You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఆరు దేశాల టూరిస్టులను వీసా లేకుండా అనుమతించేందుకు చైనా నిర్ణయం

ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్పెయిన్, మలేషియా దేశాల పౌరులను ఏడాది పాటు వీసా లేకుండా అనుమతిస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

లైవ్ కవరేజీ

  1. ముంబయి 26/11 దాడులు: కసబ్‌ను కోర్టులో గుర్తించిన తొమ్మిదేళ్ళ బాలిక దేవిక జీవితం ఇప్పుడు ఎలా ఉంది?

  2. లైవ్ పేజీని ముగిస్తున్నాం

    బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా అప్‌డేట్స్‌తో మళ్ళీ కలుసుకుందాం.

    ధన్యవాదాలు.

  3. ఉత్తర కాశీ: సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడే ప్రయత్నాలకు ఎదురవుతున్న అడ్డంకులేంటి?

  4. ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ... బందీల విడుదల ఎందాకా వచ్చింది?

  5. ఉత్తరకాశీ: సొరంగంలో ఎక్కువ రోజులు ఉంటే మానసికంగా, శారీరకంగా ఎలాంటి సమస్యలు వస్తాయి?

  6. ఎన్నికల తర్వాత పెన్షన్ రూ.5 వేలకు పెంచుతాం – కేసీఆర్

    ఎన్నికల తర్వాత పెన్షన్‌ను రూ.5 వేలకు పెంచుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు.

    ములుగులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు.

    తెలంగాణ వచ్చేటట్టు చేయాలని సమ్మక్క, సారలమ్మ తల్లులకు ఎన్నోసార్లు మొక్కుకున్నానని తెలిపారు.

    రాష్ట్ర అవతరణ తర్వాత రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్లు ఖర్చు పెట్టి జాతర జరుపుకుంటున్నామని అన్నారు.

    ‘‘బీఆర్ఎస్ చరిత్ర మీ కళ్ల ముందే ప్రారంభమైంది. తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పుట్టింది. 15 ఏళ్లు పట్టు వీడకుండా పోరాటం చేసి తెలంగాణ సాధించాం. పదేళ్లుగా మీ ఆశీర్వచనంతో పాలన చేస్తున్నాను’’ అని కేసీఆర్ అన్నారు.

    ‘‘ అంతకుముందు 50 సంవత్సరాలు కాంగ్రెస్ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించింది. ఈ పదేళ్లలో బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉందో బేరీజు వేసుకుని ఓటేయాలని కోరుతున్నా’’ అని కేసీఆర్ ప్రసంగించారు.

    ములుగు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున నాగజ్యోతి పోటీ చేస్తున్నారు.

    ములుగు నియోజకవర్గ సభలో పాల్గొన్న తర్వాత భూపాలపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల సభల్లో కూడా కేసీఆర్ ప్రసంగించారు.

    ‘‘సింగరేణిలో 100 శాతం రాష్ట్ర ప్రభుత్వానికే ఉండేది. కాంగ్రెస్ పాలనలో కేంద్రం వద్ద అప్పులు తెచ్చి, అవి తిరిగి చెల్లించలేకపోవడంతో 49 శాతం వాటా కేంద్రానికి అప్పగించారు. డిపెండెంట్ ఉద్యోగాలు ఊడగొట్టిందెవరు? కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లే కదా. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరించుకున్నాం. సింగరేణి కార్మికులకు బోనస్, దసరా లాభాల్లో వాటాగా రూ.1000 కోట్లు పంపిణీ చేశాం. కార్మికుల హక్కులు కాపాడుతున్నాం’’ అని కేసీఆర్ చెప్పారు.

  7. తెలంగాణ ఎన్నికలలో జనాన్ని ఉర్రూతలూగిస్తున్న మూడు పాటలు

  8. 'భగ్‌వా లవ్ ట్రాప్': ఇది 'లవ్ జిహాద్'కు పోటీనా... హిందూ యువకులు ఈ పేరుతో ముస్లిం యువతులను ట్రాప్ చేశారా?

  9. తెలంగాణలో పేద మహిళలకు ఉచితంగా నాలుగు గ్యాస్ సిలిండర్లు – అమిత్‌షా

    దేశంలో అత్యంత అవినీతి సర్కారు కేసీఆర్ ప్రభుత్వమని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్‌షా తీవ్ర ఆరోపణలు చేశారు.

    కేసీఆర్‌కి అసదుద్దీన్ ఒవైసీ అంటే భయమని అన్నారు.

    తెలంగాణలోని రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన రోడ్‌షోలో అమిత్‌షా పాల్గొన్నారు.

    తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తాము అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు.

