You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం : సికింద్రాబాద్ సభలో ప్రధాని మోదీ

మాదిగలకు అన్యాయం జరిగిందని తాము భావిస్తున్నామని, 30 ఏళ్ళుగా మాదిగల పోరాటానికి నాయకత్వం వహిస్తున్న మందకృష్ణ నిజమైన యోధుడని ప్రధాని కొనియాడారు.

లైవ్ కవరేజీ

  1. వరల్డ్ కప్: కేఎల్ రాహుల్ ఫాస్టెస్ట్ సెంచరీ, నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం

  2. ప్రపంచ కప్: నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం

    ప్రపంచ కప్‌ టోర్నమెంటులో నెదర్లాండ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది.

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది.

    ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో నెదర్లాండ్స్ విఫలమైంది. 47.5 ఓవర్లలో 250 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.

  3. రష్యా ఇచ్చిన ఏ బలంతో అమెరికాపై హిజ్బుల్లా కన్నెర్ర చేసింది? ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో హిజ్బుల్లా చేరుతుందా?

  4. కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన ఆర్‌ఎస్. ప్రవీణ్ కుమార్

    తెలంగాణలోని కుమ్రంభీమ్ అసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌‌లో బీఆర్ఎస్, బీఎస్పీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

    ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్ సిల్క్ కాలనీలో బీఎస్పీ అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

    అనంతరం ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ తన పార్టీ కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. తమ ప్రచారాన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటోందని, ప్రచారం చేసుకునే తమ హక్కును కాలరాస్తున్నారని, ఈ విషయంలో గతంలో ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవని అన్నారు.

    పట్టణంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.

  5. ఇజ్రాయెల్- గాజా: ఆ వాట్సాప్ గ్రూప్ మూగబోయింది, ఎందుకంటే అందులో ఉన్నవారంతా చనిపోయారు

  6. నెదర్లాండ్స్‌పై సెంచరీలు చేసిన శ్రేయస్, కేఎల్ రాహుల్, భారీ స్కోర్ చేసిన భారత్

    క్రికెట్ వరల్డ్ కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది.

    బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది.

    శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సెంచరీలు బాదారు. 94 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో శ్రేయస్ మొత్తం 128 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో 102 పరుగులు చేశాడు.

    మరోవైపు, ఒక ఏడాదిలో వన్డే మ్యాచుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. 2015లో ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న 58 సిక్స్‌ల రికార్డును 60 సిక్స్‌లతో రోహిత్ శర్మ అధిగమించాడు. అందులో ఈ వరల్డ్ కప్‌లోనే 24 సిక్స్‌లు కొట్టడం విశేషం.

    అలాగే, అత్యధిక పరుగులు చేసిన భారత మూడో ఓపెనర్‌గానూ నిలిచాడు. 14 వేల పరుగుల మైలురాయిని దాటాడు.

  7. దీపావళి: టపాకాయలు కాల్చితే అన్ని రకాల రంగులు ఎలా వస్తాయి?

  8. గ్రౌండ్‌లోనే కుప్పకూలి చనిపోయిన ఫుట్‌బాల్ ఆటగాడు రఫేల్ డ్వమేనా

    ఘనాకి చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు రఫేల్ డ్వమేనా గుండెపోటుతో గ్రౌండ్‌లోనే కుప్పకూలారు. అల్బేనియాలో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో 28 ఏళ్ల డ్వమేనా గుండెపోటుకి గురయ్యారు.

    అల్బేనియాకు చెందిన ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ పార్టిజనితో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఇగ్నేషియా క్లబ్ తరఫున డ్వమేనా ఆడుతున్నారు.

    ''ఆయన కుప్పకూలిన వెంటనే వైద్య నిపుణులు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ, దురదృష్టవశాత్తూ డ్వమేనా చనిపోయారు'' అల్బేనియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ తెలిపింది.

    ఈ ఏడాది జరిగిన అల్బేనియన్ లీగ్‌లో తొమ్మిది గోల్స్ సాధించి అత్యధిక గోల్స్ వేసిన ఆటగాడిగా నిలిచారు డ్వమేనా. ఆయన 9 క్యాప్‌లు గెలుచుకున్నారు.

    డ్వమేనా అకాల మరణంతో శనివారం మ్యాచ్‌ను రద్దు చేశారు. అల్బేనియాలో ఈ వారంలో జరగాల్సిన మ్యాచ్‌లను కూడా వాయిదా వేశారు.

  9. ఆంధ్రప్రదేశ్: చెట్టు కిందే గర్భిణులు, రోగులకు వైద్యం.. కుట్లు, కట్లు కూడా అక్కడే.. రేకుల షెడ్డులో వైద్య సామగ్రి, మందులు

  10. ఉత్తరాఖండ్‌: కుప్పకూలిన సొరంగం, చిక్కుకున్న 36 మంది కార్మికులు

    ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం కుప్పకూలడంతో అందులో 36 మంది కార్మికులు చిక్కుకుపోయారు.

