగా పేర్కొంటూ రాతలు వెలుగుచూశాయి.

    భారత విదేశాంగ శాఖ ఈ సంఘటనను ఖండించింది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని అమెరికాను డిమాండ్ చేసింది.

    ‘‘ఆపరేషన్ బ్లూస్టార్‌లో మరణించిన భింద్రన్ వాలేకు అనుకూలంగా, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా శ్రీ స్వామినారాయణ్ ఆలయ గోడలపైనా, సైన్ బోర్డులపైనా అపవిత్రం చేశారు’’ అని హిందూ అమెరికా ఫౌండేషన్ తన ఎక్స్ (ట్విటర్) హ్యాండిల్‌పై పోస్టు చేసింది.

    ‘‘నువార్క్ పోలీసులు, న్యాయవిభాగ శాఖలోని మానవ హక్కుల విభాగం దీనిపై సమగ్ర విచారణ జరుపుతాయి. విద్వేషాన్ని వెళ్ళగక్కుతున్న నేరం కింద దీనిని విచారణ జరపాలని మేం డిమాండ్ చేస్తున్నాం’’ అని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎక్స్‌లో పేర్కొంది.

    ఈ సంఘటనను ఖండిస్తూ శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ ట్వీట్ చేయగా, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చీ దానిని రీట్వీట్ చేశారు.

  8. కర్ణాటక: విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధం ఎత్తివేత

    హిజాబ్

    ఫొటో సోర్స్, UMESH MARPALLY

    కర్ణాటకలో హిజాబ్ పై విద్యాసంస్థల్లో ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మైసూరులో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హిజాబ్ పై నిషేధం ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారని మీడియా కథనాలు తెలిపాయి.

    ‘‘హిజాబ్ ఉత్తర్వులను ఉపసంహరిస్తున్నాం. ప్రజలు తమకు నచ్చినవి ధరించవచ్చు. వాటిపై ఎటువంటి నిషేధం ఉండదు’’ అని ఆయన చెప్పినట్టు మీడియా వెల్లడించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ను నిషేధిస్తూ గత బీజేపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.

    అయితే, దీనిపై స్పందించిన బీజేపీ, ఇది హిజాబ్ నిషేధం ఎత్తివేయడం కాదని, రాష్ట్రంలో షరియా చట్టాన్ని అమలు చేయడమని విమర్శించింది. దేశంలో కాంగ్రెస్, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఇస్లామిక్ రాజ్యం వస్తుందని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. ఫ్రాన్స్‌: మానవ అక్రమ రవాణా అనుమానంతో 303 మంది భారతీయులున్న విమానం నిలిపివేత

    మానవ అక్రమ రవాణా

    ఫొటో సోర్స్, Getty Images

    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి నికరాగ్వా రాజధాని మనాగ్వాకు 303 మంది భారతీయ ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్‌బస్ ఏ340 ను ఫ్రాన్స్ ఈశాన్య ప్రాంతంలో దిగ్భంధించినట్టు ఫ్రెంచ్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

    మానవ అక్రమరవాణా జరుగుతోందనే అనుమానంతో ఈ విమానాన్ని నిలిపివేసినట్టు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఫ్రాన్స్‌లో చిన్న విమానాశ్రయమైన వాట్రీలో ఈ విమానం ఆగినప్పుడు తమకు అందిన రహస్య సమాచారంతో విమానాన్ని దిగ్భధించినట్టు అధికారులు తెలిపారు. విమానాశ్రయాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

    విమానప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోయారు. కొంతమంది ప్రయాణికులను అక్రమ వలసదారులుగా భావిస్తున్నారు. ఇద్దరి ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  10. గుడ్ మార్నింగ్.

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.