    ప్రధాని మోదీ చెప్పినట్లు తెలంగాణకు ముఖ్యమంత్రి వెనుకబడిన తరగతులకు(బీసీకి) చెందిన వారవుతారని అన్నారు.

    ముస్లిం రిజర్వేషన్లకు ముగింపు పలికి, ఎస్‌సీ, ఎస్టీ, ఓబీసీకి రిజర్వేషన్లను ఇస్తామని తెలిపారు.

    మాదిగ కమ్యూనిటీ వర్గీకరణ చేపడతామని తాము హామీ ఇచ్చామని చెప్పారు.

    రాష్ట్రంలోని పేద మహిళలకు ఏడాదికి ఉచితంగా నాలుగు గ్యాస్ సిలిండర్లను ఇవ్వనున్నట్లు తెలిపారు.

    తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని ఆర్మూర్ అసెంబ్లీ బహిరంగ సభలో చెప్పారు.

    పదేళ్ల పాటు కేసీఆర్ సర్కార్ తెలంగాణ ప్రజల కోసం ఏం చేయలేదని, కానీ కేటీఆర్ కోసం రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.

    తాము అధికారంలోకి రాగానే అవినీతి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకుంటామని, దీనికోసం తాము ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

  10. తెలంగాణ: జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాం, 2 లక్షల ఉద్యోగాలిస్తాం – ప్రియాంక గాంధీ

    తెలంగాణలో యువత కష్టపడి చదివి పరీక్ష రాసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో పేపర్ లీకులు అవుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించేందుకు తాము జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా చెప్పారు.

    రాజస్థాన్‌లో మాదిరి 2 లక్షల ఉద్యోగాలిస్తామని తెలిపారు.

    జాబ్ క్యాలెండర్ కింద ఏ రోజు పరీక్ష పెడతాం, ఎప్పుడు ఫలితాలు వస్తాయి వంటి విషయాలను వెల్లడిస్తామన్నారు.

    పేపర్ లీకుల వెనుకున్న కుంభకోణాలను ఆపేందుకు కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేయనుందన్నారు.

    పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరులో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ప్రియాంక గాంధీ ప్రసంగించారు.

    తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువుగా ఉందని తెలిపారు.

    కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్కో దగ్గర యువతకు 2 లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చామని చెప్పారు.

    విద్యార్థులకు రూ.5 లక్షల సాయం అందిస్తామని, ప్రతి జిల్లాలో అంతర్జాతీయ స్థాయిలో పాఠశాలలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

    తెలంగాణ రాష్ట్రం ఎందరో త్యాగాలతో ఏర్పడిందని, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించడం ఎంతో ముఖ్యమన్నారు.

  11. ఆరు దేశాల టూరిస్టులను వీసా లేకుండా అనుమతించేందుకు చైనా నిర్ణయం

    ఆరు దేశాల టూరిస్టులకు వీసా లేకుండా తమ దేశంలోకి అనుమతించాలని చైనా ప్రయోగాత్మకంగా నిర్ణయించింది.

    ముందుగా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్పెయిన్, మలేషియా దేశాల పౌరులను ఏడాది పాటు వీసా లేకుండా అనుమతిస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

    ఈ దేశాలకు చెందిన సాధారణ పాస్‌పోర్టుదారులు వీసా లేకుండా 2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్ వరకు15 రోజుల కోసం చైనా రావచ్చు, ఇక్కడ తమ వ్యాపారం చేసుకోవచ్చని చైనా తెలిపింది.

    చైనాలో ఉన్నత స్థాయి అభివృద్ధి, ఇతరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ శుక్రవారం తెలిపారు.

    ప్రస్తుతం చైనాకి వెళ్లాలంటే చాలా మంది ప్రయాణికులకు వీసా అవసరం.

    చైనా వీసా నుంచి మినహాయింపు ఇచ్చిన దేశాలలో ఇప్పటికీ సింగపూర్, బ్రూనై దేశాలు ఉన్నాయి. ఈ దేశాల ప్రజలు కూడా అక్కడ 15 రోజుల వరకు పర్యటన లేదా వ్యాపార అవసరాల కోసం ఉండవచ్చు.

  12. నిజామాబాద్ అర్బన్: పోలింగ్‌కు ముందు అభ్యర్థి మరణిస్తే ఎన్నికలు వాయిదా పడతాయా? చట్టం ఏం చెబుతోంది?

  13. తెలంగాణ పత్రికల్లో కర్ణాటక ప్రభుత్వ ఫుల్ పేజీ యాడ్స్

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కర్ణాటక ప్రభుత్వానికి చెందిన యాడ్స్(ప్రకటనలు) తెలంగాణ దినపత్రికల్లో దర్శనమిచ్చాయి.

