లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలో ఉన్న అష్కేలన్ సిటీలో ప్రజలు సాయంత్రం ఐదింటికల్లా నగరాన్ని ఖాళీ చేసి వెళ్లాలని హమాస్ మిలిటెంట్లు చెప్పారు. సమయం ఐదు గంటలు దాటిన తర్వాత రాకెట్లతో విరుచుకుపడ్డారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.
ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలో ఉన్న అష్కేలన్ సిటీలో ప్రజలు సాయంత్రం ఐదింటికల్లా నగరాన్ని ఖాళీ చేసి వెళ్లాలని హమాస్ మిలిటెంట్లు ప్రకటించారు. సమయం ఐదు గంటలు దాటిన తర్వాత రాకెట్లతో విరుచుకుపడ్డారు.
కనిపించకుండా పోయిన అమెరికన్ల బంధువులు టెల్ అవీవ్‌లో మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబ సభ్యుల గురించి భయపెట్టే విషయాలు వింటున్నామని చెప్పారు.
శనివారం నుంచి జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 830 మంది పాలస్తీనీయులు మరణించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ వైపున 1008 మంది చనిపోయినట్లు అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం తెలిపింది.
“యుద్ధం ముగిసే వరకు” బందీల గురించి చర్చించేదేమీ లేదని హమాస్ ప్రకటించింది. హమాస్ చెరలో 100 నుంచి 150 మంది బందీలుగా ఉన్నారని ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ ప్రతినిధి చెప్పారు.
హమాస్ దగ్గర బందీలుగా ఉన్నవారని విడిపించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది.
తమ వైమానిక దాడుల్లో ఇద్దరు హమాస్ సీనియర్ అధికారులు మరణించారనిఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అయితే ఈ మరణాలను హమాస్ ఇప్పటి వరకూ ధ్రువీకరించలేదు.
రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసులో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను సీఐడీ అధికారులు మంగళవారం విచారించారు.
కుంచనపల్లిలోని సీఐడీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లోకేశ్‌ను ప్రశ్నించారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చి, అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై సీఐడీ కేసు నమోదు చేసింది.
హైకోర్టు ఆదేశాల మేరకు, విచారణలో లోకేశ్ తరపు న్యాయవాదులను కూడా సీఐడీ అధికారులు అనుమతించారు.
ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేని 50 ప్రశ్నలు తనను అడిగారని విచారణ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో అన్నారు.
తనను అడిగిన వాటిలో 49 ప్రశ్నలు గూగుల్‌లో కొడితే సమాధానం వచ్చేవని లోకేశ్ వ్యాఖ్యానించారు.
‘‘మీరు ఏం చేస్తుంటారు? హెరిటేజ్‌లో పని చేసినప్పుడు మీ హోదా ఏంటి? ప్రభుత్వంలో మీరు ఏ బాధ్యతలు నిర్వహించారు? ఇటువంటి గూగుల్‌లో దొరికేవన్నీ నన్ను అడిగారు’’ అని ఆయన చెప్పారు.
తన ముందు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ పెట్టలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షమైనా, ప్రజలనైనా కక్ష సాధించడం అలవాటుగా మారిందన్నారు.
హెరిటేజ్‌తోపాటు లింగమనేని రమేష్ వంటి వారికి లబ్ధి చేకూర్చారనే ఫిర్యాదుతో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు నమోదైంది.
అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ సహా పలువురిని ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు.
లోకేశ్ పేరును కూడా నిందితుడిగా చేర్చి విచారణకు నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో నారాయణ భార్య సహా పలువురికి సీఐడీ నోటీసులు జారీ చేసింది.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తనకు ఫోన్ చేశారని, ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
ఈ విషయాన్ని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్(ట్విటర్)లో తెలిపారు.
‘‘ఈ కష్టసమయంలో భారత ప్రజలు ఇజ్రాయెల్‌కు తోడుగా ఉంటారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ ఖండిస్తోంది’’ అని మోదీ చెప్పారు.
ఇజ్రాయెల్ దాడులపై ఆయన ఇంతకుముందు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్‌లో దాడుల గురించి విని షాక్ అయ్యానని ఆయన చెప్పారు.
ఈ దాడుల బాధితులకు, చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.
శనివారం హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేశారు. దీనికి ప్రతీకారంగా పాలస్తీనా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు చేపడుతోంది.
ఇజ్రాయెల్-పాలస్తీనా ప్రాంతాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి.
ఇజ్రాయెల్‌పై శనివారం హమాస్ చేసిన దాడుల్లో తమ ప్రమేయం లేదని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ స్పష్టం చేశారు.
కానీ, జియోనిస్ట్ పాలనపై దాడులకు ప్రణాళిక రచించిన వారి చేతులను ముద్దాడతామని ఆయన అన్నట్లు రాయిటర్స్ వార్తాసంస్థ పేర్కొంది.
