గాజా: ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటికే 9 వేల మంది చనిపోయారన్న హమాస్ ఆరోగ్య శాఖ

అక్టోబర్ 7 నుంచి కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులలో 9 వేల మందికి పైగా చనిపోయారని, ఉత్తర గాజాలోని యూఎన్ స్కూల్‌ వద్ద తాజాగా జరిగిన దాడిలో 27 మంది మృతి చెందారని హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ ఇంతటితో ముగిస్తున్నాం

    బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.

    తాజా అప్డేట్స్‌తో రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం.

    ధన్యవాదాలు.

  2. గాజాలోని యూఎన్ స్కూల్ సమీపంలో జరిగిన దాడుల్లో 27 మంది మృతి చెందారన్న హమాస్

    ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం

    ఫొటో సోర్స్, Reuters

    ఉత్తర గాజాలోని జబలియాలో ఐక్యరాజ్యసమితి స్కూల్ సమీపంలో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 27 మంది చనిపోయారని గాజాలోని హమాస్ ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

    అయితే, మృతుల సంఖ్యను బీబీసీ ధ్రువీకరించలేదు. ఈ విషయంపై ఐక్యరాజ్యసమితి స్పందన కోసం బీబీసీ ప్రయత్నిస్తోంది.

    ఏఎఫ్‌పీ వార్తా సంస్థ ఫుటేజీలో సంఘటన స్థలంలో ప్రజలు తీవ్రగాయాలతో ఉన్నట్లు కనిపిస్తోంది.

    కొద్దిరోజులుగా జబలియా ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడులు జరుగుతున్నాయి. వీటిపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు స్పందించలేదు.

  3. ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధంలో ఏ దేశం ఎటువైపు?

  4. గాజాలో 9,000 దాటిన మరణాలు, హమాస్ బందీలు 242

    ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం

    ఫొటో సోర్స్, Getty Images

    ఇజ్రాయెల్ - హమాస్ ఘర్షణ ప్రారంభమైన అక్టోబర్ 7 నుంచి ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 9,061కి చేరిందని గాజా హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. అందులో 3,760 మంది చిన్నారులు ఉన్నారని, 32 వేల మందికి పైగా గాయపడ్డారని పేర్కొంది.

    హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర గాజాపై వైమానిక దాడులతో బాంబుల వర్షం కురిపిస్తోంది.

    హమాస్ జరిపిన దాడిలో ఇజ్రాయెల్‌లో 1400 మంది చనిపోయారు. దాదాపు 200 మందికి పైగా హమాస్ బందీలుగా తమ అదుపులోకి తీసుకుంది.

    హమాస్ చెరలో 242 మంది బందీలుగా ఉన్నారని తాజాగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయి. మొదట్లో 239 మంది బందీలుగా ఉన్నట్లు చెప్పాయి.

    గాజాలోని వేర్వేరు చోట్ల సొరంగాల్లో బందీలను ఉంచామని, ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో వారిలో 50 మంది వరకూ చనిపోయారని హమాస్ చెబుతోంది.

  5. శ్రీలంకపై 302 పరుగుల తేడాతో గెలిచి సెమీస్‌కు చేరిన భారత్.. చెలరేగిన షమీ, సిరాజ్

  6. తెలంగాణలో బీసీని సీఎం చేస్తామన్న బీజేపీ... తెలుగు ముఖ్యమంత్రుల్లో ఏ కులం వారు ఎందరున్నారు?

  7. క్రికెట్ వరల్డ్ కప్: శ్రీలంక టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చిన సిరాజ్

    మహమ్మద్ సిరాజ్

    ఫొటో సోర్స్, Getty Images

    ఇండియన్ పేసర్, హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ శ్రీలంక టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు.

    ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ నిశాంక(0)‌ వికెట్ల ముందు బుమ్రాకి దొరికిపోయాడు. ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

    ఆ తర్వాత బంతిని అందుకున్న పేసర్ సిరాజ్ తొలిబంతికే శ్రీలంక బ్యాట్స్‌మెన్ కరుణరత్నె(0)ను పెవిలియన్ బాట పట్టించాడు. కరుణరత్నె కూడా వికెట్ల ముందు దొరికిపోయాడు. అదే ఓవర్ ఐదో బంతికి (1.5 ఓవర్స్) సదీర సమరవిక్రమ స్లిప్‌లో శ్రేయస్ అయ్యర్‌కి చిక్కి డకౌట్‌గా వెనుదిరిగాడు.

