లైవ్ పేజీని ముగిస్తున్నాం
బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా అప్‌డేట్స్‌తో మళ్ళీ కలుసుకుందాం.
ధన్యవాదాలు.
ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి తమ గ్రూప్ చేరవవుతున్నట్లు హమాస్ నేత ఇస్మాయిల్ హనియా తెలిపారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా అప్‌డేట్స్‌తో మళ్ళీ కలుసుకుందాం.
ధన్యవాదాలు.

ఫొటో సోర్స్, Getty Images
నేషనల్ హెరాల్డ్ కేసులో 751.9 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ప్రకటన విడుదల చేసిందని ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
నేషనల్ హెరాల్డ్ ప్రచురణకర్త అయిన ఏజెఎల్, ప్రస్తుత యాజమాన్య సంస్థ అయిన యంగ్ ఇండియన్( వైఐ)పై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ విచారణ జరుపుతోంది.
ఢిల్లీ, ముంబాయి, లక్నో వంటి నగరాల్లో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన 661.69 కోట్ల రూపాయల స్థిరాస్తులను, యంగ్ ఇండియన్‌కు ఏజెఎల్‌లో ఈక్విటీ షేర్ల రూపంలో ఉన్న 90.21 కోట్ల రూపాయలను ఈడీ జప్తు చేసిందని ఏఎన్‌ఐ రిపోర్టు చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దీనిపై ఏఐసిసి అధికార ప్రతినిధి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రస్తుతం వివిధ రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఎదురు కాబోయే ఓటమి నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికే బీజేపీ ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతోందని అన్నారు.
“ఇదంతా అబద్ధాలు, కట్టుకథలతో అల్లిన కేసు. ఇలాంటి ప్రతీకార చర్యలకు కాంగ్రెస్ పార్టీ బెదరదు” అని ఆయన ఈ ప్రకటనలో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
హమాస్ చేతిలో బందీలుగా ఉన్న తమ దేశ పౌరుల విడుదలపై త్వరలో మంచి వార్త వింటామని ఆశిస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ చెప్పినట్టు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది.
హమాస్ చేతిలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను వెనక్కి రప్పించడానికి తీసుకుంటున్న చర్యలు పురోగతిలో ఉన్నాయని ఆయన చెప్పారు.
హమాస్ నేత ఇస్మాయిల్ హనియా తమ గ్రూపు ‘ఇజ్రాయెల్‌తో ఒప్పందానికి చేరవవుతున్నట్టు’ చెప్పారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు కూడా ‘‘ బందీలను తిరిగి తీసుకొచ్చే విషయంలో మేం పురోగతి సాధిస్తున్నాం, త్వరలోనే మంచి వార్త వింటామనే ఆశ ఉంది’’ అని చెప్పారు.
గాజాకు తీసుకువెళ్ళిన ఇజ్రాయెలీ బందీలలో కొందరిని వదిలిపెట్టడం, దీనికి బదులుగా దాడులకు విరామం ఇవ్వడం, పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడం ఈ ఒప్పందంలో ఉండవచ్చని బీబీసీ కరస్పాండెంట్ ఫ్రాంక్ గార్డనర్ చెప్పారు.
ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈ ఒప్పందం ప్రకారం హమాస్ చేతిలో బందీగా ఉన్న 50 మంది పౌరులను విడిచిపెట్టాలి. దీనికి బదులుగా ఇజ్రాయెల్ తన కస్టడీలో ఉన్న పాలస్తీనా మహిళలు, చిన్నారులను విడుదల చేయాల్సి ఉంటుందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి తమ గ్రూప్ చేరవవుతున్నట్లు హమాస్ నేత ఇస్మాయిల్ హనియా తెలిపారు.
ఖతార్‌కు తమ స్పందనను తెలియజేసినట్లు హమాస్ జారీ చేసిన ప్రకటనలో చెప్పింది.
ఇజ్రాయెల్-హమాస్‌కు మధ్య ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. హనియా ఖతార్‌లోనే ఉంటున్నారు.
అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ అధ్యక్షులు కూడా ఖతార్‌ను సందర్శించారు.
బందీలను విడుదల చేసే విషయంపై డీల్ తుది దశకు చేరుకుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా సంకేతాలిచ్చారు.
ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య ఆరు వారాలుగా ఈ ఘర్షణలు జరుగుతున్నాయి.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిపిన తర్వాత ఈ ఉద్రిక్తతలు చెలరేగాయి.
హమాస్ ఫైటర్లు 200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకెళ్లారు.
గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులు ప్రారంభించిన తర్వాత, గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ ఆర్మీ గ్రౌండ్ ఆపరేషన్‌ను చేపడుతోంది.
డీల్ కింద హమాస్ చేతుల్లో బందీగా ఉన్న కొందరు ఇజ్రాయెల్ పౌరులను విడిచిపెట్టే అవకాశం ఉంది.
దీనికి బదులుగా గాజాలో తన ఆపరేషన్‌ను ఇజ్రాయెల్ ఆపివేయాల్సి ఉంటుందని, కొందరు పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టాలని పలు కథనాలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, REUTERS/SHANKAR PRASAD NAUTIYAL
ఉత్తరకాశీ సమీపంలోని సిల్క్యారా గ్రామ సమీపంలో, సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులకు సంబంధించిన వీడియోను న్యూస్ ఏజెన్సీ పీటీఐ ట్విటర్‌లో షేర్ చేసింది.
నవంబర్ 12వ తేదీన సొరంగం కూలిన ఘటనలో 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. అప్పటి నుంచి వారిని రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి.
సోమవారం రెస్క్యూ బృందం ఆరు అంగుళాల పైప్‌లైన్‌ను శిథిలాల మధ్య నుంచి సొరంగంలోకి పంపి, ఆహారాన్ని పెద్ద మొత్తంలో సరఫరా చేయడంతోపాటు, సొరంగం లోపలి పరిస్థితులను తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేసింది.
ఇందుకు సంబంధించి, లోపల చిక్కుకున్న కార్మికుల వీడియోను అధికారులు విడుదల చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
నవంబర్ 23 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. ఈ సిరీస్‌కు సూర్య కుమార్ యాదవ్‌ను టీమిండియా కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
రుతురాజ్ గైక్వాడ్ మొదటి మూడు మ్యాచ్‌లకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. చివరి రెండు మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఉంటాడని బీసీసీఐ కార్యదర్శి జై షా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
వరల్డ్ కప్ టోర్నీలో ఆడిన ఆటగాళ్లలో ఎక్కువ మందికి ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు.
టీమిండియా ఇదీ: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్సర్ పటేల్, శివమ్ దూబె, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్.
నవంబర్ 23న విశాఖపట్నంలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. రెండో మ్యాచ్ 26న తిరువనంతపురంలో, మూడో మ్యాచ్ 28న గువహాటిలో, డిసెంబరు 1న నాలుగో మ్యాచ్ రాయ్‌పూర్‌లో, ఐదో మ్యాచ్ డిసెంబర్ 3న బెంగళూరులో జరుగుతాయి.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.