హమాస్‌కు నిధులు సమకూరుస్తుందని... వారికి శిక్షణ, మిలిటెంట్లకు ఆయుధాలను సరఫరా చేస్తుందని ఇరాన్‌పై ఆరోపణలున్నాయి.
భారత్‌లో క్రికెట్ వరల్డ్ కప్‌ను కవర్ చేస్తోన్న పాకిస్తానీ ప్రజెంటర్ సోమవారం దేశం విడిచి వెళ్లిపోయారు.
గతంలో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లపై తీవ్ర వ్యతిరేకత ఎదురైన తర్వాత ఆమె భారత్ విడిచి వెళ్లినట్లు చెబుతున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రజెంటర్లలో జైనాబ్ అబ్బాస్ కూడా ఒకరు.
ఆమెను బలవంతంగా పంపించారని కొన్ని స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నారు.
వ్యక్తిగత కారణాలతో ఆమె వెళ్లిపోయారని బీబీసీతో ఐసీసీ అధికార ప్రతినిధి చెప్పారు.
భారత్ నుంచి వెళ్లిపోవడం గురించి జైనాబ్ అబ్బాస్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
జైనాబ్ అబ్బాస్ గతంలో భారత్, హిందూ మతాన్ని అపహాస్యం చేస్తూ అభ్యంతరకర, రెచ్చగొట్టే పోస్ట్‌లు చేశారంటూ న్యాయవాది వినీత్ జిందాల్ గతవారం దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమె తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు.
ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్ పరిసర ప్రాంతాల్లో 1,500 మంది హమాస్ తీవ్రవాదులు హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
గాజా చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న ఇజ్రాయెల్ ప్రజలందరినీ సురక్షితంగా తరలించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి రిచర్డ్ హయెట్ తెలిపారు.
గాజాలోని స్థానిక అధికారుల ప్రకారం, శనివారం నుంచి ఇప్పటివరకు గాజాలో సుమారు 700 మంది మరణించారు.
క్రికెట్ అభిమానులకు శుభవార్త. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో 2028లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చవచ్చు.
ఈ విషయాన్ని ఐసీసీ తెలిపింది.
లాస్ ఏంజిల్స్- 2028 ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్‌ను చేర్చాలని నిర్వాహకులు సూచించినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.
‘‘2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలని సిఫారసు చేసినందుకు మేం సంతోషిస్తున్నాం. దీని గురించి రెండేళ్ల పాటు ఎల్‌ఏ-28 నిర్వాహకులతో కలిసి పనిచేశాం. ఒలింపిక్స్ క్రీడల జాబితాలో చేర్చడానికి నిర్వాహకులు సూచించిన క్రీడల్లో ఇప్పుడు క్రికెట్ కూడా ఉంది’’ అని ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్కెల్ అన్నారు.
ఒలింపిక్స్‌లో చేర్చేందుకు సూచించిన జాబితాలో క్రికెట్‌తో పాటు ఫ్లాగ్ ఫుట్‌బాల్, బేస్ బాల్, సాఫ్ట్‌బాల్ కూడా ఉన్నాయి.
అయితే, ఈ సిఫార్సులపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది.
1900 ఒలింపిక్స్‌లో మాత్రమే ఒక్కసారి క్రికెట్ భాగంగా ఉంది.
తమ శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించి హమాస్‌ను ఓడిస్తామని ఇజ్రాయెల్ చెప్పింది.
ఒకవేళ ఇజ్రాయెల్, గాజా పౌరులను ముందుగా హెచ్చరించకుండా దాడులకు పాల్పడితే, ఇజ్రాయెల్ బందీలను చంపేస్తామని హమాస్ సైనిక విభాగం అధికార ప్రతినిధి ప్రకటించారు.
గాజాపై ఇజ్రాయెల్ నిరంతర దాడుల గురించి స్పందిస్తూ హమాస్ సైనిక విభాగం పైవిధంగా స్పందించింది.
కస్సామ్ బ్రిగేడ్ అధికార ప్రతినిధి సోమవారం విడుదల చేసిన ఒక ఆడియోలో మాట్లాడుతూ, ‘‘గాజాలోని పౌర ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రం అయ్యాయి. ఇళ్లలో సురక్షితంగా ఉన్న మా పౌరులను ఎలాంటి హెచ్చరికలు లేకుండా లక్ష్యంగా చేసుకుంటే, మా వద్ద ఉన్న శత్రుదేశపు బందీలను చంపుతామని ప్రకటిస్తున్నా’’ అని అన్నారు.
హమాస్ దాడులపై తమ దేశం ప్రతిస్పందన గురించి మాట్లాడుతూ ‘‘ ఇది కేవలం ఆరంభమే’’ మాత్రమే అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు.
"ఇది ప్రారంభం మాత్రమే. మేమంతా మీ వెంటే ఉన్నాం. అపారమైన శక్తిని ఉపయోగించి వారిని ఓడిస్తాం. మధ్యప్రాచ్యాన్ని మారుస్తాం" అని అన్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.