    యమునోత్రి జాతీయ రహదారి వద్ద శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

    సిల్క్యారా నుంచి దండల్ గావ్ వరకు ఈ సొరంగం తవ్వుతున్నారు.

    సిల్క్యారా నుంచి సొరంగానికి 200 మీటర్ల దూరంలో ఇది విరిగిపోయింది. దీంతో సొరంగంలో పనిచేస్తున్న 36 మంది కార్మికులు అందులో నుంచి బయటికి రాలేకపోయారు.

    ఉత్తరకాశీ జిల్లా ఎస్పీ అర్పణ్ యదువంశీ ఘటనా స్థలానికి చేరుకొని, పరిస్థితిని సమీక్షించారు.

    "సొరంగం ప్రారంభంలో 200 మీటర్ల దూరంలో విరిగిపోయింది. టన్నెల్ నిర్మాణ పనులు చూస్తున్న హెచ్‌ఐడీసీఎల్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 36 మంది సొరంగంలో చిక్కుకుపోయారు, వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసు బలగాలు, ఎన్డీఆర్ఎఫ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం వచ్చాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొస్తాం'' అని తెలిపారు ఎస్పీ.

  11. గాజా: ‘బాంబు దాడిలో నా రెండేళ్ల పాప కాళ్లు పోగొట్టుకుంది.. ఏం తప్పు చేసిందని?’

  12. గాజా ఆసుపత్రిపై మేం దాడి చేయలేదు: ఇజ్రాయెల్

    గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిపై తాము దాడులకు దిగలేదని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే ఉత్తర గాజాలో హమాస్ మిలిటెంట్లతో ఘర్షణలు జరిగినట్లు అంగీకరించింది.

    మరోవైపు ఆసుపత్రిలో నీరు, ఆహారం, విద్యుత్ కొరత ఏర్పడిందని, ప్రభావం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను తాకినట్లు గాజా నగరంలోని ఆసుపత్రికి చెందిన సర్జన్ బీబీసీతో చెప్పారు.

    ఆసుపత్రిలో ఇద్దరు చనిపోయారని, మరో 37 మంది ప్రమాదం బారిన పడొచ్చని వైద్యులు చెప్పడంతో శిశువులను సురక్షితమైన ఆసుపత్రికి తరలించాలని ఇజ్రాయెల్ సూచించింది.

    మరోవైపు లెబనాన్ మిలీషియా హిజ్బుల్లాను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి హెచ్చరించారు. గాజాలో ఇజ్రాయెల్ ఏం చేస్తుందో బీరుట్‌లోనూ చేయగలదని వ్యాఖ్యానించారు.

  13. ఉత్తరాఖండ్‌: కుప్పకూలిన సొరంగం, చిక్కుకున్న 36 మంది కార్మికులు

  14. రొమ్ము క్యాన్సర్‌ నివారణకు అనస్ట్రోజోల్ డ్రగ్

  15. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

  16. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం : సికింద్రాబాద్ సభలో ప్రధాని మోదీ

    సామాజిక న్యాయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ తమ ధ్యేయమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.

    సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభకు ప్రధాని నరేంద్ర మోదీ హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు దశాబ్దాల మాదిగల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని అన్నారు.

    అనేక పార్టీలు మాదిగలను వాడుకున్నాయని, కానీ బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయాలనే సంకల్పంతో ఉందన్నారు.

    మాదిగలకు అన్యాయం జరిగిందని తాము భావిస్తున్నామని, 30 ఏళ్ళుగా మాదిగల పోరాటానికి నాయకత్వం వహిస్తున్న మందకృష్ణ నిజమైన యోధుడని ప్రధాని కొనియాడారు.

    ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ అంశానికి కట్టుబడి ఉన్నట్టు ప్రధాని చెప్పారు. భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ మాదిగ విరోధులని ప్రధాని విమర్శించారు.

  17. క్రికెట్ వరల్డ్ కప్ 2023: పాకిస్తాన్ ఇంటికి, సెమీస్‌లో భారత్ vs న్యూజీలాండ్....

  18. పాకిస్తాన్‌లో హరిఘర్ ఉంటుందా అని బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నిస్తున్నారు?

  19. గాజాపై ఇజ్రాయెల్ అణుదాడి చేస్తుందా, అరబ్ దేశాలు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి?

  20. తెలంగాణ: రికార్డు మెజార్టీతో సీట్లు నెగ్గిన కమ్యూనిస్టు పార్టీల ప్రస్తుత పరిస్థితి ఏంటి వాటి ప్రాభవం ఎలా తగ్గుతూ వస్తోంది?