క్రికెట్ వరల్డ్ కప్: 'ముంబయి సెమీ ఫైనల్లో ఏమైనా జరగవచ్చు' - న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్

ప్రపంచకప్ మొదటి సెమీ ఫైనల్ ముందు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ‘ముంబయిలో ఏమైనా జరగొచ్చు’ అంటూ భారత జట్టును హెచ్చరించారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

    ధన్యవాదాలు.

  2. ‘గతం గురించి ఆలోచించం... ఇదే ఊపును కొనసాగిస్తాం’ – రోహిత్ శర్మ

    రోహిత్ శర్మ

    ఫొటో సోర్స్, Getty Images

    వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, న్యూజీలాండ్ బలాలు, బలహీనతలు ఏంటో తమ జట్టుకు బాగా తెలుసని అన్నాడు.

    ప్రపంచ కప్ తొలి సెమీ ఫైనల్లో బుధవారం నాడు భారత్, న్యూజీలాండ్‌తో తలపడుతుంది. ఈ టోర్నమెంటులో భారత్ ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వరసగా తొమ్మిది మ్యాచుల్లో భారత్ విజయం సాధించింది. లీగ్ రౌండులో న్యూజీలాండ్‌ను భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది.

    ధర్మశాలలో జరిగిన ఆ మ్యాచ్‌లో న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా ఆడలేదు. ముంబయిలో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విలియమ్సన్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో విజయావకాశాలు రెండు జట్లకూ సమానంగా ఉన్నాయని ఆయన అన్నారు.

    న్యూజీలాండ్ చక్కని క్రమశిక్షణ కలీగిన జట్టు అని చెబుతూ, “వాళ్లు చాలా తెలివిగా ఆడతారు. భారత జట్టులోని ఆటగాళ్ళు చాలా మంది గురించి వారికి బాగా తెలుసు” అని రోహిత్ శర్మ అన్నారు. “అయితే, మాకు కూడా ఆ జట్టు గురించి బాగా తెలుసు. ఆ జట్టు బలాలేమిటో, బలహీనతలేమిటో మాకు తెలుసు” అని కూడా రోహిత్ వ్యాఖ్యానించారు.

    2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టును న్యూజీలాండ్ ఓడించింది. దీనిపై రోహిత్,“మా ఆటగాళ్ళు గతం గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు ఎలా ఆడాలి, ఎంత బాగా ఆడాలన్నదే మా జట్టు ధ్యేయం” అని అన్నారు. ఇప్పటివరకూ ఎలా ఆడుతూ వచ్చామో అదే వేగాన్ని కొనసాగిస్తామని కూడా రోహిత్ చెప్పారు.

  3. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా భారత్ ఎందుకు ఓటు వేసింది?

  4. ‘ముంబయిలో ఏమైనా జరగొచ్చు’ - న్యూజీలాండ్ కెప్టెన్ హెచ్చరిక

    న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్

    ఫొటో సోర్స్, Getty Images

    ప్రపంచకప్ మొదటి సెమీ ఫైనల్ ముందు న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ‘ముంబయిలో ఏమైనా జరగవచ్చు’ అంటూ భారత జట్టును హెచ్చరించారు.

    ముంబయిలో ఈ ఇరు జట్లు బుధవారం తలపడనున్నాయి.

    ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు అజేయంగా సాగుతోంది. లీగ్‌ మ్యాచ్‌లో న్యూజీలాండ్‌ను కూడా భారత జట్టు ఓడించింది.

    అయితే ఆ మ్యాచ్‌లో గాయం కారణంగా కేన్ విలియమ్సన్ ఆడలేదు.

    మ్యాచ్‌కు ముందు విలియమ్సన్ మీడియాతో మాట్లాడుతూ ‘‘ మా సామర్థ్యం మేరకు ఆడితే ఏమైనా జరగొచ్చు’’ అని చెప్పారు.

    ఐసీసీ టోర్నమెంట్స్‌లో ఇండియాపై న్యూజీలాండ్‌కు మెరుగైన రికార్డు ఉంది.

    2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో న్యూజీలాండ్ భారత జట్టును ఓడించింది.

    వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ న్యూజీలాండ్ భారత జట్టుపై గెలిచింది.

    ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శన ప్రత్యేకంగా ఉందని, అయినా సెమీస్‌లో ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉన్నాయని న్యూజీలాండ్ కెప్టెన్ అన్నారు.

    ‘‘ మాదైన రోజున మేం చెలరేగితే మంచి అవకాశాలు ఉంటాయి’’ అని చెప్పారు.

    ముంబయిలో జరిగే సెమీ ఫైనల్‌కు ఇప్పటికే టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి.

    ప్రేక్షకులందరూ భారత జట్టుకు మద్దతుగా నిలిచేందుకు సిద్ధమవుతున్నారు.

    ఈ పరిస్థితి గురించి విలియమ్సన్ మాట్లాడుతూ ‘‘ సెమీ ఫైనల్లో స్టేడియం అంతటా నీలిసంద్రంలా కనిపిస్తుందని (భారత జట్టు జెర్సీ నీలం రంగు) భావిస్తున్నాను. మా జట్టులోని సభ్యులందరూ అన్ని రకాల పరిస్థితులు ఆడేందుకు అలవాటు పడ్డారు. ఇలాంటి పరిస్థితులలో ఆడేందుకు అవకాశం వస్తే కచ్చితంగా అది ప్రత్యేకమే అవుతుంది’’ అని చెప్పారు.

  5. నేపాల్: టిక్‌టాక్‌ను నిషేధిస్తూ ప్రభుత్వ నిర్ణయం

    టిక్‌టాక్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తోందన్న కారణంతో టిక్‌టాక్‌ను బ్యాన్ చేసింది నేపాల్ ప్రభుత్వం

    సోషల్ నెట్‌వర్క్ వేదిక టిక్‌టాక్‌ను నిషేధిస్తూ నేపాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    “సామాజిక సామరస్యం” దెబ్బతింటోందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది.

    సోషల్ మీడియా సంస్థలు తమ దేశంలో అనుబంధ కార్యాలయాలను ఏర్పాటు చేయాలన్న కొత్త నిబంధనను ప్రవేశపెట్టిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకున్నారు.

    ఇప్పటికే టిక్‌టాక్‌ను భారత్ సహా పలు దేశాలు నిషేధించాయి. ఈ ఏడాదిలోనే అమెరికాలోని మొంటానా రాష్ట్రం కూడా టిక్‌టాక్‌ను బ్యాన్ చేసింది.

    టిక్‌టాక్ హానికరమైన కంటెంట్‌ను వ్యాప్తి చేస్తోందని నేపాల్ ఐటీ, సమాచార శాఖ మత్రి రేఖా శర్మ అన్నారు.

    అయితే, నేపాల్ కాంగ్రెస్ సీనియర్ నేత ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు.

    ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాసే ప్రయత్నం అని, ఇందుకు బదులుగా అధికారులు నియంత్రణపై దృష్టి సారించాలని అన్నారు.

    టిక్‌టాక్‌పై ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలు విమర్శలు చేస్తున్నాయి. చైనా ప్రభుత్వానికి డేటాను అందజేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.

    అయితే, టిక్‌టాక్ పేరెంట్ కంపెనీ అయిన బైట్‌డ్యాన్స్ గతంలో ఈ ఆరోపణలను ఖండించింది.

    నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టిక్‌టాక్‌ను బీబీసీ సంప్రదించినా, స్పందించలేదు.

  6. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఈ మహిళా అభ్యర్థుల ప్రత్యేకతలేంటి?

  7. సరస్వతి నది నిజంగానే ఉందా... ఏమిటి దీని మిస్టరీ?

  8. సెమీ ఫైనల్: 'చోకర్స్’ ట్యాగ్‌ను తిప్పి కొట్టి, ఇండియా చరిత్ర తిరగరాస్తుందా?

  9. 'దైవదూత వచ్చాడు' అంటూ అఫ్గానిస్తాన్ క్రికెటర్ రహ్మానుల్లాను ఎందుకు ప్రశంసిస్తున్నారు?

  10. కేసీఆర్ ప్రభుత్వంలో కుటుంబ సభ్యుల పాత్ర ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిందా?

