You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

గాజా: ఖాన్ యూనిస్‌కు చేరుకున్న ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు, పౌరులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశం

గాజాలోని ఖాన్ యూనిస్‌కు ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు చేరుకున్నట్లు స్థానిక జర్నలిస్టులు తెలిపారు. పౌరులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని మరోసారి ఇజ్రాయెల్ సైన్యం కోరింది.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం. ధన్యవాదాలు.

  2. రేవంత్‌కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య శుభాకాంక్షలు

    తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న రేవంత్ రెడ్డికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోషల్ మీడియా వేదిక ఎక్స్‌(ట్విటర్)‌లో శుభాకాంక్షలు తెలియజేశారు.

    ''కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రేవంత్ రెడ్డికి అభినందనలు. తెలంగాణలో రాబోయే ఐదేళ్లలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందరినీ కలుపుకొని పోయే, ప్రగతిశీలమైన, పారదర్శకమైన పాలనను మనం చూస్తాం’’ అని చెప్పారు.

    ''సీఎల్పీ నాయకుడిగా ఎన్నికైనందుకు, తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి నాయకత్వం వహించినందుకు రేవంత్ రెడ్డి గారికి అభినందనలు'' అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సోషల్ మీడియాలో తెలిపారు.

  3. సీఎంగా రేవంత్ ప్రకటనకు ముందు దిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఏమన్నారు?

  4. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. ఏబీవీపీ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి పీఠం వరకు ప్రస్థానం ఇదీ

  5. మోదీ: కర్ణాటక, హిమాచల్‌లలో ఓటమి తర్వాత బీజేపీ వ్యూహాలు ఎలా మార్చుకుంది?

  6. ప్రపంచంలో అత్యంత తీవ్రమైన తుపానులన్నీ బంగాళాఖాతంలోనే ఎందుకు సంభవిస్తాయి?

  7. రాజస్థాన్: రాజ్‌పుత్ కర్ణి సేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య

    రాజస్థాన్‌లోని జైపూర్‌లో రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని కాల్చి చంపారు.

    శ్యామ్‌నగర్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సుఖ్ దేవ్ సింగ్‌పై దుండగులు కాల్పులు జరిపారు.

    తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు ఆయన మృతిచెందారని ధృవీకరించారు.

    "సుఖ్‌దేవ్‌పై కాల్పులు జరిగాయి, ఆయన ఆసుపత్రిలో మరణించారు. కాల్పులు జరపడానికి వచ్చిన వారిలో ఒకరు కూడా మరణించారు" అని జైపూర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ బీబీసీకి చెప్పారు.

    సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.

  8. మిగ్‌జాం: తీరం దాటిన తీవ్ర తుపాను.. ఏపీ, తెలంగాణలకు భారీ వర్ష సూచన

  9. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి రాహుల్ గాంధీ ఇమేజ్‌ను దెబ్బతీసిందా? 2024లో మోదీని ఆయన ఢీకొట్టగలరా?

  10. మిగ్‌జాం: బాపట్లలో 30 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    మిగ్‌జాం తుపాను ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. తుపాను తీరం దాటుతున్న సమయంలో అలలు ఎగిసిపడ్డాయి. ఇది పూర్తిగా తీరాన్ని దాటేందుకు మరో రెండు గంటల సమయం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

    బాపట్ల సమీపంలోని సూర్యలంక బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. సుమారుగా 30 మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. దీంతో పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగి, భద్రతా ఏర్పాట్లు చేసింది.

    తుపాను తీరాన్ని దాటిన తర్వాత బలహీనపడుతుంది. అయినప్పటికీ రాబోయే 24 గంటల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. మరి కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

    రెండు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న వరి

    ఇప్పటికే తుపాను కారణంగా ఏపీలోని ఎనిమిది జిల్లాల పరిధిలో అపార నష్టం సంభవించింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2 లక్షల ఎకరాల్లో వరి సాగు దెబ్బతింది. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం అయ్యింది.

    రేణిగుంట, గన్నవరం, రాజమండ్రి, విశాఖపట్నం విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

    ఏపీలో150 రైలు సర్వీసులూ రద్దు చేయాల్సి వచ్చింది. వాగులు వంకలు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

    తిరుపతి, నెల్లూరు, బాపట్ల జిల్లాలలో రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి.

    నిలిచిన విద్యుత్ సరఫరా

    ఈదురుగాల కారణంగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కరెంటు సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ పునరుద్ధరణకు వేగంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తుపాను ప్రభావిత జిల్లాల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

    వర్షాలు తగ్గగానే పంట నష్టం అంచనాలు వేసి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

    రాష్ట్రవ్యాప్తంగా 9,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రాణ నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. ఎన్‌డీ‌ఆర్‌ఎఫ్ బృందాలు ఎక్కడికక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

  11. తెలంగాణ సీఎం ప్రకటన నేడే: మల్లికార్జున ఖర్గే

    తెలంగాణలో అధికారం చేపట్టేందుకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై ఏఐసీసీ అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది.

    సోమవారం హైదరాబాద్‌లో సీఎల్పీ సమావేశం అనంతరం, ఏఐసీసీ పరిశీలకులు సీఎల్పీ అభిప్రాయాలను అధిష్టానానికి పంపామని, తుది నిర్ణయం అధిష్టానమే తీసుకుంటుందని తెలిపారు.

    మంగళవారం కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, ఈరోజు తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

    ‘ఆ రహా హై. ఆజ్ డిసైడ్ కరేంగే తెలంగాణ’ అని చెప్పారు.

  12. గాజా: ఖాన్ యూనిస్‌ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు..

    దక్షిణ గాజాలోని పెద్ద నగరమైన ఖాన్ యూనిస్‌‌కు సమీపాన ఇజ్రాయెల్ సైన్యం యుద్ధ ట్యాంకులను మోహరించాయి.

    ఖాన్ యూనిస్‌లోని పౌరులను ఉద్దేశిస్తూ ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించింది.

    క్షేత్రస్థాయిలో దాడులు కొనసాగుతున్నందున ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణ గాజాలోని రెండు గోడౌన్లలో నిల్వ ఉంచిన వైద్య పరికరాలు, ఔషధాలను తరలించడానికి ఇజ్రాయెల్ సైన్యం 24 గంటలే సమయం ఇచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ బాధ్యులు చేసిన వ్యాఖ్యలను ఖండించింది ఇజ్రాయెల్ సైన్యం. తాము ఎలాంటి గడువు ఇవ్వలేదని తెలిపింది.

    అయితే, ఐక్యరాజ్య సమితి అధ్యక్షులు గాజాలో కాల్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం గాజాలో సురక్షిత ప్రాంతమనేదే లేదని అన్నారు. వేలమంది పౌరులు నిరాశ్రయులయ్యారని, గాజాలో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నాయని అన్నారు.

  13. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  14. సునీల్ కనుగోలు: తెలంగాణలో కాంగ్రెస్ విజయం వెనుక పనిచేసిన ఈ వ్యూహకర్త ఎవరు?