    ఆ తర్వాత మూడో ఓవర్ వేసిన బుమ్రా కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు.

    నాలుగో ఓవర్‌లో సిరాజ్ వేసిన తొలి బంతికే కుశాల్ మెండిస్(1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

    నాలుగు వికెట్లు కోల్పోయి శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

  8. ట్యూషన్ టీచర్‌తో క్లోజ్‌గా ఉంటున్నాడని బడా వ్యాపారి కుమారుడిని కిడ్నాప్ చేసి చంపేశారు... మతం రంగు పులిమిన ఈ కుట్రను పోలీసులు ఎలా ఛేదించారు?

  9. క్రికెట్ వరల్డ్ కప్: శ్రీలంక టార్గెట్ 358

    ఇండియా వర్సెస్ శ్రీలంక

    ఫొటో సోర్స్, Getty Images

    ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంకకు టీమిండియా భారీ టార్గెట్ ఇచ్చింది. 358 పరుగులు భారీ విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది.

    కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగు పరుగులకే ఔట్ అయినప్పటికీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ జోడీ భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.

    శుభ్‌మన్ గిల్ 92 పరుగులు, కోహ్లీ 88 పరుగులు చేసి భారత్‌ను భారీ స్కోరు దిశగా నడిపించారు. వాళ్లిద్దరి తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ దీటుగా ఆడుతూ 82 పరుగులు చేయడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది.

  10. గాజా చరిత్ర: ఎన్నో విధ్వంసాలు, విపత్తులు, విషాదాలను భరించిన వేల ఏళ్ళనాటి నగరం

  11. ఇండియా వర్సెస్ శ్రీలంక: సెంచరీ మిస్ చేసుకున్న విరాట్ కోహ్లీ, మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా

    పెవిలియన్ బాట పట్టిన విరాట్ కోహ్లీ

    ఫొటో సోర్స్, Getty Images

    క్రికెట్ ప్రపంచ కప్‌ 2023 పోటీల్లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది.

    స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మరోసారి సెంచరీ మిస్ చేసుకున్నాడు. మరో 12 పరుగుల దూరంలో ఉండగా 88 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. దీంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది.

    సచిన్ తెందూల్కర్ పేరుమీద ఉన్న వన్డేల్లో 49 సెంచరీల రికార్డును సమం చేసే అవకాశాన్ని మరోసారి కోహ్లీ జారవిడుకున్నాడు.

    మొదటి ఓవర్‌‌లోనే కెప్టెన్ రోహిత్ శర్మ ఔట్ కాగా, ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి కోహ్లీ భారీ భాగస్వామ్యం అందించాడు. ఈ మ్యాచ్‌లో 92 పరుగులు చేసిన గిల్ శ్రీలంక బౌలర్ దిల్షాన్ మదుశంక బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

    టీమిండియా 36 ఓవర్లు పూర్తయ్యే నాటికి మూడు వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది.

    టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్‌ను ఎంచుకుంది.

    భారత జట్టు తరపున రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. కానీ రోహిత్ శర్మ తొలి ఓవర్లోనే ఔటయ్యాడు.

  12. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 35 మందితో బీజేపీ మూడో జాబితా

    బీజేపీ

    ఫొటో సోర్స్, BJP Telangana/Facebook

    ఫొటో క్యాప్షన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, లక్ష్మణ్, బీజేపీ నాయకులు

    భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం (సెంట్రల్ ఎలక్షన్ కమిటీ) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 35 మందితో మూడో విడత ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ మూడో విడత ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.

    ఇప్పటికే 52 మందితో తొలివిడత, కేవలం ఒక్క అభ్యర్థి పేరుతో రెండోవిడత జాబితాలను బీజేపీ ప్రకటించింది. మొత్తం 88 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థులను ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఖరారు చేసింది.

    మూడో విడత జాబితాలో ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎల్బీ నగర్ నుంచి సామ రంగారెడ్డి, సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి, బాన్సువాడ నుంచి యెండల లక్ష్మీనారాయణ, ఆందోల్ (ఎస్సీ) బాబూ మోహన్, జడ్చర్ల నుంచి చిత్తరంజన్‌దాస్ పోటీ చేయనున్నారు.