  11. ఇండియా Vs న్యూజిలాండ్: సెమీఫైనల్ మ్యాచ్ టికెట్లు బ్లాక్ మార్కెట్‌లో అమ్మకం.. ఒకరి అరెస్ట్

    క్రికెట్ వరల్డ్ కప్ 2023

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ఇండియా, న్యూజిలాండ్ మధ్య బుధవారం ముంబయిలో సెమీ ఫైనల్ జరుగనుంది.

    ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం ముంబయిలో జరుగనున్న వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.

    బ్లాక్ మార్కెట్‌లో టికెట్లు విక్రయిస్తున్న ఆకాష్ మహేష్ కొఠారి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ముంబయి డీసీపీ (సర్కిల్-1) ప్రవీణ్ ముండే చెప్పారని వార్తాసంస్థ పీటీఐ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    “రూ.2,500 నుంచి రూ.4,000 మధ్య ఉండే మ్యాచ్ టికెట్లను రూ.25 వేల నుంచి రూ.50 వేలకు అమ్ముతున్నట్లు మాకు సమాచారం వచ్చింది. మా బృందం నిందితుడిని అరెస్టు చేసింది. ఈ కేసుపై విచారణ జరుగుతోంది” అని డీసీపీ చెప్పారు.

  12. బ్రిటన్: రిషి సునక్ కేబినెట్‌లోకి విదేశాంగ మంత్రిగా మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్

    డేవిడ్ కామెరూన్

    ఫొటో సోర్స్, EPA

    ఫొటో క్యాప్షన్, బ్రిటన్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డేవిడ్ కామెరూన్

    బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ అనూహ్యంగా విదేశాంగ మంత్రి అయ్యారు.

    బ్రెగ్జిట్ రెఫరెండంలో ఓటమి తర్వాత 2016లో ప్రధాని పదవికి రాజీనామా చేశారు డేవిడ్ కామెరూన్. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగానే ఉన్నారు.

    ఇంతకుముందు రిషి సునక్ ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు చేశారు.

    ముఖ్యంగా ఉత్తర భాగాన హైస్పీడ్ రైల్ 2(హెచ్ఎస్2) ప్రాజెక్టు విషయంలో రిషి సునక్ ప్రభుత్వం వెనక్కి తగ్గడం, యూకే సహాయ బడ్జెట్‌లో కోత వంటి నిర్ణయాలను కామెరూన్ వ్యతిరేకించారు.

    విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ- “రిషి సునక్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని వ్యక్తిగత నిర్ణయాలతో విభేదించినప్పటికీ, రాజకీయాల ప్రయోజనాల దృష్ట్యా మద్దతు ఇస్తున్నాను” అన్నారు.

    “మాజీ ప్రధానిగా పనిచేసిన వ్యక్తి మళ్లీ తిరిగి రావడం అంత సాధారణమైన విషయమేమీ కాదు” అని ఆయన చెప్పారు.

    “ఈ కష్ట సమయంలో చాలా క్లిష్టమైన బాధ్యతను నిర్వర్తిస్తున్న రిషి సునక్‌కు నేను మద్దతు ఇస్తున్నాను. రిషి సునక్ సమర్ధతను నేను నమ్ముతున్నాను. అందుకే ఈ బృందంలో చేరాలని నిర్ణయించుకున్నాను” అన్నారు.

    సువెల్లా బ్రేవర్మన్

    ఫొటో సోర్స్, PA Media

    ఫొటో క్యాప్షన్, సువెల్లా బ్రేవర్మన్‌ను హోం మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత రిషి సునక్ కేబినెట్‌లో మార్పులు అవసరమయ్యాయి.

    సువెల్లా బ్రేవర్మన్‌ను హోం మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కామెరూన్ విదేశాంగ మంత్రి అయ్యారు.

    పాలస్తీనా మద్దతుదారుల మార్చ్‌ను నియంత్రించడంలో బ్రిటన్ పోలీసులు పక్షపాత వైఖరి ప్రదర్శించారంటూ సువెల్లా బ్రేవర్మన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెను కేబినెట్ నుంచి తొలగించారు.

    విదేశాంగ మంత్రిగా ఉన్న జేమ్స్ క్లెవరీని హోం మంత్రిగా నియమించారు.

  13. తొలి ప్రధాని నెహ్రూ మొట్టమొదటి టీవీ ఇంటర్వ్యూ ఇదే

  14. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.