You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం, 13 మంది ఏపీ వాసులు దుర్మరణం

మంచు కారణంగా రహదారి సరిగా కనిపించకపోవంతో ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు చిక్కబళ్లాపూర్ ఎస్పీ నగేశ్ చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. అర్ధరాత్రి గాజాలోకి ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు.. యుద్ధంలో మరో దశ మొదలైందా?

  3. ఎనిమిది మంది భారత మాజీ నేవీ అధికారులకు ఖతార్‌లో మరణ శిక్ష.. అసలేం జరిగింది?

  4. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన శ్రీలంక

    గురువారం బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌ ఇంగ్లండ్‌ను శ్రీలంక చిత్తు చేసింది.

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, 33.2 ఓవర్లలో 156 పరుగులకే కుప్ప కూలింది. 43 పరుగులు చేసిన బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ బ్యాటర్లలో టాప్ స్కోరర్.

    శ్రీలంక ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా, ఇంగ్లండ్ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని అలవోకగానే ఛేదించింది.

    శ్రీలంక 25.4 ఓవర్లలో రెండే వికెట్లు నష్టపోయి 160 పరుగులు చేసింది. ఓపెనర్ పథుమ్ నిస్సంక (83 బంతుల్లో 77 నాటౌట్), సదీర సమరవిక్రమ (54 బంతుల్లో 65 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించారు.

    బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్ వికెట్లు తీసిన శ్రీలంక బౌలర్ లహిరు కుమార ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. అతడు 35 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.

    ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో శ్రీలంక ఐదో స్థానంలో ఉంది.

    ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు ఓడిపోయి, ఒక్కటే గెలిచిన ఇంగ్లండ్ తొమ్మిదో స్థానంలో ఉంది.

    పదో స్థానంలో నెదర్లాండ్స్ ఉంది.

  5. ఆంధ్రప్రదేశ్: అటు భువనేశ్వరి, ఇటు మంత్రులు...పోటాపోటీ బస్సు యాత్రల్లో అందరి లక్ష్యం ఒకటేనా?

  6. కర్ణాటకలో రోడ్డు ప్రమాదం, 13 మంది ఏపీ వాసులు దుర్మరణం

    కర్ణాటకలోకి చిక్కబళ్లాపూర్ పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 13మంది మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఐదుగురు ప్రమాద ప్రాంతంలో చనిపోగా, 8 మంది ఆసుపత్రిలో చనిపోయారు.

    ఆగి ఉన్న సిమెంట్ లారీని సుమో బలంగా ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో టాటా సుమోలో 18 మంది ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు.

    మృతులు శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలంలోని సమీప పల్లెలకు చెందిన వారిగా పోలీసులు నిర్ధరించారు.

    దసరా పండుగ కోసం ఊరికి వచ్చి తిరుగు ప్రయాణంలో బెంగళూరుకు వెళ్తున్న కొందరు కూలీలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మృతుల్లో ఉన్నారు.

    మంచు కారణంగా రహదారి సరిగా కనిపించకపోవంతో ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు చిక్కబళ్లాపూర్ ఎస్పీ నగేశ్ చెప్పారు.

    మృతుల కుటుంబాలకు ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ సంతాపం తెలియజేశారు.

  7. మగవారి కోసం కు.ని. ఇంజెక్షన్ తెచ్చిన ఐసీఎంఆర్, ఇది వైద్య రంగంలో మలుపు అవుతుందా...

  8. కెనడియన్లకు భారత వీసా సేవలు మళ్లీ ప్రారంభం

    కెనడియన్లకు భారత్ వీసా సేవలు తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఒట్టావాలోని భారత హైకమిషన్ ప్రకటించింది. సెప్టెంబర్‌లో దౌత్యపరమైన వివాదం తలెత్తడంతో కెనడియన్లకు భారత్ వీసా సేవలు నిలిపివేసింది.

    భద్రతాపరమైన సమస్యలతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియా తెలిపింది. తాజాగా భద్రతా పరిస్థితిని సమీక్షించిన తర్వాత అక్టోబర్ 26 నుంచి వీసాల జారీని మళ్లీ ప్రారంభించబోతున్నట్లు బుధవారం భారత హైకమిషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

    ప్రస్తుతానికి ఎంట్రీ, బిజినెస్, మెడికల్, కాన్ఫరెన్స్ వీసాల సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపింది.

  9. బ్రేకింగ్ న్యూస్, అమెరికాలో కాల్పులు, 16 మంది మృతి

    అమెరికాలో మైనే రాష్ట్రంలోని లెవిస్టన్ నగరంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 16 మంది మృతి చెందారు. మరో 50 మంది గాయపడ్డారు.

    హాస్కెమెనీ రెస్టారెంట్‌తో పాటు బౌలింగ్ గేమ్ జోన్ అయిన స్పేర్ టైమ్ రిక్రియేషన్‌లో కాల్పులు జరిగినట్లు లెవిస్టన్ పోలీసులు తెలిపారు.

    రాబర్ట్ కార్డ్ అనే 40 ఏళ్ల వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

    నిందితుడు బయటే తిరుగుతున్నాడని, చుట్టుపక్కల వారంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

    ఈ దాడులపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

    ఈ సంఘటన గురించి ప్రెసిడెంట్ బైడెన్‌కు సమాచారం అందించామని వైట్ హౌస్ ప్రకటించింది.

  10. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.