    బీజేపీ మూడో జాబితా

    ఫొటో సోర్స్, BJP Telangana/Facebook

    బీజేపీ మూడో జాబితా

    ఫొటో సోర్స్, BJP Telangana/Facebook

  13. పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ ఎదుట హాజరైన మహువా మెయిత్రా

    మహువా మొయిత్రా

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా

    పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా గురువారం పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ ఎదుట విచారణకు హాజరయ్యారు.

    మొయిత్రా లంచాలు తీసుకుని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడుగుతున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు.

    ఆసియాలోని ధనవంతుల్లో ఒకరైన గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ సంస్థలే లక్ష్యంగా ఎంపీ మొయిత్రా ప్రశ్నలు అడుగుతున్నారని, అందుకు ప్రతిఫలంగా ఒక వ్యాపారవేత్త నుంచి ఖరీదైన బహుమతులు, నగదు అందుకున్నారని ఆయన ఆరోపణలు చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    అయితే, ఈ ఆరోపణలను ఖండించిన మొయిత్రా, తాను ఎలాంటి విచారణకైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. దూబే ఆరోపణలపై పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ గురువారం నుంచి విచారణ మొదలుపెట్టింది.

  14. , ఈడీ విచారణకు గైర్హాజరైన అరవింద్ కేజ్రీవాల్

    దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, అరవింద్ కేజ్రీవాల్

    దిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులో ఈరోజు ఈడీ ఎదుట విచారణకు హాజరుకావల్సిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు.

    ఈ మేరకు ఆయన తన వివరణను తెలుపుతూ ఈడీకి లేఖ రాశారు. ఆ లేఖలో,

    ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్. స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నందున ఎన్నికల ప్రచారం, పార్టీ కార్యకర్తలకు రాజకీయ దిశానిర్దేశం చేయడానికి ప్రయాణాలు చేయాల్సి ఉందని, దీనితోపాటు దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకుని, దిల్లీ ముఖ్యమంత్రిగా తాను నిర్వర్తించాల్సిన పాలనా పరమైన, బాధ్యతలు ఉన్నాయని తెలిపారు. ఈడీ జారీ చేసిన సమన్లను వెనక్కి తీసుకోవాలని కోరారు.

    తనకు జారీ చేసిన సమన్లలో వివరాలు స్పష్టంగా లేవని, తనను సాక్షిగా పేర్కొంటూ విచారణకు పిలుస్తున్నారా, లేదా అనుమానితుడిగా పేర్కొంటూ విచారణకు పిలుస్తున్నారో కూడా స్పష్టత లేదని పేర్కొన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    అక్టోబర్ 30వ తేదీ నుంచి బీజేపీ నేతలు తనకు సమన్లు వస్తాయని, అరెస్ట్ అవుతానని చెప్పడం మొదలుపెడితే, ఆరోజు సాయంత్రానికి సమన్లు వచ్చినట్లుగా లేఖలో తెలిపారు.

    దీనిని బట్టి సమన్లకు సంబంధించిన సమాచారం ముందే బీజేపీ నేతలకు తెలుసని అర్థమవుతోందన్నారు.

    ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందున ఈడీ తన అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని సమన్లను వెనక్కి తీసుకోవాలని కోరారు.

    దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో దిల్లీలోని ఈడీ కార్యాలయం వద్ద భద్రతను పెంచారు.

  15. వరల్డ్ కప్ 2023: రాహుల్ ద్రావిడ్ తనకు చేదు అనుభవాన్ని మిగిల్చినవాళ్ళకు ఈసారి గట్టిగా బదులిస్తారా?

  16. ఇది కేసీఆర్ ఫ్యామిలీ ఏటీఎం-కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ సందర్శనలో రాహుల్ ఆరోపణలు

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, RahulGandhi/Twitter

    ఫొటో క్యాప్షన్, బరాజ్‌ను పరిశీలిస్తున్న రాహుల్ గాంధీ

    కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల దోపిడీ జరిగిందని, కానీ, ప్రజలకు మాత్రం ఏ ప్రయోజనమూ కలగలేదని రాహుల్ గాంధీ అన్నారు.