    ఆరు నెలల అద్భుత సాధన పేరిట కర్ణాటకలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ వచ్చాయి. వాటికి ఆయా పథకాల కింద లబ్ధి పొందిన వారి అభిప్రాయాలను జోడించారు.

    ఈ ప్రకటనలను కర్ణాటక సమాచార, పౌర సంబంధాల శాఖ జారీ చేసింది. ఇవి తెలుగు, ఇంగ్లిష్ పత్రికల్లో వచ్చాయి. నేరుగా ప్రభుత్వమే వేరొక రాష్ట్రంలో ప్రధాన పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ ఇవ్వడం కనిపించింది.

    ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ ప్రచారం హోరెత్తిస్తున్నాయి. అక్కడ ఎన్నికలకు ముందు ప్రకటించిన పథకాలు సరిగ్గా అమలు చేయడం లేదని, కాంగ్రెస్ వస్తే కరెంటు ఐదు గంటలే వస్తుందంటూ బీఆర్ఎస్ విమర్శిస్తోంది.

    దీన్ని కౌంటర్ చేస్తూ కర్ణాటకలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రకటనలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం.

  14. విశాఖ: చివరి ఓవర్లో వరుసగా 3 వికెట్లు పడ్డా ఆస్ట్రేలియాపై భారత్ ఎలా గెలిచింది?

  15. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో అల్లర్లు, వాహనాలకు నిప్పు, దుకాణాలు లూటీ

    చిన్నారులతో పాటు మరికొందరిని కత్తితో పొడిచిన ఘటనతో ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులు వాహనాలకు నిప్పుపెట్టడంతో పాటు దుకాణాలను లూటీ చేశారు.

    కత్తితో దాడి ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా పలువురికి గాయాలయ్యాయి. వారిలో ఐదేళ్ల బాలిక, 30 ఏళ్ల వయసున్న ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఒక 40 ఏళ్ల వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

    ఈ ఘటన సిటీ సెంటర్‌లోని పార్నెల్ స్క్వేర్ ఈస్ట్‌కి సమీపంలోని గెల్‌స్కాయిల్ కొలాయిస్ట్ ముయిరే స్కూల్ వద్ద, స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు జరిగింది.

    దాడికి పాల్పడినట్టు భావిస్తున్న వ్యక్తి ఐరిష్ పౌరుడని, 20 ఏళ్లుగా దేశంలో నివసిస్తున్నట్లు కొన్ని సోర్సెస్ ద్వారా బీబీసీకి తెలిసింది.

    దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలో ఆందోళనకారులు గుమిగూడడంతో పోలీసులను మోహరించారు. సిటీ సెంటర్‌లోని అనేక వీధులతో పాటు ఓ కానెల్ స్ట్రీట్‌లోనూ అల్లర్లు జరిగాయి. ఆందోళనకారులు కారు, ట్రామ్, బస్సు సహా పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఓ కానెల్ స్ట్రీట్‌లోని ఓ దుకాణాన్ని లూటీ చేశారు. పలు దుకాణాల అద్దాలు పగలగొట్టారు.

    ఫార్ రైట్ ఐడియాలజీ కలిగిన పోకిరీలు ఈ అల్లర్లకు కారణమని హెడ్ ఆఫ్ గార్డా సహానా(ఐరిష్ పోలీస్ విభాగం) డ్రూ హారిస్ ఆరోపించారు. ఘటన స్థలాన్ని పోలీసులు నియంత్రణలోకి తీసుకొచ్చే సమయంలో వారు అల్లర్లకు పాల్పడినట్లు ఆయన చెప్పారు.

    ఇది దారుణమైన దోపిడీ అని చీఫ్ సూపరింటెండెంట్ పాట్రిక్ మెక్‌మెనామిన్ ఆరోపించారు. 400 మందికిపైగా పోలీసు అధికారులు పెట్రోలింగ్ విధుల్లో ఉన్నారని ఆయన చెప్పారు.

    ''కొందరు సహోద్యోగులపై దాడులు జరిగాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. ఇలాంటి విపత్కర సమయంలో వారు చూపించిన ధైర్యసాహసాలను అభినందిస్తున్నాను'' అని ఆయన అన్నారు.

    దాడిలో గాయపడిన బాధిత చిన్నారులు, వారి కుటుంబాల గురించి తాను ఆందోళన చెందుతున్నట్లు ఐరిష్ ప్రెసిడెంట్ మైకేల్ డి హిగ్గిన్స్ అన్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ ఈ సంఘటనను ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

  16. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  17. బర్రెలక్క ఎన్నికల అఫిడవిట్‌లో ఏముంది? ఆస్తులు.. అప్పులు.. ఇంకా..