గాజా ఆస్పత్రిపై దాడిలో పౌరుల మృతిపై ప్రధాని మోదీ ఏమన్నారు?

అల్ అహ్లి ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడిలో సుమారు 500 మంది చనిపోయారని గాజా ఆరోగ్య విభాగం చెప్పింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. అఫ్గానిస్థాన్‌పై 149 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

    న్యూజీలాండ్ vs అఫ్గానిస్తాన్

    ఫొటో సోర్స్, Getty Images

    ప్రపంచ కప్‌లో భాగంగా చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ జట్టుపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది.

    తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్, 50 ఓటర్లలో ఆరు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.

    289 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ ప్రారంభంలోనే వికెట్లను కోల్పోయింది. 34.4 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

    న్యూజిలాండ్ 149 పరుగుల తేడాతో గెలిచింది.

    80 బంతుల్లో 71 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన కివీస్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు.

  3. నిద్ర పట్టట్లేదా? ఈ టెక్నిక్స్ పాటించండి

  4. ‘రెండేళ్లుగా పీరియడ్స్ రావట్లేదు. సెక్స్‌లో పాల్గొంటే చాలా ఇబ్బందిగా ఉంటోంది. ఎందుకిలా?’

  5. రాహుల్ గాంధీ: ‘ఇవి ప్రజల తెలంగాణ, దొరల తెలంగాణ మధ్య ఎన్నికలు’

    రాహుల్ గాంధీ, ప్రియాంకను ఆహ్వానిస్తున్న కాంగ్రెస్ నేతలు
    ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీ, ప్రియాంకలను ఆహ్వానిస్తున్న కాంగ్రెస్ నేతలు

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ‘ప్రజల తెలంగాణ, దొరల తెలంగాణ’ మధ్య జరుగుతున్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.

    ములుగులో జరిగిన బహిరంగ సభలో రాహుల్, ఆయన సోదరి ప్రియాంక పాల్గొన్నారు.

    కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే తెలంగాణ ఏర్పాటు చేశామని రాహుల్ చెప్పారు. ఇప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని ఆయన తెలిపారు.

    అంతకుముందు రాహుల్, ప్రియాంక రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఆరు గ్యారంటీల కార్డుకు పూజలు చేశారు.

    రామప్ప దేవాలయం అద్భుతంగా ఉందని,తన జీవితంలో అలాంటి ఆలయాన్ని ఇంతవరకూ చూడలేదన్నారు ప్రియాంక.

    కాంగ్రెస్ విజయభేరి యాత్రను ప్రియాంక, రాహుల్ రామప్ప ఆలయం నుంచి ప్రారంభించారు.

  6. చమురును అరబ్ దేశాలు 50 ఏళ్ల క్రితమే ఆయుధంగా ఎలా మలచుకున్నాయి? ఆ తర్వాత ప్రపంచం ఎలా మారిపోయింది?

  7. ‘గ్లూటెన్’ అంటే ఏమిటి? ఇది లేని ఆహారం మంచిదేనా?

  8. గాజా ఆస్పత్రిపై దాడిలో పౌరుల మృతిపై ప్రధాని మోదీ ఏమన్నారు?

    ప్రధాని మోదీ

    ఫొటో సోర్స్, Getty Images

    గాజా నగరంలోని అల్ అహ్లి ఆసుపత్రి‌పై దాడిలో వందల మంది పౌరులు చనిపోవడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సామాజిక మాధ్యమాల్లో స్పందించారు.

    “గాజాలోని అల్ అహ్లి ఆసుపత్రిలో ప్రజల ప్రాణాలు పోవడం దిగ్భ్రాంతి కలిగించింది. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ యుద్ధంలో పౌరులు మరణించడం విషాదకరం. ఇందుకు బాధ్యులైన వారిని శిక్షించాలి” అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

    అల్ అహ్లి ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడిలో సుమారు 500 మంది చనిపోయారని గాజా ఆరోగ్య విభాగం చెప్పింది.

    ఆస్పత్రిపై ఇజ్రాయెలే వైమానిక దాడి చేసిందని మిలిటెంట్ సంస్థ హమాస్ ఆరోపిస్తోంది. దాడితో తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాదీ రాకెట్లు గురితప్పడం వల్ల ఈ పేలుళ్లు జరిగాయని ఇజ్రాయెల్ అంటోంది.

    ఈ దాడి దారుణమైన యుద్ధ నేరమని, ఇజ్రాయెల్ అన్ని హద్దులూ దాటేసిందని పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ చెప్పారు.

    అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని మోదీ మాట్లాడుతూ- ఈ కష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు భారత్ అండగా నిలుస్తుందని చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. గాజా: 'మురికి నీళ్లు తాగుతున్నా, నాకు వేరే ఆప్షన్ లేదు'

  10. సుప్రీంకోర్టు తీర్పుతో నిరాశలో ఎల్‌జీబీటీక్యూ ప్లస్ కమ్యూనిటీ, మరి ఇప్పుడేం చేయబోతున్నారు?

  11. హైదరాబాద్ గాలి కాలుష్యం :‘‘ముక్కుకు బట్టలు కట్టుకుని వస్తున్నారు...ఇక్కడ ఎలా బతుకుతున్నారని అడుగుతున్నారు’’

  12. అమెరికా ఎంబసీల వద్ద నిరసనలు, రాళ్ల దాడులు

    లెబనాన్‌లో నిరసనలు

    ఫొటో సోర్స్, EPA

    ఫొటో క్యాప్షన్, బీరుట్‌లోని యూఎస్ ఎంబసీ ఎదుట కొనసాగుతున్న నిరసనలు

    గాజాలోని అల్ అహ్లీ ఆసుపత్రి పేలుళ్ల ఘటనపై పలు దేశాల్లోని అమెరికా, ఫ్రెంచ్, ఇజ్రాయెల్ ఎంబసీల ఎదుట పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి.