    ఇటీవల కుంగిన మేడిగడ్డ బరాజ్‌ పరిశీలన కోసం వచ్చిన ఆయన, అంబటిపల్లి గ్రామంలో స్థానిక మహిళలు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

    “కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుని చేసిన దోపిడీ సొమ్ముని తిరిగి రాబట్టి,ప్రజల బ్యాంకు ఖాతాల్లో వేస్తాం” అన్నారు.

    ఈ దోపిడీతో మహిళలే అత్యధికంగా ప్రభావం అవుతారన్న రాహుల్ గాంధీ, “మేం అధికారంలోకి వచ్చాక మహిళలకు రూ. 500లకే వంట గ్యాస్ సిలెండర్, ప్రతి నెల రూ. 2500, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం”అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    తెలంగాణలో దొరల సర్కారును గద్దె దింపి కాంగ్రె స్ ఆధ్వర్యంలోని ప్రజల సర్కారును అధికారంలోకి తేవాలని రాహుల్ గాంధీ కోరారు.

    సభ అనంతరం మేడిగడ్డ బరాజ్ ఏరియల్ సర్వే, సందర్శనలకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు రాహుల్ గాంధీ.

    ఆయన పర్యటన కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు మేడిగడ్డ బరాజ్ వైపు బారికేడ్లను తోసుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

    మేడిగడ్డ బరాజ్ పరిశీలనలో రాహుల్

    ఫొటో సోర్స్, RahulGandhi/Twitter

    ఫొటో క్యాప్షన్, మేడిగడ్డ బరాజ్ పరిశీలనలో రాహుల్ గాంధీ
  17. కోవిడ్‌ తర్వాత గుండెపోటు మరణాలు పెరిగాయా, కరోనా వచ్చినవారు పరిగెత్తవద్దని ఆరోగ్యమంత్రి ఎందుకు హెచ్చరించారు?

  18. ఆంధ్రప్రదేశ్‌లో కరవు తీవ్రతను ప్రభుత్వం దాస్తోందా? వాస్తవాలు ఏమిటి?

  19. నారాయణ మూర్తి: వారానికి 70 పని గంటలపై భారత్‌లో జరుగుతున్న చర్చ ఏంటి?

  20. గాజా: మూడు వారాల తరువాత తెరచుకున్న రఫా క్రాసింగ్‌

    రాఫా క్రాసింగ్

    ఫొటో సోర్స్, EPA

    ఫొటో క్యాప్షన్, విదేశీ పౌరులు గాజాను విడిచివెళ్లేందుకు అనుమతులు లభించాయి

    అక్టోబర్ 7న ఇజ్రాయెల్-గాజాల మధ్యన మొదలైన ఘర్షణల నేపథ్యంలో మూసివేసిన రఫా క్రాసింగ్‌ను తెరిచారు.

    ఈజిప్టు-గాజాల మధ్యన ఉన్న ఈ రఫా క్రాసింగ్‌ నుంచి మానవతాసాయం అందించేందుకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. బుధవారం నుంచి సాధారణ పౌరులు కూడా వెళ్లేందుకు అనుమతులు లభించడంతో, గాజాలోనే చిక్కుకుపోయిన విదేశీ పౌరులు, అత్యవసర వైద్య సహాయం కోసం వేచిచూస్తున్న పౌరులకు ఊరట లభించింది.

    ఇప్పటివరకు 400 మందికి పైగా బార్డర్ దాటినట్లు, వారిలో 335 మంది విదేశీ పౌరులు, 76మంది క్షతగాత్రులు గాజా నుంచి వెళ్లినట్లుగా పాలస్తీనా అధికారులు తెలిపారు.

    విదేశీ పౌరుల్లో ఎక్కువశాతం బ్రిటన్, అమెరికా పౌరులే ఉన్నారని అధికారులు తెలిపారు.

    అమెరికా అధ్యక్షులు జో బైడెన్ రఫా క్రాసింగ్ తెరిచే నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఇది “అత్యవసర దౌత్య నిర్ణయం” అని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా గాజాలో ఉన్న అమెరికా పౌరులను సురక్షితంగా తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

    20 మంది ఆస్ట్రేలియా పౌరులు తాము రఫా క్రాసింగ్‌ను దాటినట్లుగా నమోదు చేసుకున్నారని ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది. తమ దేశ పౌరులు క్షేమంగా తిరిగి వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.