ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
ప్రపంచ కప్ 2023లో సౌత్ ఆఫ్రికా జట్టు ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. 229 పరుగుల భారీ తేడాతో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ కప్ 2023లో సౌత్ ఆఫ్రికా జట్టు ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. 229 పరుగుల భారీ తేడాతో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది.
ఈ టోర్నమెంట్‌లో సౌత్ ఆఫ్రికా జట్టు గెలవడం ఇది మూడోసారి.
ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 7 వికెట్లను కోల్పోయి 399 పరుగులు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్, వరుసగా వికెట్లను కోల్పోయింది.
100 పరుగులు చేసిన సమయంలో, ఇంగ్లాండ్ జట్టుకు చెందిన 8 మంది ఆటగాళ్లు పెవిలియన్‌కు చేరారు.
ఆ తర్వాత మార్క్ వుడ్, ఆట్కిన్సన్ భాగస్వామ్యంలో ఈ జట్టు 70 పరుగులు చేసింది. మొత్తంగా 170 పరుగులకే ఇంగ్లాండ్ జట్టు కుప్పకూలింది.

పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి, ముస్లిం లీగ్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ తిరిగి స్వదేశం చేరుకున్నారు.
ఆయన విమానం శనివారం ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకుంది.
నాలుగేళ్ల స్వీయ ప్రవాసం తర్వాత నవాజ్ షరాఫ్ పాకిస్తాన్ తిరిగి వచ్చారు.
ప్రస్తుత ప్రభుత్వంతో సయోధ్య కుదిరిన తర్వాత షరీఫ్ పాకిస్తాన్ రావడానికి మార్గం సుగుమమైంది.
విమానశ్రయం నుంచి నేరుగా లాహోర్ వెళ్తారని, అక్కడ ప్రసంగిస్తారని మాజీ సమాచార మంత్రి మరియం ఔరంగజేబు చెప్పారు.
2017 జూలైలో పనామా కేసులో నవాజ్ షరీఫ్ జైలు పాలయ్యారు. ఈ కేసు కారణంగా ఆయన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకోవడం అది మూడోసారి. ఐదేళ్ల పదవి కాలం పూర్తి కాకుండానే అంతకుముందు కూడా రెండుసార్లు ప్రధాని పదవి నుంచి షరీఫ్‌ను తొలగించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, US Embassy Jerusalem
ఇజ్రాయెల్‌పై దాడి చేసి, హమాస్ అపహరించిన 200 మందిలో ఇద్దరు అమెరికా పౌరులను విడుదల చేసింది.
అమెరికాకు జూడిత్ రానన్, ఆమె కుమార్తె నటాలిలను విడుదల చేసింది.
హమాస్ మిలిటెంట్ వింగ్- అల్ కస్సాం బ్రిగేడ్స్ విడుదల చేసిన వీడియోలో ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ (ICRC) యూనిఫాం ధరించిన ఇద్దరు కార్మికులు తల్లీకూతుళ్లను తీసుకొస్తున్న దృశ్యాలు కనిపించాయి.
అమెరికా అధ్యక్షులు బైడెన్ మాట్లాడినట్లు యూఎస్ ఎంబసీ ట్వీట్ కూడా చేసింది.
“వారు క్షేమంగా ఉన్నారన్న సమాచారం మాకు తృప్తినిచ్చింది. హమాస్ అపహరించిన వారిని విడిపించి, వారి కుటుంబంతో కలిపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం“ అంటూ ఎంబసీ ట్వీట్‌లో తెలిపింది.
వైట్ హౌస్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో అమెరికా పౌరుల విడుదల పట్ల బైడెన్ సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిపింది.
చికాగోలో ఉండే నటాలి రానన్ తండ్రి ఉరి రానన్‌ను ఏపీ న్యూస్ ఏజెన్సీ సంప్రదించింది.
“నా జీవితంలోనే ఈ రెండు వారాల కాలం చాలా దారుణంగా గడిచింది. నా కుటుంబం విడుదలైందని తెలిసి ఎంతో ఆనందం కలిగింది. శుక్రవారం నా కూతురితో మాట్లాడాను. సంతోషంతో నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. క్షేమంగానే ఉన్నానని నా కూతురు చెప్పింది“ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
గగన్‌యాన్ టెస్ట్ ఫ్లైట్ TV D1 ప్రయోగంలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరి చేసి, మళ్లీ ప్రయోగం చేపట్టింది ఇస్రో.
శనివారం ఉదయం 10:00 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ నుంచి విడిపోయిన క్రూ ఎస్కేప్ మాడ్యుల్ సురక్షితంగా కిందకు చేరుకుంది.
క్రూ ఎస్కేప్ మాడ్యుల్ నుంచి పారాచ్యూట్లు తెరచుకుని సురక్షితంగా సముద్రంలో దిగింది. దీనితో TV D1 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది. ప్రయోగాన్ని వీక్షిస్తున్న శ్రీహరికోటలోని శాస్త్రవేత్తలు, సిబ్బంది చప్పట్లు కొడుతూ, సంతోషం వ్యక్తం చేశారు.
"లాంచ్ విజయవంతమైందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను" అని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ప్రయోగం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
శనివారం ఉదయం ప్రారంభమైన గగన్‌యాన్ టెస్ట్ ఫ్లైట్ TV D1 ప్రయోగం, చివరి క్షణంలో సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది.
దీనిపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ స్పందించారు. లోపం ఎక్కడ జరిగిందో విశ్లేషించి, మళ్లీ ప్రయోగం చేపడతామని తెలిపారు.
కొద్ది క్షణాల క్రితమే, ఇస్రో ట్వీట్ చేసింది. లోపాన్ని సరిచేశామని, 10:00 గంటలకు తిరిగి ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ISRO
మానవ సహిత అంతరిక్ష ప్రయోగాల కోసం ఇస్రో మొదలుపెట్టిన గగనయాన్ మిషన్‌లో భాగంగా శనివారం ఉదయం జరగాల్సిన టెస్ట్ ఫ్లైట్ TV D1 ప్రయోగం సాంకేతిక కారణాల వలన నిలిచిపోయింది. ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.
ఇస్రో ఈ ప్రయోగాన్ని శనివారం ఉదయం 8.00 గంటలకు లాంచ్ చేయాలని భావించింది. వాతావరణం అనుకూలించకపోవడంతో 8:45 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది.
ప్రయోగం మొదలై, కౌంట్ డౌన్ మైనస్ 5 సెకెన్ల వరకూ అంతా సవ్యంగా సాగింది. కానీ ఇంజిన్‌ను స్టార్ట్ చేసే కమాండ్ ఇవ్వాల్సిన ఆటోమెటిక్ లాంచింగ్ సీక్వెన్స్ (ALS) ఆదేశాలతో ఇంజిన్ ఇగ్నిషన్ అనుకున్నట్లుగా జరగలేదని సోమనాథ్ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
“ఆటోమెటిక్ లాంచ్ సీక్వెన్స్ (ALS) ప్రయోగాన్ని ఎందుకు హోల్డ్‌లో పెట్టిందన్న అంశాన్ని పూర్తిస్థాయిలో విశ్లేషిస్తాం. టెస్ట్ ఫ్లైట్ వెహికిల్ TV-D1 సురక్షితంగా ఉంది. అన్ని పరిశీలించాక, త్వరలోనే మళ్లీ ప్రయోగాన్ని చేపడతాం. విశ్లేషణ అనంతరం మరిన్ని వివరాలు తెలియజేస్తాం” అని ఆయన అన్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.