    • మంగళవారం రాత్రి వెస్ట్ బ్యాంక్‌లోని పలు నగరాల్లో వందలమంది రోడ్లపైకి వచ్చి పాలస్తీనా అథారిటీ ప్రెసిడెంట్ మహ్ముద్ అబ్బాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, భద్రతా దళాలపై రాళ్లదాడికి దిగారు. నిరసనకారులను నిలువరించడానికి భద్రతా దళాలు టియర్ గ్యాస్, స్టన్ గ్రనేడ్లను ప్రయోగించాల్సి వచ్చింది.
    • లెబనాన్‌లోని హిజ్‌బుల్లా మిలిటెంట్ సంస్థ ముస్లింలు, అరబ్బులు ఈ దాడిని ఖండిస్తూ వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. బేరూత్ ‌లోని అమెరికా ఎంబసీ వద్ద నిరసనకారులు పెద్ద ఎత్తున చేరి, ఆందోళన నిర్వహించారు. ఫ్రెంచ్ ఎంబసీ భవనంపై రాళ్లదాడులు జరిగాయి.
    • ట్రిపోలీతోపాటు పలు లిబియా నగరాల్లోనూ వందలమంది పాలస్తీనా జెండాలు పట్టుకుని, నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.
    • ఇరాన్ రాజధాని టెహరాన్‌లోని ఫ్రెంచ్, బ్రిటీష్ ఎంబసీలు, తుర్కియే, జోర్దాన్‌లోని ఇజ్రాయెల్ ఎంబీసీల వద్ద నిరసనలు జరిగాయి.

    దాడి ఆమోదయోగ్యం కాదు-ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం

    “ఈ దాడి ఏమాత్రం ఆమోదయోగ్యమైనది కాదు. ఈ విషాద ఘటనపై స్పందించడానికి నాకు మాటలు కూడా రావడం లేదు” అని గాజా ఆసుపత్రి వద్ద జరిగిన పేలుళ్లపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగాధిపతి వొల్కర్ టర్క్ స్పందించారు.

    “అల్ అహ్లీ అరబ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లు, వైద్య సిబ్బందితోపాటు, ఆసుపత్రి పరిసరాల్లో తలదాచుకుంటున్న వందల మంది చనిపోయారు. ఈ దాడిని ఖండిస్తున్నాను” అన్నారు.

  13. ఇజ్రాయెల్ vs హమాస్: ‘‘ఈ ఘర్షణ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా?’’

  14. గాజా ఆస్పత్రి పేలుళ్లలో 500 మంది మృతి చెందారన్న హమాస్

    గాజాలో ఆస్పత్రిపై దాడి

    ఫొటో సోర్స్, Reuters

    గాజా సిటీలోని అసుపత్రి వద్ద జరిగిన పేలుళ్లలో వందల మంది చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఇక్కడ 500 మంది మృతి చెందారని హమాస్ ప్రకటించింది. ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంలో గాయాలపాలైన పాలస్తీనీయులు చికిత్స పొందుతున్న అల్ అహ్లీ ఆస్పత్రి వద్ద ఈ పేలుళ్లు జరిగాయి.

    ఈ దాడి చేసింది ఇజ్రాయెలేనని హమాస్ ఆరోపిస్తోంది. ఆస్పత్రిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిందని హమాస్ ఆరోపించింది. ఇది యుద్ధనేరంగా అభివర్ణించింది.

    అయితే, దీంతో తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాదీ రాకెట్లు గురితప్పడం వల్ల ఈ పేలుళ్లు జరిగాయని చెబుతోంది.

    ఆసుపత్రిపై దాడి

    ఫొటో సోర్స్, Getty Images

    ఈ దాడి గురించి ఆసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఒకరు బీబీసీతో మాట్లాడారు. “వందల మంది చనిపోయారు, అంతే సంఖ్యలో గాయపడ్డారు. ఇది ఘోరమైన దాడి'' అని అన్నారు.

    ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ దాడులను ఖండించినట్లు రాయిటర్స్ తెలిపింది. ఇది “క్రూరమైన తీవ్రవాదులు” చేసిన దాడిగా ఆయన చెప్పారని పేర్కొంది.

    మరోవైపు ఈ దాడికి అమెరికాదే బాధ్యతని హమాస్ నాయకులు ఇస్మాయిల్ హనియే అన్నారు. “ఇజ్రాయెల్ దూకుడుకి అమెరికా మద్దతిస్తోంది. ఆసుపత్రి మారణకాండను చూస్తే శత్రువు ఓటమి భయంతో ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది” అని ఆయన ఒక టీవీ చానెల్ ప్రసంగంలో అన్నారు.

  15. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  16. బీఆర్ఎస్ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందేంటి, చేసిందేంటి?

  17. తెలంగాణ ఎన్నికలు: ఆ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓటర్లు మహిళలే అయినా ఒక్కరూ ఎమ్మెల్యే కాలేకపోయారు, ఎందుకు?

  18. చికెన్ బిర్యానీ 100, మటన్ బిర్యానీ 150.. తెలంగాణలో అభ్యర్థుల ఖర్చుల్లో అంతకంటే తక్కువ చూపించడానికి వీల్లేదు

  19. ఎంఎల్ఏ అభ్యర్థిగా పోటీ చేయడం ఎలా... కావల్సిన అర్హతలేంటి?

  20. ఎలక్షన్ కోడ్ వచ్చేసింది.. ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?